హీరో ఎక్స్‌పల్స్ 200 అఫీషియల్ ఫోటోలు వచ్చేశాయ్!!
ప్రపంచపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ విపణిలోకి సరికొత్త అడ్వెంచర్ మోటార్ సైకిల్ ఎక్స్‌పల్స్ 200 (Xpulse 200) తయారు చేయడానికి సిద్దమైంది. తాజాగా, హీరో ఎక్స్‌పల్స్ 200 ఫోటోలు రివీల
ప్రపంచపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ విపణిలోకి సరికొత్త అడ్వెంచర్ మోటార్ సైకిల్ ఎక్స్‌పల్స్ 200 (Xpulse 200) పరిచయం చేయడానికి సిద్దమైంది. తాజాగా, హీరో ఎక్స్‌పల్స్ 200 ఫోటోలు రివీల్ అయ్యాయి.

ఇండియన్ మార్కెట్‌ను నుండి వైదొలగిన ఇంపల్స్ 150సీసీ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌కు కొనసాగింపుగా 200సీసీ ఎక్స్‌పల్స్ 200 బైకును తీసుకొస్తోంది. మీకు అడ్వెంచర్ రైడింగ్ అంటే ఇష్టమా...? మీరు అడ్వెంచర్ మోటార్ సైకిల్ ప్రియులా...? అయితే, భారతదేశపు ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైక్ హీరో ఎక్స్‍పల్స్ 200 గురించి పూర్తి వివరాలు మీ కోసం...

అడ్వెంచర్ రైడింగ్ ఇష్టపడే మధ్య తరగతి ఔత్సాహికులకు ఇండియాలో కొదవేలేదు. ఇలాంటి కస్టమర్ల కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ అడ్వెంచర్ బైకును లాంచ్ చేయాలని భావించిన హీరో ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో షోలో ఎక్స్‌పల్స్ 200 బైకును మొట్టమొదటిసారిగా ఆవిష్కరించింది.

తాజాగా ఫేస్‌బుక్‌లో విడుదలైన హీరో ఎక్స్‌పల్స్ 200 ఫోటోలను పరిశీలిస్తే, అడ్వెంచర్ మోటార్ సైకిల్లో గుర్తించే దాదాపు అన్ని ఫీచర్లు మరియు డిజైన్ అంశాలు ఇందులో ఉన్నాయి. ఎత్తైన రూపం, పెద్ద పెద్ద చక్రాలు, పాత కాలం తరహా గుండ్రటి హెడ్ ల్యాంప్ మరియు ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉన్నాయి.

హీరో ఎక్స్‌పల్స్ 200 బైకులో ముందు వైపున విండ్ స్క్రీన్, బైకు క్రింద పడితే హ్యాండిల్ లీవర్స్ రక్షించడానికి నకుల్ గార్డ్స్ వంటివి అందివ్వడం జరిగింది. ఆఫ్ రోడింగ్ చేసేటపుడు ఇంజన్ ఆయిల్ సంపును డ్యామేజ్ నుండి రక్షించేందుకు ఇంజన్ బాష్ ప్లేట్ మరియు లాంగ్ డ్రైవ్ చేస్తున్నపుడు అదనపు లగేజ్ తీసుకెళ్లడానికి బైకు వెనుక వైపున లగేజ్ ర్యాక్ కూడా అందివ్వడం జరిగింది.

సాంకేతికంగా హీరో ఎక్స్‌పల్స్ 200 బైకులో 200సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 18బిహెచ్‌పి పవర్ మరియు 17ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హీరో అతి త్వరలో విడుదల చేయనున్న ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకులో కూడా ఇదే ఇంజన్ అందించింది. కానీ, ఎక్స్‌పల్స్ 200 బైకులో అందించిన ఇంజన్‌ను ఆఫ్-రోడింగ్ అవసరాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దారు.

హీరో అడ్వెంచర్ మోటార్ సైకిల్ ఎక్స్‌పల్స్ 200 బైకులో ముందు వైపున పొడవాటి-ట్రావెల్ గల 190ఎమ్ఎమ్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ ఉంది. అదే విధంగా ఫ్రంట్ 21-అంగుళాల వీల్ మరియు రియర్ 19-అంగుళాల చక్రం ఉంది. బైకు ఓవరాల్ గ్రౌండ్ క్లియరెన్స్ 220ఎమ్ఎమ్‌గా ఉంది.

పటిష్టమైన బ్రేకింగ్ వ్యవస్థ కోసం రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి, వీటిలో ఒక చక్రానికి సింగల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లభిస్తుంది. మెరుగైన పనితీరు మరియు తక్కువ ధరలో అందించేందుకు స్పోక్ వీల్స్ మరియు ట్యూబ్ లెస్ టైర్లను అందివ్వనుంది. ఇందులో అధునాతన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇంజన్ కిల్ స్విచ్ వంటి ఎన్నో ఫీచర్లు రానున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
హీరో మోటోకార్ప్ గతంలో ఇంపల్స్ 150 బైకును అడ్వెంచర్ కస్టమర్లను ఉద్దేశించి లాంచ్ చేసింది. అయితే, పనితీరు పరంగా కస్టమర్లను ఆకట్టుకోలేక పోయింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు అత్యంత శక్తివంతమైన 200సీసీ ఇంజన్‌తో ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ను విడుదలకు చేసింది. రూ. 1 లక్ష రుపాయల ఎక్స్-షోరూమ్ ధరలో శ్రేణిలో రానున్న ఇది హీరోకు భారీ విజయాన్ని సాధించిపెట్టే అవకాశం ఉంది.
Source: Facebook


Click it and Unblock the Notifications








