హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ధరలు వచ్చేశాయ్!!

హీరో మోటోకార్ప్ తమ సరికొత్త ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకును ఇండియాలో లాంచ్ చేయడానికి కసరత్తులు ప్రారంభించింది. హీరో మోటోకార్ప్ తాజాగా తమ అఫీషియల్ వెబ్‌సైట్లో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ధరలను రివీల్ చేసింది.

By Anil Kumar

ప్రపంచపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ సరికొత్త ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకును ఇండియాలో లాంచ్ చేయడానికి కసరత్తులు ప్రారంభించింది. హీరో మోటోకార్ప్ తాజాగా తమ అఫీషియల్ వెబ్‌సైట్లో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ధరలను రివీల్ చేసింది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ధరలు వచ్చేశాయ్

హీరో మోటోకార్ప్ ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ధర రూ. 88,000 లుగా నిర్ణయించింది. అయితే, ఈ ధరలు భారతదేశపు ఈశాన్య రాష్ట్రాల కోసం మాత్రమేనని స్పష్టం చేసింది. ఈశాన్యంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మిజోరాం, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్ మరియు పశ్చిమ బెంగాల్ మొత్తం 8 రాష్ట్రాలను ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ లభించే రాష్ట్రాల జాబితాలో చేర్చింది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ధరలు వచ్చేశాయ్

200సీసీ సెగ్మెంట్లో ఉన్న ఇతర బైకుల ధరలతో పోల్చితే హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ధర చాలా పోటీతత్వంతో ఉంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యంత సరసమైన ధరతో లభించే 200సీసీ మోటార్ సైకిల్ ఇదే.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ధరలు వచ్చేశాయ్

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ తన నమ్మశక్యం కాని ధరతో విపణిలో ఉన్న టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి మరియు బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 వంటి మోడళ్ల నోర్లు మూయించడం ఖాయం. టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ప్రారంభ ధర రూ. 1.03 లక్షలు మరియు మరియు బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ప్రారంభ ధర 1 లక్ష రుపాయలుగా ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ధరలు వచ్చేశాయ్

సాంకేతికంగా హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకులో సరికొత్త 200సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 18.1బిహెచ్‌పి పవర్ మరియు 17.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ లీటరుకు 39.9కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ధరలు వచ్చేశాయ్

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్‌ బైకులో ముందు వైపున 37ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ కలదు. బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ వీల్‌కు 276ఎమ్ఎమ్ డిస్క్ మరియు రియర్ వీల్‌కు 220ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు. అంతే కాకుండా ఇందులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ కూడా అందిస్తోంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ధరలు వచ్చేశాయ్

హీరో మోటోకార్ప్ యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని అత్యుత్తమ మైలేజ్‌నిచ్చే మరియు శక్తివంతమైన ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకును ప్రవేశపెట్టింది. 160సీసీ మోటార్‌సైకిల్‌కు హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ చక్కటి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. భవిష్యత్తులో దీనిని ఫ్యూయల్ ఇంజెక్షన్ వేరియంట్లో కూడా లాంచ్ చేయనుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ధరలు వచ్చేశాయ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ మోటార్‌సైకిల్‌ హీరో మోటోకార్ప్‌కు అత్యంత కీలకమైన మోడల్. కమ్యూటర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో తిరుగులేని సక్సెస్ అందుకున్న హీరో ఇప్పుడు పర్ఫామెన్స్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో రాణించేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలోనే సీబీజడ్ ఎక్స్‌ట్రీమ్ ప్రేరణతో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకును ఆవిష్కరించి, విపణిలోకి ప్రవేశపెట్టింది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ధరలు వచ్చేశాయ్

పర్ఫామెన్స్ బైకుల రాజ్యంలో తన ఉనికిని చాటుకునేందుకు ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకుతో హీరో మోటోకార్ప్ చేస్తున్న ప్రయోగం ఫలిస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడక తప్పదు.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకు గురించి మీ అభిప్రాయం ఏమిటి...? క్రింది కామెంట్ సెక్షన్ ద్వారా మాతో పంచుకోండి.

More from DriveSpark

Article Published On: Friday, July 6, 2018, 13:47 [IST]
English summary
Read In Telugu: Hero Xtreme 200R Price Revealed On The Official Website
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+