ఎట్టకేలకు 200సీసీ బైకును ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్

భారతదేశపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ విపణిలోకి సరికొత్త ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకును ఆవిష్కరించింది.

By Anil

Recommended Video

Ducati 959 Panigale Crashes Into Buffalo - DriveSpark

భారతదేశపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ విపణిలోకి సరికొత్త ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకును ఆవిష్కరించింది. 2016 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద ప్రదర్శించబడిన కాన్సెప్ట్ మోడల్‌ను ఇప్పుడు ప్రొడక్షన్ వెర్షన్ ఆవిష్కరించబడింది.

హీరో మోటోకార్ప్ యొక్క పర్ఫామెన్స్ మోటార్ సైకిల్ ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ గురించి పూర్తి వివరాలు నేటి కథనంలో...

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ మరియు మైలేజ్

విపణిలోకి ప్రవేశపెట్టిన హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకులో సరికొత్త 200సీసీ కెసాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 5-స్పీడ్‌ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 8,500ఆర్‌పిఎమ్ వద్ద 18.1బిహెచ్‌పి పవర్ మరియు 6,000ఆర్‌పిఎమ్ వద్ద 17.2ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్

ప్రపంచ మోటార్ సైకిల్ టెస్ట్ సైకిల్ ప్రకారం, సరికొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ పర్ఫామెన్స్ బైక్ లీటర్‌కు 39.9కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇంజన్ నుండి వచ్చే వైబ్రేషన్స్‌ను తగ్గించడానికి క్రాంక్‌ షాఫ్ట్ మీద బ్యాలెన్సర్లను అందించింది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్

హీరో మోటోకార్ప్ ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ మోటార్ సైకిల్‍‌ను డైమండ్ ఫ్రేమ్ ఛాసిస్ మీద, ముందు వైపున 27ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ అందించి నిర్మించింది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్

బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ వీల్‌కు 276ఎమ్ఎమ్ చుట్టుకొలతలో ఉన్న డిస్క్ బ్రేక్, మరియు రియర్ వీల్‌కు 220ఎమ్ఎమ్ సింగల్ డిస్క్ బ్రేక్ అందివ్వడం జరిగింది. ఫ్రంట్ వీల్‌కు ఆప్షనల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కలదు.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్

సరికొత్త ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకులో రెండు వైపులా 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇందులో ఫ్రంట్ వీల్‌కు 100/80 ఆర్17 మరియు రియర్ వీల్‌కు 130/70 ఆర్17 కొలతల్లో ఉన్న టైర్లు కలవు.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ డిజైన్

ఇండియన్ మార్కెట్లోని పర్ఫామెన్స్ బైకుల డిజైన్ విప్లవాత్మకంగా ఉండాలి. డిజైన్ పరంగా ఆటో ఎక్స్‌పో 2016లో ఆవిష్కరించిన కాన్సెప్ట్ వెర్షన్ ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ బైకునే పోలి ఉన్నప్పటికీ బాడీ డీకాల్స్ మరియు కాస్మొటిక్ మెరుగుల పరంగా ఆశించిన అప్‌‌డేట్స్ చోటు చేసుకున్నాయి.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ఫ్రంట్ డిజైన్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న హెడ్ ల్యాంప్ మరియు హెడ్ ల్యాంప్ పై భాగంలో ఇరువైపులా రెండు చిన్న పగటి పూట వెలిగే యాంగులర్ ఎల్ఇడి లైట్లు ఉన్నాయి.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకులో అధునాతన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలదు. ఇందులో అనలాగ్ ఆర్‌పిఎమ్(ఇంజన్ స్పీడ్) కౌంటర్ మరియు బైక్ స్పీడ్ మరియు ఇతర వివరాలను తెలిపే డిస్ల్పే ఉన్నాయి.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకులో కండలు తిరిగిన ఫ్యూయల్ ట్యాంక్, డ్యూయల్ టోన్ ఎక్స్‌ట్రీమ్ గ్రాఫిక్స్, ఫ్రంట్ డిజైన్‌లో ఎయిర్ వెంట్స్, ఇంజన్ కూలింగ్ మెరుగు పరిచే బెల్లీ పాన్ మరియు నేల మీద నుండి 795ఎమ్ఎమ్ ఎత్తులో ఉన్న సీటు ఇందులో ఉన్నాయి.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్

ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ రియర్ డిజైన్ చాలా పదునుగా ఉంటుంది. సీటు నుండి రియర్ ఎండ్ వరకు పొట్టిగా ఉంటుంది. విభిన్నమైన టెయిల్ ల్యాంప్ బైకు మొత్తానికి ఒక డిఫరెంట్ తీసుకొచ్చింది. హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ఐదు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ఆవిష్కరణతో ప్రపంచపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 200సీసీ బైకుల సెగ్మెంట్లోకి ప్రవేశించింది. సరికొత్త స్టైల్ మరియు స్పోర్టివ్ మోటార్ సైకిల్‌ను యువ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ హీరో ప్రవేశపెట్టింది. హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ వేరియంట్లు మరియు ధరలను 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో రివీల్ చేయనుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

More from DriveSpark

Article Published On: Tuesday, January 30, 2018, 16:45 [IST]
English summary
Read In Telugu: Hero Xtreme 200R Unveiled – An Extreme Revival
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+