హోండా యాక్టివా 5జీ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు, వేరియంట్లు, మైలేజ్ మరియు ఫోటోలు

హోండా స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి సరికొత్త యాక్టివా 5జీ స్కూటర్‌ను లాంచ్ చేసింది. యాక్టివా వారసత్వాన్ని కొనసాగిస్తూ, యాక్టివా 3జీ మరియు 4జీ స్కూటర్ల విజయంతో యాక్టివా 5జీ

By Anil Kumar

హోండా స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి సరికొత్త యాక్టివా 5జీ స్కూటర్‌ను లాంచ్ చేసింది. యాక్టివా వారసత్వాన్ని కొనసాగిస్తూ, యాక్టివా 3జీ మరియు 4జీ స్కూటర్ల విజయంతో యాక్టివా 5జీ స్కూటర్‌ను విడుదల చేసింది. సరికొత్త హోండా యాక్టివా 5జీ ప్రారంభ వేరియంట్ ధర రూ. 52,460 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

హోండా యాక్టివా 5జీ

హోండా 5జీ స్కూటర్‌ను తొలుత ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించింది. తాజాగా విపణిలోకి విడుదలైన యాక్టివా 5జీ రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. యాక్టివా 5జీ ఎస్‌టిడి వేరియంట్ ధర రూ. 52,460 మరియు డిఎల్ఎక్స్ వేరియంట్ ధర రూ. 54,325 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

హోండా యాక్టివా 5జీ

సాంకేతికంగా హోండా యాక్టివా 5జీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అదే మునుపటి 109.19సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 7,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 8బిహెచ్‌పి పవర్ మరియు 5,500ఆర్‌పిఎమ్ వద్ద 9ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా యాక్టివా 5జీ

వి-మ్యాటిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల దీని గరిష్ట వేగం గంటకు 83కిలోమీటర్లుగా ఉంది. ముందు మరియు వెనుక వైపున స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్‌తో అండర్-బానెట్ ఫ్రేమ్ మీద నిర్మించారు.

హోండా యాక్టివా 5జీ

హోండా యాక్టివా 5జీ మొత్తం బరువు 109కిలోలు, సీటు ఎత్తు 765ఎమ్ఎమ్ మరియు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 5.3-లీటర్లు. సీటు క్రింద 18-లీటర్ల స్పోరేజ్ స్పేస్ కలదు.

హోండా యాక్టివా 5జీ

యాక్టివా 5జీ స్కూటర్‌లో ఇరువైపులా 10-అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు 90/100 ట్యూబ్ లెస్ టైర్లు ఇవ్వబడ్డాయి. రెండు చక్రాలకు 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. మరియు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ కలదు, ఇది ఏ ఒక్క బ్రేక్ అప్లే చేసినా రెండు చక్రాలకు సమానమైన బ్రేకింగ్ పవర్ అందుతుంది.

హోండా యాక్టివా 5జీ

మునుపటి వెర్షన్ యాక్టివా తరహాలో 5జీ స్కూటర్‌లో ఫుల్ మెటల్ బాడీ వచ్చింది. సరికొత్త ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, సర్వీస్ ఇండికేటర్ గల డిజిటల్ అనలాగ్ మీటర్, అండర్ సీట్ స్టోరేజిలో మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ మరియు 4-ఇన్-వన్ స్మార్ట్ కీ సిస్టమ్ ఇందులో ఉంది.

హోండా యాక్టివా 5జీ

సరికొత్త హోండా యాక్టివా 5జీ ఎనిమిది విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. అవి, డాజల్ యెల్లో మెటాలిక్, మాజెస్టిక్ బ్రౌన్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, బ్లాక్, మ్యాట్ సెలెన్ సిల్వర్ మెటాలిక్, పర్ల్ అమేజింగ్ వైట్, పర్ల్ స్పార్టన్ రెడ్ మరియు ట్రాన్స్ బ్లూ మెటాలిక్.

హోండా యాక్టివా 5జీ

హోండా టూ వీలర్స్ హోండా యాక్టివా 5జీ స్కూటర్‌ను తొలుత ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించింది. యాక్టివా పేరు సక్సెస్‌కు చిరునామాగా నిలిచింది. ప్రస్తుతం ఇండియన్ స్కూటర్ సెగ్మెంట్లో మరియు హోండా లైనప్‌లో యాక్టివా బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌గా నిలిచింది. హోండా స్కూటర్ల కుటుంబంలోకి కొత్తగా వచ్చి చేరిన యాక్టివా 5జీ హోండా మంచి ఫలితాలు సాధించిపెట్టనుంది.

హోండా యాక్టివా 5జీ స్కూటర్ ధరకు తగ్గ విలువలను కలిగి ఉందా...? యాక్టివా 5జీ స్కూటర్ గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ సెక్షన్‌లో మాతో పంచుకోండి...

హోండా యాక్టివా 5జీ

హోండా యాక్టివా 5G Vs యాక్టివా 4G: ఏది బెస్ట్?

విపణిలోకి హోండా ఎక్స్-బ్లేడ్ విడుదల: ధర రూ. 78,500 లు

Most Read Articles

English summary
Read In Telugu: Honda Activa 5G Launched; Prices Starts at Rs 52,460
Story first published: Wednesday, March 14, 2018, 16:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X