హోండా యాక్టివా 5G మరియు యాక్టివా 4G మధ్య తేడా ఏంటి?

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ ఢిల్లీ కేంద్రంగా ఇటీవల జరిగిన ఆటో ఎక్స్‌పో 2018 వాహన ప్రదర్శనలో సరికొత్త హోండా యాక్టివా 5G స్కూటర్‌ను ఆవిష్కరించింది.

By Anil Kumar

Recommended Video

TVS NTorq 125 Review, Full Specifications, Features, Colours & More - DriveSpark

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ ఢిల్లీ కేంద్రంగా ఇటీవల జరిగిన ఆటో ఎక్స్‌పో 2018 వాహన ప్రదర్శనలో సరికొత్త హోండా యాక్టివా 5G స్కూటర్‌ను ఆవిష్కరించింది. 3G మరియు 4G స్కూటర్లకు కొనసాగింపుగా అధునాతన ఫీచర్లు మరియు రెండు నూతన రంగుల్లో యాక్టివా 5G స్కూటర్‌ను ప్రవేశపెట్టింది.

హోండా యాక్టివా 5G Vs యాక్టివా 4G

హోండా టూ వీలర్స్ సరికొత్త 2018 హోండా యాక్టివా 5G స్కూటర్‌ను మార్చి-ఏప్రిల్ 2018 మధ్యలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే మార్కెట్లో ఉన్న టీవీఎస్ జూపిటర్ మరియు హీరో మాయెస్ట్రో ఎడ్జ్ వంటి స్కూటర్లకు గట్టి పోటీనివ్వనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు యాక్టివా 5G Vs యాక్టివా 4G స్టోరీ ద్వారా రెండు స్కూటర్లలోని ఇంజన్, స్పెసిఫికేషన్స్, డిజైన్, ఫీచర్లు, ధర మరియు మైలేజ్ అంశాల పరంగా వీటిలో ఏ స్కూటర్ బెస్టో... చూద్దాం రండి

హోండా యాక్టివా 5G Vs యాక్టివా 4G

డిజైన్

యాక్టివా 4G నుండి సేకరించిన డిజైన్ అంశాలతో హోండా సరికొత్త యాక్టివా 5G స్కూటర్‌ను డిజైన్ చేసింది. చూడటానికి అచ్చం 4G స్కూటర్‌నే పోలి ఉన్నప్పటికీ 5Gలో స్వల్ప మార్పులు జరిగాయి.

హోండా యాక్టివా 5G Vs యాక్టివా 4G

ఫ్రంట్ డిజైన్‌లో డే టైమ్ రన్నింగ్ ల్యాంప్‌తో సహా ఉన్న సరికొత్త ఎల్ఇడి హెడ్‌ల్యాంప్ ఉంది. 5G బ్యాడ్జ్ మినహాయిస్తే సైడ్ డిజైన్‌ మొత్తం 4G స్కూటర్ తరహాలో ఉంది. నిజానికి, హోండా యాక్టివా 5G స్కూటర్‌ను అస్సలు రీడిజైన్ చేయలేదు. స్వల్ప మెరుగులతో 5G వెర్షన్‌లో తీసుకొచ్చింది.

డిజైన్ పరంగా రేటింగ్

  • హోండా యాక్టివా 5G: 8/10
  • హోండా యాక్టివా 4G: 7.5/80
  • హోండా యాక్టివా 5G Vs యాక్టివా 4G

    ఫీచర్లు

    సరికొత్త ఎల్ఇడి హెడ్ ల్యాంప్ మినహాయిస్తే, యాక్టివా 5G స్కూటర్‌లో సరికొత్త 4-ఇన్-1 లాకింగ్ సిస్టమ్ మరియు సీట్-రిలీజ్ బటన్ ఉన్నాయి. అంతే కాకుండా ముందు మరియు వెనుక వైపున హుక్స్ మరియు 4G స్కూటర్ తరహా మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది.

    హోండా యాక్టివా 5G Vs యాక్టివా 4G

    హోండా యాక్టివా 5Gలో స్కూటర్‌‌కు సంభందించిన అతి ముఖ్యమైన సమాచారాన్నిచ్చే సెమీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్ కలదు. సర్వీస్ వివరాలు, ఇకో స్పీడ్ ఇండికేటర్ వంటివి ఇందులో వచ్చాయి.

    హోండా యాక్టివా 5G Vs యాక్టివా 4G

    2018 హోండా యాక్టివా 5G రెండు విభిన్న రంగుల్లో ఉంది. అవి, డాజల్ యెల్లో మెటాలిక్ మరియు పర్ల్ స్పార్టన్ రెడ్. యాక్టివా 4G స్కూటర్‌తో పోల్చుకుంటే ఇందులో రిచ్ ఫీల్ కలిగించే సౌకర్యవంతమైన ఫీచర్లు 5G స్కూటర్ సొంతం.

    ఫీచర్ల పరంగా రేటింగ్:

    • హోండా యాక్టివా 5G: 8/10
    • హోండా యాక్టివా 4G: 7/10
    • హోండా యాక్టివా 5G Vs యాక్టివా 4G

      భద్రత

      సరికొత్త హోండా యాక్టివా 5G స్కూటర్‌లో 4G వెర్షన్ నుండి సేకరించిన హోండా వారి కాంబి-బ్రేక్-సిస్టమ్(CBS)తో వచ్చింది. కొత్తగా డిజైన్ చేయబడిన రియర్ వ్యూవ్ మిర్రర్స్, టర్న్ ఇండికేటర్స్ గల హ్యాలోజియన్ టెయిల్ లైట్లు ఉన్నాయి.

      హోండా యాక్టివా 5G Vs యాక్టివా 4G

      పోటీదారులను ఎదుర్కునేందుకు హోండా యాక్టివా 5Gలో ఫ్రంట్ డిస్క్ బ్రేకులు అందించే అవకాశం ఉంది. అయితే, డిస్క్ బ్రేకుల పరిచయంతో ధర కూడా పెరిగే ఛాన్స్ ఉంది.

      భద్రత పరంగా రేటింగ్:

      • హోండా యాక్టివా 5G: 7.5/10
      • హోండా యాక్టివా 4G: 7.5/10
      • హోండా యాక్టివా 5G Vs యాక్టివా 4G

        ఇంజన్ స్పెసిఫికేషన్స్, గేర్‍‌బాక్స్ మరియు మైలేజ్

        యాక్టివా 5G స్కూటర్‌లో సాంకేతికంగా యాక్టివా 4G నుండి సేకరించిన అదే ఇంజన్ అందించారు. యాక్టివా 5G లోని శక్తివంతమైన 110సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 8బిహెచ్‌పి పవర్ మరియు 9ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి సివిటి గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

        హోండా యాక్టివా 5G Vs యాక్టివా 4G

        భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌గా యాక్టివా రాణించడంలో 110సీసీ ఇంజన్ పాత్ర కూడా ఉంది. అత్యుత్తమ మైలేజ్ మరియు పనితీరు విషయంలో హోండా వారి 110సీసీ ఇంజన్‌కు మంచి మార్కులే పడ్డాయి. 4G మరియు 5G స్కూటర్లో ఉన్న గరిష్టంగా 60కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

        ఇంజన్ పరంగా రేటింగ్:

        • హోండా యాక్టివా 5G: 8/10
        • హోండా యాక్టివా 4G: 8/10
        • హోండా యాక్టివా 5G Vs యాక్టివా 4G

          ధర

          హోండా యాక్టివా 4G ప్రారంభ వేరియంట్ ధర రూ. 50,730 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. అయితే, హోండా యాక్టివా 5G స్కూటర్ పూర్తి స్థాయిలో విడుదలైతే 4G స్కూటర్ కంటే 1,000 నుండి 2,000 ల వరకు అదనపు ధరతో లభించే అవకాశం ఉంది.

          హోండా యాక్టివా స్కూటర్ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌గా కొనసాగుతుండటంతో యాక్టివా 5G ధరను పెంచే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.

          హోండా యాక్టివా 5G Vs యాక్టివా 4G

          తీర్పు

          యాక్టివా 4G స్కూటర్‌తో పోల్చుకుంటే యాక్టివా 5G స్కూటర్‌ నూతన మరియు ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది. డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు జరగకపోయినా... స్వల్ప అప్‌డేట్స్ చోటు చేసుకున్నాయి. సౌకర్యం మరియు సౌలభ్యం పరంగా హోండా అందించిన ఫీచర్లతో యాక్టివా 5G పోటీగా ఉన్న ఇతర మోడళ్లకు గట్టిపోటీనివ్వడం ఖాయం.

Most Read Articles

English summary
Read In Telugu: Honda Activa 5G Vs. 4G Comparison: Design, Specifications, Features & Mileage
Story first published: Wednesday, February 28, 2018, 15:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X