హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్: ధర, డిజైన్, ఫీచర్లు మరియు మైలేజ్ పరంగా ఏ స్కూటర్ బెస్ట్?

స్కూటర్ల మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న యాక్టివా లేటెస్ట్ వెర్షన్ 5జీ మరియు టీవీఎస్ జూపిటర్ స్కూటర్ల మధ్య పోటీ అధికమైంది. కస్టమర్లు కూడా ఈ రెండింటిలో ఏ స్కూటర్ ఎంచుకుంటే మంచిదనే సందిగ్ధంలో ఉన్నా

By Anil Kumar

దేశీయ టూ వీలర్ల మార్కెట్లో స్కూటర్ల సెగ్మెంట్ ఆధిపత్యం చెలాయిస్తోంది. సులభంగా రైడ్ చేయడం, మహిళలు మరియు షార్ట్ రైడర్లు, స్టూడెంట్స్ ఇలా అందరూ ఈజీగా హ్యాండిల్ చేయగలడం, సిటీ మరియు పల్లె ప్రాంతాల్లో కూడా మంచి పర్ఫామెన్స్ కనబరచడం, గేర్లు మార్చే అవసరం లేకపోవడం మరియు మైలేజ్ కూడా బాగా వస్తుండటంతో గత దశాబ్ధ కాలం నుండి స్కూటర్లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది.

హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్

ఇండియన్ స్కూటర్ల పరిశ్రమలో హోండా యాక్టివా బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌గా నిలిచింది. కొన్నేళ్ల క్రితం విడుదలైన టీవీఎస్ జూపిటర్ కూడా మంచి ఫలితాలు సాధిస్తోంది. తరాలు మారుతుండటంతో, పోటీని ఎదుర్కొని కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి హోండా తమ యాక్టివా 3జీ మరియు 4జీ వెర్షన్‌లకు కొనసాగింపుగా సరికొత్త యాక్టివా 5జీ స్కూటర్‌ను లాంచ్ చేసింది.

హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్

స్కూటర్ల మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న యాక్టివా లేటెస్ట్ వెర్షన్ 5జీ మరియు టీవీఎస్ జూపిటర్ స్కూటర్ల మధ్య పోటీ అధికమైంది. కస్టమర్లు కూడా ఈ రెండింటిలో ఏ స్కూటర్ ఎంచుకుంటే మంచిదనే సందిగ్ధంలో ఉన్నారు. హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్‌ స్టోరీలో ఇంజన్, ఫీచర్లు, ధర మరియు మైలేజ్ పరంగా ఏది బెస్ట్ స్కూటరో చూద్దాం రండి...

హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్

డిజైన్

కొత్త తరం హోండా యాక్టివా 5జీ ఓవరాల్ డిజైన్ యాక్టివా 4జీ స్కూటర్‌నే పోలి ఉంటుంది. ప్రధానంగా జరిగిన డిజైన్ మార్పుల్లో నూతన ఎల్ఇడి హెడ్‌లైట్, పగటి పూట వెలిగే ఇంటిగ్రేటెడ్ లైట్లు మరియు ఎక్ట్సీరియర్ మీద పలు చోట్ల క్రోమ్ ఫినిషింగ్ కలదు. ఫ్రంట్ ప్రొఫైల్ మొత్తం యాక్టివా 4జీ శైలిలోనే ఉంది.

హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్

సైడ్ డిజైన్‌లోని 5జీ బ్యాడ్జింగ్ మినహాయిస్తే అన్ని డిజైన్ అంశాలు యాక్టివా 4జీ నుండి సేకరించినవే. రియర్ డిజైన్‌లోని అదే టెయిల్ ల్యాంప్ మరియు గ్రాబ్ రెయిల్ ఉన్నాయి. డిజైన్ పరంగా యాక్టివా 4జీ స్కూటర్‌తో పోల్చుకుంటే చిన్న చిన్న మార్పులు మినహాయిస్తే యాక్టివా 5జీ స్కూటర్‌లో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు.

హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్

టీవీఎస్ జూపిటర్ డిజైన్ విషయానికి వస్తే, అన్ని రకాల కస్టమర్లను ఆకట్టుకునే సింపుల్ డిజైన్ దీని సొంతం. స్కూటర్ల సెగ్మెంట్లోనే అట్రాక్టివ్ డిజైన్ లక్షణాలు జూపిటర్‌లో ఉన్నాయి. హెడ్‌ల్యాంప్ మరియు ఎప్రాన్ మీద ఇరువైపులా అందించిన టర్న్ ఇండికేటర్స్ ఫ్రంట్ డిజైన్‌లో చక్కగా ఒదిగిపోయాయి.

హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్

టీవీఎస్ జూపిటర్ సైడ్ డిజైన్‌లోని ప్లేన్ బాడీ మీద క్రోమ్ జూపిటర్ బ్యాడ్జింగ్ మరియు క్రోమ్ కవర్ ఫినిషింగ్ గల ఎగ్జాస్ట్ మఫ్లర్ ప్రధాన హైలెట్‌గా నిలిచాయి. స్కూటర్ రియర్‌ డిజైన్‌లో బయట నుండి ఫ్యూయల్ నింపే క్యాప్, సింపుల్‌గా ఉన్న టెయిల్ ల్యాంప్ క్లస్టర్ ఉన్నాయి.

హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్

డిజైన్ పరంగా ఆక్టివా 5జీ మరియు జూపిటర్ స్కూటర్లకు సమానమైన మార్కులే పడ్డాయి. డిజైన్ పరంగా ఓవరాల్ రేటింగ్...

  • హోండా యాక్టివా 5జీ: 8/10
  • టీవీఎస్ జూపిటర్: 8/10
  • Recommended Video

    TVS NTorq 125 Review: Details, Specifications, Features & More - DriveSpark
    హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్

    ఫీచర్లు

    సరికొత్త హోండా యాక్టివా 5జీ స్కూటర్‌లో అధునాతన మరియు సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు పరిచయమయ్యాయి. సర్వీస్ వివరాలు, ఇకో స్పీడ్ ఇండికేటర్ సూచించే సెమీ-డిజిటల్ ఇస్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఇడి హెడ్‌ల్యాంప్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు 4-ఇన్-1 లాక్ వంటి ఫీచర్లు ఎంతగానో ఆకట్టుకుంటాయి.

    హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్

    అంతే కాకుండా ఈ స్కూటర్‌లో షాపింగ్ హుక్స్ ఉన్నాయి, ముందు వైపున ఫ్లోర్ బోర్డ్ వద్ద మరియు మరియు వెనుక వైపున సీట్-రిలీజ్ బటన్ వద్ద హుక్స్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా, యాక్టివా 4జీ స్కూటర్‌లో ఉన్న మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ ఇందులో వచ్చింది.

    హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్

    దక్షిణ భారత ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ తమ జూపిటర్‌లో కూడా ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లను అందించింది. ట్విన్ పైలట్ ల్యాంప్స్, ఎల్ఇడి టెయిల్ లైట్, విచ్చుకునే బ్యాగ్ హుక్స్, బయట వైపు ఉన్న ఫ్యూయల్ ఫిల్లర్, మొబైల్ ఛార్జింగ్ ఫోర్ట్, విశాలమైన అండర్ సీట్ స్టోరేజ్ కలదు.

    హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్

    అల్లాయ్ వీల్స్ మరియు డ్యూయల్ సైడ్ హ్యాండిల్ లాక్ ఉన్నాయి. ఎల్ఇడి హెడ్‌ల్యాంప్ మినహాయిస్తే టీవీఎస్ జూపిటర్ స్కూటర్‌లో అన్ని ఫీచర్లు ఉన్నాయి. అయితే, అత్యంత సౌకర్యవంతమైన బయటవైపు నుండి పెట్రోల్ నింపే క్యాప్ ఇందులో ఉంది.

    ఫీచర్ల పరంగా ఓవరాల్ రేటింగ్

    • హోండా యాక్టివా 5జీ: 8/10
    • టీవీఎస్ జూపిటర్: 8/10
    • హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్

      భద్రత

      సేఫ్టీ అనేది కార్లు మరియు బైకుల్లోనే స్కూటర్లలో కూడా ముఖ్యమే. హోండా యాక్టివా 5జీ స్కూటర్‌లో హోండా వారి కాంబి-బ్రేక్ సిస్టమ్(CBS) ఉంది. కానీ, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కనీసం ఆప్షనల్‌గా కూడా లభించలేదు.

      హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్

      టీవీఎస్ జూపిటర్ స్కూటర్‌లో సిబిఎస్ తరహా పనిచేసే సింక్ బ్రేక్ సిస్టమ్ ఉంది. అంతే కాకుండా జూపిటర్‌‌లో ఆప్షనల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కూడా లభిస్తోంది.

      భద్రత పరంగా ఓవరాల్ రేటింగ్

      • హోండా యాక్టివా 5జీ: 7/10
      • టీవీఎస్ జూపిటర్: 8/10
      • హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్

        ఇంజన్ స్పెసిఫికేషన్స్ మరియు మైలేజ్

        హోండా యాక్టివా 5జీ స్కూటర్‌లో యాక్టివా 4జీ నుండి సేకరించిన అదే ఇంజ్ కలదు. సాంకేతికంగా ఇందులోని 109.19సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 8బిహెచ్‌పి పవర్ మరియు 9ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సివిటి ట్రాన్స్‌మిషన్ గల యాక్టివా 5జీ లీటరుకు 60కిమీల మైలేజ్ ఇస్తుంది.

        హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్

        టీవీఎస్ జూపిటర్‌లో 109.7సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 7.8బిహెచ్‌‌పి పవర్ మరియు 8ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సివిటి ట్రాన్స్‌మిషన్‌తో లభించే జూపిటర్ లీటరుకు 62కిమీల మైలేజ్ ఇవ్వగలదు.(మైలేజ్ వివరాలు ఆయా కంపెనీల ప్రకటన మేరకు ఇవ్వబడ్డాయి)

        ఓవరాల్ రేటింగ్

        • హోండా యాక్టివా 5జీ 8/10
        • టీవీఎస్ జూపిటర్ 8/10
        • హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్

          ధరలు

          హోండా యాక్టివా 5జీ స్టాండర్డ్ మరియు డిఎల్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. వీటి ధరలు వరుసగా రూ. 52,460 మరియు రూ. 54,325 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

          హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్

          టీవీఎస్ జూపిటర్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, స్టాండర్డ్, జడ్ఎక్స్, మిలియన్ఆర్ మరియు క్లాసిక్. జూపిటర్ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 49,966, జడ్ఎక్స్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 55,066 మరియు క్లాసిక్ ఎడిషన్ ధర రూ. 59,000 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

          హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్

          తీర్పు

          హోండా యాక్టివా 5జీ మరియు టీవీఎస్ జూపిటర్ రెండు కూడా రోజువారీ అవసరాలకు మంచి స్కూటర్లే. అంతే కాకుండా, రెండు స్కూటర్లలో కూడా ధరకు ఫీచర్లు మరియు విలువలు మెండుగా ఉన్నాయి. కానీ, సరికొత్త హోండా యాక్టివా 5జీ స్కూటర్‌లో విభిన్నమైన స్టైలిష్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్ వచ్చింది.

          రెండు స్కూటర్లు మరియు అవి లభించే వేరియంట్ల మధ్య ధరల పరంగా పెద్ద వ్యత్యాసమేమీ లేదు. అత్యాధునిక ఫీచర్లు మరియు ఫ్రెష్ లుక్‌లో ఉన్న స్కూటర్ కావాలనుకుంటే యాక్టివా 5జీ స్కూటర్‍‌ను ఎంచుకోవచ్చు. అయితే, సింపుల్ డిజైన్ మరియు సేఫ్టీలో కీలకమైన ఫ్రంట్ డిస్క్ బ్రేక్ స్కూటర్ కావాలంటే టీవీఎస్ జూపిటర్ ఎంచుకోండి...

Most Read Articles

English summary
Read In Telugu: Honda Activa 5G Vs. TVS Jupiter Comparison: Design, Specifications, Features, Price & Mileage
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X