ఒక్క యాక్టివా స్కూటర్ మీద 635 కేసులు నమోదు
స్కూటర్ నెంబర్ ప్రకారం, సుమారుగా 635 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదైనట్లు గుర్తించారు. వీటిలో ప్రధానంగా, సింగ్నల్ జంప్, హెల్మెట్ లేకుండా నడపడం మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రైడింగ్ చేయడం వంటి కేసులో
అన్ని అంశాల పరంగా శరవేగంగా అభివృద్ది చెందుతున్న చిన్న స్థాయి నగరాలలో మైసూర్ ఒకటి. నగర పారిశుద్యం, పర్యాటకం, పారిశ్రామిక మరియు రవాణా ఇలా అన్ని అంశాల పరంగా ఉత్తమ నగరంగా మార్కులు తెచ్చుకుంటున్న మైసూర్ ట్రాఫిక్ విషయంలో పోలీసులను హడలెత్తిస్తోంది.
తాజాగా ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన ఓ స్కూటర్, యావత్ ట్రాఫిక్ పోలీస్ విభాగాన్నే ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ స్కూటర్ కథేంటో చూద్దాం రండి...

మైసూరు పట్టణంలో ట్రాఫిక్ ఉల్లంఘనదారుల ఆటకట్టించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎప్పటిలాగే చెక్-అప్ నిర్వహించారు. అయితే, హెల్మెట్ ధరించకుండా వెళుతున్నందుకు ఓ హోండా యాక్టివా స్కూటర్‌ను (KA09HD4732) నిలిపారు.

హెల్మెట్ లేకుండా రైడింగ్ చేస్తున్నుందుకు ఛలనా జారీ చేసేందుకు సిద్దమయ్యారు. అయితే, స్కూటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా సిస్టమ్ ఇచ్చిన సమాచారాన్ని చూసిన పోలీసులు షాక్‌కు గురయ్యారు.

స్కూటర్ నెంబర్ ప్రకారం, సుమారుగా 635 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదైనట్లు గుర్తించారు. వీటిలో ప్రధానంగా, సింగ్నల్ జంప్, హెల్మెట్ లేకుండా నడపడం మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రైడింగ్ చేయడం వంటి కేసులో ఎక్కువగా ఉన్నాయి.

ఈ హోండా యాక్టివా స్కూటర్ మీద నమోదైన మొత్తం 635 కేసులకు గాను జరిమానా మొత్తం రూ. 63,500 లుగా ఉన్నట్లు తెలిసింది. ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలు అన్నీ కూడా సీసీటీవీ ఫుటేజీల ద్వారా నమోదయ్యాయి.

ఇప్పుడు ఈ జరిమానా మొత్తాన్ని యాక్టివా స్కూటర్ ఓనర్ మధుప్రసాద్.కె చెల్లిస్తాడా లేదంటే, ఆ స్కూటర్‌ను విక్రయిస్తే జిరిమానా మొత్తం రికవరీ అవుతుందా...? అనే అయోమయంలో మైసూరు పోలీసులు ఉన్నారు.

భారీ కేసులు మరియు జరిమానా ఉన్న స్కూటర్ కేసును ఏం చేయాలో... ఈ కేసును ఎలా పరిష్కరించాలో ఇప్పటికీ పోలీసులకు ఎలాంటి ఐడియా లేదు. వేలం ద్వారా విక్రయిస్తే, కేవలం రూ. 20,000 నుండి రూ. 25,000 మాత్రమే అందుతాయి.

ఈ స్కూటర్‌ను 2015 మార్చిలో కొనుగోలు చేశారు. మూడేళ్లనాటి ఈ బండికి 25 వేలకు మించి ఏ మాత్రం లభించదు. గవర్నమెంట్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ స్కూటర్‌కు ఇన్సూరెన్స్ కూడా లేదని గుర్తించారు.

ఇన్సూరెన్స్ లేకుండా, ఒక వాహనాన్ని చట్టపరంగా విక్రయించలేరు. ఇన్సూరెన్స్ లేకుండా ఆర్టీఓ అధికారులు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ జారీ చెయ్యలేరు. కనీసం, స్కూటర్‌ను విక్రయించి ఖజానానికి సొమ్ము చేద్దాం అనుకుంటే పోలీసులకు వీలుపడటం లేదు.

పోలీసులే స్వయంగా తమ సొంత ఖర్చుతో ఈ స్కూటర్‌కు ఇన్సూరెన్స్ ఖరీదు చేసి, చట్టపరంగా వేలం వేసి, వచ్చిన డబ్బును జరిమానా క్రింద తీసుకోవాల్సి మినహాయిస్తే, మరో అవకాశం లేదు.
పోలీసులు ఈ సమస్య నుండి గట్టెక్కేందుకు మీ వద్ద ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే... క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి.
Image Courtesy: Starofmysore


Click it and Unblock the Notifications








