హోండా సిబి హార్నెట్ 160ఆర్ మరియు సిబిఆర్ 250ఆర్ మీద పెరిగిన ధరలు

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ దేశీయ విపణిలో ఉన్న 2018 సిబి హార్నెట్ 160ఆర్ మరియు సిబిఆర్ 250ఆర్ మోడళ్ల ధరలను పెంచింది. రెండింటి మీద కూడా 500 రుపాయల చొప్పున ధరలు పెరిగాయి.

By Anil Kumar

హోండా టూ వీలర్స్ ఇటీవల రెండు బైకులను కూడా పలు కాస్మొటిక్ అప్‌డేట్స్ మరియు నూతన ఫీచర్లతో 2018 ఎడిషన్‌లో లాంచ్ చేసింది. 2018 సిబి హార్నెట్ 160ఆర్ బైకులో ఆప్షనల్ సింగల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎల్ఇడి హెడ్ ల్యాంప్ ఫీచర్లు వచ్చాయి. అదే విధంగా సిబిఆర్ 250ఆర్‌లో ఎల్ఇడి హెడ్‌ల్యాంప్ మరియు అధునాతన బాడీ గ్రాఫిక్స్ వచ్చాయి.

హోండా సిబి హార్నెట్ 160ఆర్ మరియు సిబిఆర్ 250ఆర్ మీద పెరిగిన ధరలు

2018 హోండా సిబి హార్నెట్ 160ఆర్ మరియు సిబిఆర్ 250ఆర్ మోడళ్ల ధరలు వేరియంట్ల వారీగా క్రింది పట్టికలో.... అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

Model Old Price New Price
Hornet 160R STD ₹84,675 ₹85,234
Hornet 160R CBS ₹89,175 ₹89,734
Hornet 160R STD ABS ₹90,175 ₹90,734
Hornet 160R DLX ABS ₹92,675 ₹93,234
CBR 250R Non-ABS ₹1,63,584 ₹1,64,143
CBR 250R ABS ₹1,93,107 ₹1,93,666

హోండా సిబి హార్నెట్ 160ఆర్ మరియు సిబిఆర్ 250ఆర్ మీద పెరిగిన ధరలు

ఇండియన్ మార్కెట్లోని 160సీసీ సెగ్మెంట్లో సిబి హార్నెట్ 160ఆర్ మోటార్ సైకిల్. ఇందులో అగ్రెసివ్ డిజైన్‌తో పాటు పలు విభిన్న డిజైన్ అంశాలు ఉన్నాయి. సిబి హార్నెట్ 160ఆర్ 2018 ఎడిషన్‌లో వచ్చిన పలు నూతన బాడీ గ్రాఫిక్స్ మరియు రిమ్ స్ట్రిప్స్ బైక్‌కు ఒక కొత్త లుక్ తీసుకొచ్చాయి.

హోండా సిబి హార్నెట్ 160ఆర్ మరియు సిబిఆర్ 250ఆర్ మీద పెరిగిన ధరలు

2018 హోండా సిబి హార్నెట్ 160ఆర్ బైకులో సాంకేతికంగా 162.71సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది 14.9బిహెచ్‌పి పవర్ మరియు 14.5ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా సిబి హార్నెట్ 160ఆర్ మరియు సిబిఆర్ 250ఆర్ మీద పెరిగిన ధరలు

ఇది రెండు వేరియంట్లలో లభిస్తోంది. అవి, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వేరియంట్ మరియు ఇరువైపులా డిస్క్ బ్రేకులు ఉన్న వేరియంట్. హోండా సిబి హార్నెట్ 160ఆర్ టాప్ ఎండ్ వేరియంట్లో ఆప్షనల్ సింగల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ ఉంది. అదే విధంగా ప్రారంభ వేరియంట్లలో కాంబి బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఇది ఫ్రంట్ మరియు రియర్ ఏ బ్రేకును అప్లే చేసినా రెండు చక్రాలకు సమానమైన బ్రేక్ పవర్ అందేలా చేస్తుంది.

హోండా సిబి హార్నెట్ 160ఆర్ మరియు సిబిఆర్ 250ఆర్ మీద పెరిగిన ధరలు

హోండా టూ వీలర్స్ ఇండియన్ మార్కెట్ నుండి తొలగించిన సిబిఆర్ 250ఆర్ బైకును ఈ ఏడాది ప్రారంభంలో రీలాంచ్ చేసింది. సాంకేతికంగా ఇందులో బిఎస్-4 ఉద్గార ప్రమాణాలను పాటించే 249సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 26.5బిహెచ్‌పి పవర్ మరియు 22.9ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 135కిలోమీటర్లుగా ఉంది.

హోండా సిబి హార్నెట్ 160ఆర్ మరియు సిబిఆర్ 250ఆర్ మీద పెరిగిన ధరలు

హోండా సిబిఆర్ 250ఆర్ బైకులో ఇరు వైపులా డిస్క్ బ్రేకులు స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి మరియు టాప్ ఎండ్ వేరియంట్లో డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ సేఫ్టీ ఫీచర్ ఉంది. సరికొత్త 2018 హోండా సిబిఆర్ 250ఆర్ విపణిలో ఉన్న బజాజ్ డామినర్ 400 మరియు మహీంద్రా మోజో వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తున్న బ్రాండెడ్ స్పోర్ట్స్ టూరర్ మోటార్ సైకిల్.

హోండా సిబి హార్నెట్ 160ఆర్ మరియు సిబిఆర్ 250ఆర్ మీద పెరిగిన ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా టూ వీలర్స్ ఇండియా విభాగం ఈ ఏడాది ప్రారంభంలో సిబి హార్నెట్ 160ఆర్ మరియు సరికొత్త సిబిఆర్ 250ఆర్ బైకులను అప్‌డేటెడ్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. అధునాతన ఫీచర్లు మరియు ఆకర్షణీయైన బాడీ గ్రాఫిక్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి. రెండు బైకుల ధరలు కొద్దిమేర పెరిగినప్పటికీ వీటి సేల్స్ మీద పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 29, 2018, 13:04 [IST]
English summary
Read In Telugu: Honda CB Hornet 160R And CBR 250R Prices Hiked
Read more on: #hyundai #హోండా
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+