2018 ఎడిషన్ హోండా సిబి షైన్ ఎస్‌పి విడుదల: ధర రూ. 62,032 లు
హోండా టూ వీలర్స్ 2018 ఎడిషన్ సిబి షైన్ ఎస్‌పి మోటర్ సైకిల్‌ను విపణిలోకి లాంచ్ చేసింది. సరికొత్త 2018 హోండా సిబి షైన్ ఎస్‌పి ప్రారంభ వేరియంట్ ధర రూ. 62,032 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.
Recommended Video

హోండా టూ వీలర్స్ 2018 ఎడిషన్ సిబి షైన్ ఎస్‌పి మోటర్ సైకిల్‌ను విపణిలోకి లాంచ్ చేసింది. సరికొత్త 2018 హోండా సిబి షైన్ ఎస్‌పి ప్రారంభ వేరియంట్ ధర రూ. 62,032 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

గ్రేటర్ నోయిడాలో ఫిబ్రవరి రెండవ వారంలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2018 వేదిక మీద 2018 హోండా సిబి షైన్ ఎస్‌పి బైకును ఆవిష్కరించింది. పూర్తి స్థాయిలో విడుదలైన హోండా 125సీసీ కమ్యూటర్ మోటార్ సైకిల్ మార్కెట్లో ఉన్న బజాజ్ డిస్కవర్ 125 మరియు హీరో గ్లామర్ ఎఫ్‌ఐ బైకులకు గట్టి పోటీనివ్వనుంది.

సరికొత్త హోండా సిబి షైన్ ఎస్‌పి మూడు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, డ్రమ్, డిస్క్ మరియు సిబిఎస్. వేరియంట్ల వారీగా ధరలు
| Variant Name | Price |
| CB Shine SP (Drum) | Rs 62,032 |
| CB Shine SP (Disc) | Rs 64,518 |
| CB Shine SP (CBS) | Rs 66,508 |

సాంకేతికంగా హోండా సిబి షైన్ ఎస్‌పి బైకులో అదే మునుపటి 124.73సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 7,500ఆర్‌పిఎమ్ వద్ద 10.16బిహెచ్‌పి పవర్ మరియు 5,500ఆర్‌పిఎమ్ వద్ద 10.30ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా షైన్ సిబి ఎస్‌పి బైకులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. మరియు దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 10.5-లీటర్లుగా ఉంది. సస్పెన్షన్ కోసం ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి.

బ్రేకింగ్ డ్యూటీ కోసం బేస్ వేరియంట్లో 130ఎఎమ్ఎమ్ డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. మిగతా రెండు వేరియంట్లలోని ఫ్రంట్ డ్రమ్ బ్రేకుల స్థానంలో 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు వచ్చాయి. ఇరువైపులా ఉన్న 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు అత్యుత్తమ మైలేజ్ ఇవ్వగలగేందుకు సహకరించే టైర్లను జోడించడం జరిగింది.

హోండా తమ 2018 ఎడిషన్ సిబి షైన్ ఎస్‌పి కమ్యూటర్ మోటార్ సైకిల్‌లో కొన్ని కాస్మొటిక్ మెరుగులు మరియు అప్‌గ్రేడ్స్ నిర్వహించింది. బైకులో రివైజ్ చేయబడిన ఫ్యూయల్ ట్యాంక్, ఇరువైపులా సరికొత్త బాడీ డీకాల్స్ మరియు గ్రాఫిక్స్ ఉన్నాయి.

2018 ఎడిషన్ హోండా సిబి షైన్ ఎస్‌పిలో సెమీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో ఇప్పుడు కొత్తగా సర్వీస్ ఇండికేటర్ మరియు గడియారం ఫీచర్లను అందించింది. సరికొత్త హోండా షైన్ ఐదు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది, అవి - అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, జెనీ గ్రే మెటాలిక్, పర్ల్ సిరెన్ బ్లూ మరియు బ్లాక్.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ప్రపంచపు బెస్ట్ సెల్లింగ్ 125సీసీ మెటార్ సైకిల్‌గా నిలిచిన సిబి షైన్ మోటార్ సైకిల్‌కు కొనసాగింపుగా ప్రత్యేకమైన బాడీ స్టైల్‌తో సిబి షైన్ ఎస్‌పి బైకును మార్కెట్లోకి తీసుకొచ్చిన హోండా ఇప్పుడు తాజాగా 2018 ఎడిషన్‌లో సిబి షైన్ ఎస్‌పి మోటార్ సైకిల్‌ను కొన్ని మార్పులు, చేర్పులతో లాంచ్ చేసింది. అత్యంత సరసమైన ధరతో లభించే ఇది పోటీగా ఉన్న ఇతర మోడళ్లకు ముచ్చెమటలు పట్టించనుంది.


Click it and Unblock the Notifications








