బజాజ్ డామినర్ 400కు సవాల్ విసురుతున్న హోండా సిబి300ఆర్

ఇండియన్ టూ వీలర్ల మార్కెట్లో ఉన్న నేక్డ్ వెర్షన్ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లోని బజాజ్ డామినర్ 400 పోటీ లేకుండా రాణిస్తోంది. అయితే, హోండా టూ వీలర్స్ సరికొత్త సిబి300 ఆర్ బైకును ఖరారు చేసింది.

By Anil Kumar

ఇండియన్ టూ వీలర్ల మార్కెట్లో ఉన్న నేక్డ్ వెర్షన్ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లోని బజాజ్ డామినర్ 400 పోటీ లేకుండా రాణిస్తోంది. అయితే, హోండా టూ వీలర్స్ సరికొత్త సిబి300 ఆర్ బైకును ఖరారు చేసింది.

హోండా నుండి సిబి300ఆర్

2017 ఐక్మా మోటార్ సైకిల్ షోలో ఆవిష్కరించిన హోండా సిబి300ఆర్ మోటార్ సైకిల్‌కు భారత్‌లో పేటెంట్ హక్కులు పొందిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అంటే, హోండా సిబి300ఆర్ ఇండియా విడుదల దాదాపు ఖాయమైపోయింది.

హోండా నుండి సిబి300ఆర్

కానీ, ఒక మోటార్ సైకిల్ పేటెంట్ పొందినంత మాత్రాన ఖచ్చితంగా విడుదలవుతుందనే గ్యారంటీ లేదు. గత కొన్నేళ్లుగా ఎంట్రీ లెవల్ టూ వీలర్ల సెగ్మెంట్లో భారీ వృద్దిని సాధిస్తున్న హోండా టూ వీలర్స్‌కు ఇప్పుడు సిబి300ఆర్ అత్యంత ముఖ్యమైన ఉత్పత్తిగా నిలిచింది.

హోండా నుండి సిబి300ఆర్

సరికొత్త హోండా సిబి300ఆర్ బైకును పూర్తిగా నూతన డిజైన్ అంశాలతో నిర్మించారు. ఈ సిరీస్‌లో వస్తోన్న మొట్టమొదటి మోడల్ కూడా ఇదే. కానీ సాంకేతికంగా హోండా లైనప్‌లో ఉన్న 300సీసీ సిరీస్ ఇంజన్‌ను వినియోగించారు.

హోండా నుండి సిబి300ఆర్

హోండా సిబి300ఆర్ బైకులో గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్ ‌ల్యాంప్, ఎల్ఈడీ లైట్లు, కండలు తిరిగిన ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, ఇంజన్ క్రింద బెల్లీ ప్యాన్ మరియు లావుగా ఉన్న ఎగ్జాస్ట్ సిస్టమ్(పొగ గొట్టం) వంటివి ఉన్నాయి.

హోండా నుండి సిబి300ఆర్

హోండా సిబి300ఆర్ నేక్డ్ వెర్షన్‌లో 286సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజక్టెడ్, సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 30.5బిహెచ్‌పి పవర్ మరియు 27.5ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా నుండి సిబి300ఆర్

హోండా సిబి300ఆర్ లోని సింగల్ పీస్ హ్యాండిల్ బార్ మంచి రైడింగ్ పొజిషన్ కల్పిస్తుంది. ఇందులో ముందువైపున 41ఎమ్ఎమ్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ కలదు.

హోండా నుండి సిబి300ఆర్

బ్రేకింగ్ విధులు నిర్వర్తించడానికి ఇరు వైపులా డిస్క్ బ్రేకులు ఉన్నాయి. మెరుగైన మరియు పటిష్టమైన బ్రేకింగ్ కొరకు అత్యంత కీలకమైన డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇందులో వచ్చింది.

హోండా నుండి సిబి300ఆర్

హోండా టూ వీలర్స్ ఇండియన్ మార్కెట్లో సిబిఆర్250ఆర్ వంటి ఎంట్రీ లెవల్ సూపర్ బైకులను విక్రయిస్తోంది, చెప్పుకొదగిన నేక్డ్ వెర్షన్ బైకు ఒక్కటి కూడా లేదు. కానీ ఇది పూర్తి స్థాయిలో విడుదలైతే బజాజ్ డామినర్ 400 మరియు యమహా ఎఫ్‌జడ్25 వంటి మోడళ్లకు సరాసరి పోటీనిస్తుంది.

హోండా నుండి సిబి300ఆర్

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ ఎట్టకేలకు ఎంట్రీ లెవల్ పర్ఫామెన్స్ బైకుల సెగ్మెంట్లోకి ప్రవేశించేందుకు సిద్దమైంది. దీని విడుదల గురించి హోండా నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. కానీ, విశ్వసనీయ సమాచారం మేరకు హోండా సిబి300ఆర్ విడుదల 2019లో ఉంటుందని తెలుస్తోంది.

Article Published On: Tuesday, August 28, 2018, 17:18 [IST]
English summary
Read In Telugu: Honda CB300R Patented In India — To Rival Bajaj Dominar 400
Read more on: #hyundai #హోండా
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+