దుమ్ముదులిపేసిన హోండా గ్రాజియా సేల్స్

Written By:
Recommended Video - Watch Now!
Tata Nexon Faces Its First Recorded Crash

హోండా స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్ ఇండియా లిమిటెడ్ సరిగ్గా రెండు నెలల క్రితం విపణిలోకి విడుదల చేసిన గ్రాజియా ప్రీమియమ్ స్కూటర్ భారీ సక్సెస్ అందుకుంది. కంపెనీ ఇటీవలె గ్రాజియా సేల్స్ గణాంకాలను విడుదల చేసింది.

హోండా గ్రాజియా

హోండా విక్రయించే స్కూటర్లలోనే ఖరీదైన మోడల్‌గా హోండా లాంచ్ చేసిన గ్రాజియాకు ఇండియన్ కస్టమర్ల నుండి విపరీతమైన స్పందన లభించింది. హోండా సరిగ్గా రెండున్నర నెలల్లో 50,000 గ్రాజియా స్కూటర్లను విక్రయించింది.

హోండా గ్రాజియా

సరికొత్త డిజైన్, ఫీచర్లు మరియు అత్యుత్తమ పనితీరు కనబరిచే ఇంజన్‌తో యువ కొనుగోలుదారులను మరియు సిటీ కస్టమర్లను టార్గెట్ చేస్తూ నవంబర్ 8, 2017 న మార్కెట్లోకి విడుదల అయ్యింది.

హోండా గ్రాజియా

భారీ అంచనాలతో, కస్టమర్లలో అత్యంత ఉత్సాహాన్ని నింపుతూ విడుదలైన హోండా గ్రాజియా స్కూటర్‌కు లభించిన అద్వితీయమైన స్పందనతో మార్కెట్లోకి విడుదలైన మొదటి నెలలోనే టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ల జాబితాలోకి చేరింది.

హోండా గ్రాజియా

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ మరియు మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యడ్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ, "మోడ్రన్ స్టైల్, హై క్వాలిటీ, విశ్వసనీయమైన పనితీరు మరియు ఇప్పటి వరకు మరే ఇతర కంపెనీ పరిచయం చేయని ఎల్ఇడి హెడ్‌ల్యాంప్, ఫుల్లీ డిజిటల్ మీటర్ 3-స్టెప్ స్పీడ్ ఇండికేటర్ వంటి ఫీచర్లు గ్రాజియాకు అద్వితీయమైన సేల్స్ సాధించిపెట్టాయని తెలిపాడు."

హోండా గ్రాజియా

"కస్టమర్ల నుండి లభించిన అసాధారణ స్పందనతో వినియోగదారులు రోజు వారి అవసరాలకు ఫీచర్లతో కూడిన అధునాతన స్కూటర్లను విరివిగా ఎంచుకుంటున్నారనడానికి ఇదొక నిదర్శనం. అడ్వాన్స్‌డ్ స్కూటర్లకు డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. ఈ సెగ్మెంట్లో గ్రాజియా మార్కెట్ లీడర్‌గా రాణిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసారు."

హోండా గ్రాజియా

హోండా గ్రాజియా ప్రత్యేకతలు మరియు ధర

  • ఇంజన్ కెపాసిటి: 124.9సీసీ
  • మైలేజ్: 60కిమీ/లీ(హోండా ప్రకారం)
  • గరిష్ట పవర్: 8.52బిహెచ్‌పి
  • ధర: రూ. 60,000 లు

హోండా గ్రాజియా రివ్యూ: హోండా గ్రాజియోలోని ఫ్లస్సు మరియు మైనస్‌లేంటో తెలుసుకోండి..!!

హోండా గ్రాజియా

గ్రాజియా గురించిన నిజం

గ్రాజియా అంటే ఇటాలియన్ లాంగ్వేజ్‌లే గ్రేస్ అని అర్థం. ఇటాలియన్ నుండి సేకరించిన గ్రాజియా పేరును ఈ స్కూటర్‌కు పెట్టారు. హోండా కంపెనీ జపాన్‌కు చెందినది మరి ఇటాలీకి చెందిన గ్రాజియా అనే పదానికి సంభందం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా...? మీరే కాదు, మేము కూడా ఆశ్చర్యపోతున్నాం. ఎందుకుంటే ఈ సీక్రెట్ హోండాకు మాత్రమే తెలుసు.. ఏదేమైనప్పటికీ గ్రాజియా స్కూటర్ మంచి సేల్స్ సాధిస్తోంది.

Read more on: #honda #హోండా
English summary
Read In Telugu: Honda Grazia Sales Cross 50,000 Units In 2.5 Months; The Grazia Scooter - The New Favourite?
Story first published: Saturday, January 27, 2018, 11:10 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark