హోండా టూ వీలర్స్‌కు చుక్కలు చూపిస్తున్న గ్రాజియా స్కూటర్ సేల్స్

హోండా టూ వీలర్స్ ప్రీమియమ్ స్కూటర్ల సెగ్మెంట్లోకి గ్రాజియా బ్రాండ్ పేరుతో ఒక కొత్త స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో హోండా గ్రాజియాను విడుదల చేశారు.

By Anil Kumar

ఇండియన్ స్కూటర్ల పరిశ్రమలో హోండా తమ యాక్టివా స్కూటర్‌తో ఆధిపత్యం చెలాయిస్తోంది. జపాన్ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా విభాగం యాక్టివా స్కూటర్ బ్రాండ్ పేరుతో ఎనలేని విజయాన్ని అందుకుంది. ఇటీవల ప్రీమియమ్ స్కూటర్ల సెగ్మెంట్లోకి గ్రాజియా బ్రాండ్ పేరుతో ఒక కొత్త స్కూటర్‌ను ప్రవేశపెట్టింది.

హోండా గ్రాజియా

స్కూటర్ల మార్కెట్లో విభిన్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన స్కూటర్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఎన్నో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో హోండా గ్రాజియాను విడుదల చేశారు. భారీ అంచనాలతో వచ్చిన గ్రాజియా ఊహించని ఫలితాలు సాధిస్తోంది.

హోండా గ్రాజియా

విడుదలైన కేవలం ఐదు నెలల వ్యవధిలోనే లక్ష యూనిట్లకు పైగా గ్రాజియా స్కూటర్లు అమ్ముడయ్యాయి. నవంబరు 2017లో విపణిలోకి ప్రవేశించిన హోండా గ్రాజియా ఇప్పుడు సరికొత్త మైలురాయిని చేధించింది.

హోండా గ్రాజియా

హోండా గ్రాజియా ప్రీమియమ్ స్కూటర్ మూడు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. అవి, ఎస్‌టిడి, అల్లాయ్ మరియు డిఎల్ఎక్స్. మూడు వేరియంట్లలో కూడా అదే మునుపటి యాక్టివా 125 స్కూటర్‌లో ఉన్న 124.9సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ కలదు.

హోండా గ్రాజియా

సివిటి ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇందులోని శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 8.52బిహెచ్‌పి పవర్ మరియు 10.54ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా గ్రాజియా

త్రీ-స్టెప్ ఇకో స్పీడ్ ఇండికేటర్ గల ఫుల్లీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ట్విన్-పోడ్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్, ఎల్ఇడి పొజిషనింగ్ లైట్లు మరియు పెద్ద పరిమాణంలో ఉన్న టర్న్ ఇండికేటర్లు వంటి ఫీచర్లతో వచ్చిన భారతదేశపు మొట్టమొదటి స్కూటర్ హోండా గ్రాజియా.

హోండా గ్రాజియా

హోండా గ్రాజియా ప్రీమియమ్ స్కూటర్‌లో రెండుగా విడిపోయిన వెనుక వైపు హ్యాండిల్, మొబైల్ ఫోన్స్‌ ఛార్జింగ్ కోసం ఉన్న ఆప్షనల్ ఛార్జింగ్ పోర్ట్, ఫ్రంట్ గ్లోవ్ బాక్స్, 18-లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ మరియు 4-ఇన్-వన్ ఇగ్నిషన్ కీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హోండా గ్రాజియా

సస్పెన్ష్ కోసం హోండా గ్రాజియాలో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్వర్ ఉంది. ముందువైపు 12-అంగుళాలు మరియు వెనుక వైపున 10-అంగుళాల పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

హోండా గ్రాజియా

బ్రేకింగ్ విధులు నిర్వర్తించడానికి ముందు వైపున 190ఎమ్ఎమ్ డిస్క్ మరియు వెనుక వైపున 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం హోండా పేటెంట్ హక్కులు పొందిన కాంబి బ్రేకింగ్ సిస్టమ్ ఇందులో ఉంది. అంటే ఒక్కసారి బ్రేకులు ప్రెస్ చేస్తే బ్రేకింగ్ ఫోర్స్ రెండు చక్రాలకు సరఫరా అవుతుంది.

హోండా గ్రాజియా

హోండా గ్రాజియా స్కూటర్ ఆరు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. అవి, నియో ఆరేంజ్ మెటాలిక్, పర్ల్ నైట్‌స్టార్ బ్లాక్, పర్ల్ స్పార్టన్ రెడ్, పర్ల్ అమేజింగ్ వైట్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ మరియు మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్.

హోండా గ్రాజియా

హోండా గ్రాజియా ప్రారంభ వేరియంట్ ధర రూ. 57,827 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. మరియు ఇది విపణిలో ఉన్న టీవీఎస్ ఎన్‌టార్క్ 125 మరియు సుజుకి యాక్సెస్ 125 వంటి స్కూటర్లకు గట్టి పోటీగా నిలిచింది.

హోండా గ్రాజియా

కానీ, హోండా గ్రాజియా స్కూటర్ లక్ష యూనిట్లకు పైగా విక్రయాలతో భారీ సక్సెస్ సాధించడానికి నిజంగా దోహదపడిన అంశం ఏమిటి? ప్రస్తుతం కాలానికి తగ్గట్లుగా అన్ని రకాల వయసున్న కస్టమర్లను ఆకట్టుకునే అత్యాధునిక డిజైన్, ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు మరియు యాక్టివాలో ఉన్న శక్తివంతమైన ఇంజన్ వంటివి గ్రాజియా విజయానికి కారణమయ్యాయని చెప్పవచ్చు.

హోండా గ్రాజియా

1. అప్రిలియా ఎస్ఆర్ 125 రివ్యూ: ప్రతి స్పోర్టివ్ రైడర్ స్కూటర్

2.హోండా గ్రాజియా ఫస్ట్ రైడ్ రివ్యూ: ప్లస్ ఏంటి.. మైనస్ ఏంటి..?

3.టీవీఎస్ ఎన్‌టార్క్ 125 టెస్ట్ రైడ్ రివ్యూ రిపోర్ట్

4.స్పేర్ వీల్‌ను స్టెప్నీ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

5.ఇలా చేస్తే మీ బైకును దొంగల నుండి కాపాడుకోవచ్చు

Most Read Articles

Read more on: #hyundai #హోండా
English summary
Read In Telugu: Honda Grazia Sales Figures — Sells Over 1 Lakh Units in Five Months
Story first published: Saturday, April 7, 2018, 16:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X