హోండా ఎక్స్-బ్లేడ్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు, మైలేజ్ మరియు ఫోటోలు

Written By:

హోండా స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్ విపణిలోకి సరికొత్త ఎక్స్-బ్లేడ్ మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. హోండా ఎక్స్-బ్లేడ్ ధర రూ. 78,500 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. స్టైలిష్ మరియు స్పోర్టివ్ డిజైన్ హోండా ఎక్స్-బ్లేడ్ 160సీసీ సెగ్మెంట్ శ్రేణిలో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో వచ్చింది.

హోండా ఎక్స్-బ్లేడ్ గురించి పూర్తి వివరాలు...

Recommended Video - Watch Now!
హోండా ఎక్స్-బ్లేడ్ 160సీసీ బైక్ రివీల్ | Honda X-Blade - Details & Full Specifications - DriveSpark
హోండా ఎక్స్-బ్లేడ్ విడుదల

హోండా టూ వీలర్స్ తొలుత ఈ ఎక్స్-బ్లేడ్ బైకును ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించింది. హోండా ఎక్స్-బ్లేడ్ ఫ్రంట్ డిజైన్‌లో అగ్రెసివ్ స్టైలింగ్ మరియు పదునైన హెడ్ ల్యాంప్ కలదు. కండలు తిరిగిన ఫ్యూయల్ ట్యాంక్, మరియు ఆకర్షణీయమైన టెయిల్ సెక్షన్ మోటార్ సైకిల్‌కు మరింత లుక్ తీసుకొచ్చాయి. అంతే కాకుండా, ఇందులో సెగ్మెంట్ ఫస్ట్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్ రోబోటిక్ లుక్‌లో ఉంది.

హోండా ఎక్స్-బ్లేడ్ విడుదల

హోండా ఎక్స్-బ్లేడ్ బైకులోని ఇతర కీలకమైన ఫీచర్లలో రేజర్ ఎడ్జెస్ ఎల్ఇడి టెయిల్ లైట్, సర్వీస్ డ్యు ఇండికేటర్ గల సరికొత్త డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, డిజిటల్ లాక్, గేర్ పొజిషన్ ఇండికేటర్, హజార్డ్ లైట్ స్విచ్చ్ మరియు మలిచిన తీరుగా ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ వంటివి ఉన్నాయి.

హోండా ఎక్స్-బ్లేడ్ విడుదల

వీటితో పాటు, హోండా ఎక్స్-బ్లేడ్ బైకులో స్పోర్టివ్ మరియు షార్ప్ డిజైన్ గల విభిన్నమైన రియర్ గ్రాబ్ రెయిల్స్, రియర్ టైర్ గార్డ్, క్రోమ్ పట్టీ గల డ్యూయల్ ఔట్‌లెట్ మఫ్లర్ వంటివి మోటార్ సైకిల్‌కు స్పోర్టివ్ తత్వాన్ని తీసుకొచ్చాయి.

హోండా ఎక్స్-బ్లేడ్ విడుదల

హోండా ఎక్స్-బ్లేడ్ ఐదు విభిన్న రంగుల్లో లభ్యమవుతుంది. అవి, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, మ్యాట్ ఫ్రాజెన్ సిల్వర్ మెటాలిక్, పర్ల్ స్పార్టాన్ రెడ్, పర్ల్ ఇగ్నియస్ బ్లాక్ మరియు మ్యాట్ మార్షల్ గ్రీన్ మెటాలిక్ వంటివి.

హోండా ఎక్స్-బ్లేడ్ విడుదల

సాంకేతికంగా హోండా ఎక్స్-బ్రేడ్ బైకులో 162.71సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 8,500ఆర్‌పిఎమ్ వద్ద 13.93బిహెచ్‌పి పవర్ మరియు 6,000ఆర్‌పిఎమ్ వద్ద 13.9ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా ఎక్స్-బ్లేడ్ విడుదల

హోండా టూ వీలర్స్ ఎక్స్-బ్లేడ్ బైకును డైమండ్ ఫ్రేమ్ ఛాసిస్ మీద ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ స్పసెన్షన్ సిస్టమ్ ఉన్నాయి. హోండా ఎక్స్-బ్లేడ్‌లో ఉన్న 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు ముందు వైపున 80/110 ఆర్17 మరియు వెనుక వైపున 130/70 ఆర్17 కొలతల్లో ఉన్న టైర్లు ఉన్నాయి. బ్రేక్ డ్యూటీ కోసం ముందు వైపున డిస్క్ వెనుక వైపున డ్రమ్ బ్రేకులు ఉన్నాయి.

హోండా ఎక్స్-బ్లేడ్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా ఎట్టకేలకు విపణిలోకి ఎక్స్-బ్లేడ్ బైకును కస్టమర్లను అమితంగా ఆకట్టుకునే ధరలో విపణిలోకి లాంచ్ చేసింది. ఎక్స్-బ్లేడ్ హోండా యొక్క రెండవ 160సీసీ బైకు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160, హోండా సిబి హార్నెట్ 160ఆర్, టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 మరియు సుజుకి జిక్సర్ బైకులకు గట్టి పోటీనిస్తుంది.

హోండా ఎక్స్-బ్లేడ్ బైకును దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా విక్రయ కేంద్రాలలో రూ. 5,000 లు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

English summary
Read In Telugu: Honda X-Blade Launched In India; Priced At Rs 78,500

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark