హోండా ఎక్స్-బ్లేడ్ 160సీసీ బైక్ రివీల్

By Anil

ఆటో ఎక్స్‌పో 2018: హోండా టూ వీలర్స్ ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ ఆటో ఎక్స్‌పో 2018లో సరికొత్త ఎక్స్-బ్లేడ్ బైకును ఆవిష్కరించింది. ఎక్స్-బ్లేడ్ కంపెనీ యొక్క 160సీసీ స్పోర్టివ్ కమ్యూటర్ మోటార్ సైకిల్.

ఎక్స్-బ్లేడ్ పూర్తి డిజైన్ చూడటానికి హార్నెట్ 160ఆర్ బైకును పోలి ఉంటుంది. అయితే, ఎక్స్-బ్లేడ్ బైకులో శక్తివంతమైన ఇంజన్‌తో పాటు అధునాతన ప్రీమియమ్ ఫీచర్లు కూడా వచ్చాయి.

సరికొత్త ఎక్స్-బ్లేడ్ 160 బైకు

సాంకేతికంగా హోండా ఎక్స్-బ్లేడ్ బైకులో హోండా వారి 162.7సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ గల ఇది 13.93బిహెచ్‌పి పవర్ మరియు 13.9ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Recommended Video - Watch Now!
Hero XPulse 200 At Auto Expo 2018
సరికొత్త ఎక్స్-బ్లేడ్ 160 బైకు

ఎక్స్-బ్లేడ్ స్పోర్టివ్ కమ్యూటర్ మోటార్ సైకిల్‌ను సరికొత్త డైమండ్ ఫ్రేమ్ ఛాసిస్ మీద నిర్మించారు. రేజర్ షార్ప్ డిజైన్‌లో ఉన్న ఎక్స్-బ్లేడ్ బైకు మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సరికొత్త ఎక్స్-బ్లేడ్ 160 బైకు

హోండా ఎక్స్-బ్లేడ్ బైకులో సరికొత్త ఎల్ఇడి హెడ్‌ల్యాంప్ సెటప్, ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ రోబో-ఫేస్ ఫుల్ హెడ్ ల్యాంప్స్ మరియు టెయిల్‌ల్యాంప్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఎక్స్-బ్లేడ్‌లో సర్వీస్ రిమైండర్ మరియు గేర్ షిఫ్ట్ ఇండికేటర్స్ గల సరికొత్త డిజిటల్ స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సరికొత్త ఎక్స్-బ్లేడ్ 160 బైకు

హోండా ఎక్స్-బ్లేడ్ స్పోర్టివ్ బైకులో కండలు తిరిగిన ఫ్యూయల్ ట్యాంక్, కోపంతో కూడిన బాడీ బ్లాక్ డీకాల్స్ మరియు బ్లాక్ ఫినిషింగ్‌లో ఉన్న సైడ్ ప్యానల్స్ ఉన్నాయి. ఎక్స్-బ్లేడ్ రియర్ డిజైన్‌లో రెండుగా విడిపోయిన గ్రాబ్ రెయిల్, రేజర్ ఎడ్జ్ టెయిల్ ల్యాంప్ మరియు డ్యూయల్ మఫ్లర్ టెయిల్ పైప్ ఉన్నాయి.

సరికొత్త ఎక్స్-బ్లేడ్ 160 బైకు

హోండా ఎక్స్-బ్లేడ్ ఐదు విభిన్న రంగుల్లో లభ్యం కానుంది. అవి, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, పర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ ఫ్రాజెన్ సిల్వర్, పర్ల్ స్పార్టాన్ రెడ్ మరియు మ్యాట్ మార్షల్ గ్రీన్ మెటాలిక్.

సరికొత్త ఎక్స్-బ్లేడ్ 160 బైకు

హోండా ఎక్స్-బ్లేడ్ బైకును మార్చి 2018 మొదటి వారంలో విపణిలోకి విడుదల చేయనుంది. ధరల వివరాలు విడుదల సమయంలో వెల్లడించనున్నారు.

సరికొత్త ఎక్స్-బ్లేడ్ 160 బైకు

హోండా టూ వీలర్స్ ఎక్స్-బ్లేడ్ బైకుతో సహా, యాక్టివా 5జీ, లివో, సిబి షైన్, సిబి షైన్ ఎస్‌పి, సిబి హార్నెట్ 160ఆర్ మరియు సిబిఆర్ 250ఆర్ బైకులను 2018 ఎడిషన్‌లో విడుదల చేసింది. వీటితో పాటు, సిబిఆర్ 650ఎఫ్, ఆఫ్రికా ట్విన్, సిబిఆర్1000ఆర్ఆర్ మరియు గోల్డ్ వింగ్ బైకులను ఆవిష్కరించింది.

సరికొత్త ఎక్స్-బ్లేడ్ 160 బైకు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

160సీసీ కమ్యూటర్ బైక్ సెగ్మెంట్ ఇండియన్ మార్కెట్లో శరవేగంగా వృద్ది చెందుతోంది. హార్నెట్ 160ఆర్ విజయంతో, ఫస్ట్ క్లాస్ ఫీచర్లతో ఎక్స్-బ్లేడ్ కమ్యూటర్ బైకును స్పోర్టివ్ స్టైల్లో తీసుకొచ్చింది.

సరికొత్త ఎక్స్-బ్లేడ్ 160 బైకు

హోండా ఎక్స్-బ్లేడ్ రూ. 80,000 ల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది మార్కెట్లో ఉన్న యమహా ఎఫ్‌జడ్, టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 మరియు బజాజ్ పల్సల్ ఎన్ఎస్ 160 బైకులకు గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Auto Expo 2018: Honda X-Blade Unveiled — Expected Launch Date, Price, Features And Images
Story first published: Tuesday, February 13, 2018, 16:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X