మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న హస్క్‌వర్నా బైకులు

కేటీఎం కంపెనీకి చెందిన హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి తమ ఎంట్రీ గురించి ప్రకటించింది. హస్క్‌వర్నా విట్‌పిలెన్ మరియు స్వార్ట్‌పిలెన్ 401 మోటార్ సైకిళ్లను 2019లో విడుదల చేసి అధిక

By Anil Kumar

కేటీఎం కంపెనీకి చెందిన హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి తమ ఎంట్రీ గురించి ప్రకటించింది. హస్క్‌వర్నా విట్‌పిలెన్ మరియు స్వార్ట్‌పిలెన్ 401 మోటార్ సైకిళ్లను 2019లో విడుదల చేసి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్దమవుతోంది.

మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న హస్క్‌వర్నా బైకులు

వచ్చే ఏడాది నుండి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనున్న హస్క్‌వర్నా విట్‌పిలెన్ 401 బైకును రెట్రోల్ మరియు కెఫే రైసర్ స్టైల్లో అదే విధంగా స్వార్ట్‌పిలెన్ 401 బైకును రిలాక్స్‌డ్ మరియు స్క్రాంబ్లర్ స్టైల్లో ప్రవేశపెట్టనుంది.

మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న హస్క్‌వర్నా బైకులు

రెండు మోటార్ సైకిళ్లను కూడా దేశీయంగా ఉత్తత్తి చేసే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఏడాది కేటీఎం విడుదల చేసిన ప్రకటన మేరకు, ఈ రెండు బైకులను కూడా పూనేలో ఉన్న బజాజ్ చకన్ ప్లాంటులో తయారీ చేపడుతున్నట్లు తెలిపింది.

మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న హస్క్‌వర్నా బైకులు

బజాజ్ మరియు కేటీఎం ఉమ్మడి భాగస్వామ్యంతో చకన్ ప్లాంటులో ఇరు కంపెనీలకు చెందిన ఉత్పత్తులను తయారు చేస్తున్న విషయం సంగతి తెలిసిందే. హస్క్‌వర్నా కూడా కేటీఎంకు చెందిన కంపెనీయే కాబట్టి వీటి ప్రొడక్షన్ కూడా ఇక్కడే చేపట్టనున్నారు.

మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న హస్క్‌వర్నా బైకులు

మార్కెట్‌ను పెంచుకునేందుకు విట్‌పిలెన్ 401, స్వార్ట్‌పిలెన్ 401 మరియు విట్‌పిలెన్ 701 మోడళ్లను ప్రొడక్షన్ దేశీయంగా చేపట్టనుంది. వీటి ఉత్పత్తి తొలుత ఆస్ట్రియాలో చేపట్టనున్నారు. 2018 చివరిలో అంతర్జాతీయ ప్రొడక్షన్‌ను పూనేలోని చకన్ బజాజ్ ప్రొడక్షన్ ప్లాంటుకు తరలించనున్నారు.

మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న హస్క్‌వర్నా బైకులు

హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్ విస్తరణ బజాజ్ ఆటో మరియు కేటీఎం కంపెనీల భాగస్వామ్యాన్యానికి మరింత బలాన్ని చేకూర్చనుంది. రెండు కంపెనీలు కూడా దేశీయంగా పదేళ్ల ఉమ్మడి భాగస్వామ్యపు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుంది.

మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న హస్క్‌వర్నా బైకులు

విట్‌పిలెన్ 401 మరియు స్వార్ట్‌పిలెన్ 401 రెండు బైకులను కూడా కేటీఎం డ్యూక్ 390 ఆధారంగా డెవలప్ చేశారు. రెండింటిలో కూడా 373సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, 6-స్పీడ్ గేర్‍‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 44బిహెచ్‌పి పవర్ మరియు 37ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న హస్క్‌వర్నా బైకులు

హస్క్‌వర్నా మోటార్ సైకిళ్లు ఇంజన్‌తో పాటు మరిన్ని ఇతర మెకానికల్ విడి భాగాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కేటీఎం బైకుల నుండి పంచుకోనున్నాయి. ప్రధానంగా ఛాసిస్, బ్రేకులు మరియు సస్పెన్షన్ సిస్టమ్‌ను కేటీఎం బైకుల నుండి సేకరించినవే.

మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న హస్క్‌వర్నా బైకులు

కేటీఎం వచ్చే ఏడాది హస్క్‌వర్నా విట్‌పిలెన్ మరియు స్వార్ట్‌పిలెన్ 401 మోటార్ సైకిళ్లను లాంచ్ చేయనుంది. రెండు బైకుల ధరలు కేటీఎం డ్యూక్ 390 మరియు ఆర్సీ 390 మోడళ్లకు దగ్గరగా ఉండవచ్చు.

మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న హస్క్‌వర్నా బైకులు

అంతే కాకుండా కేటీఎం త్వరలో అడ్వెంచర్ 390 మోడల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు బైకులు కూడా విపణిలో ఉన్న కేటీఎం 390 మోడళ్లకు గట్టి పోటీనిస్తాయి.

More from DriveSpark

Article Published On: Thursday, June 28, 2018, 15:28 [IST]
English summary
Read In Telugu: Husqvarna Vitpilen And Swartpilen 401 India Launch Details Revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+