Just In
- 30 min ago
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- 1 hr ago
ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి
- 2 hrs ago
కొత్త 2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ వస్తోందోచ్..
- 3 hrs ago
కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు రెనో ఇండియా 'మాస్టర్' ప్లాన్స్..
Don't Miss
- Finance
ఈ ఉత్పత్తులపై దిగుమతి సంకాలు భారీగా పెరవగవచ్చు, ఎందుకంటే?
- Sports
వెస్టిండీస్ టూర్ ముందు శ్రీలంకకు గట్టి షాక్.. ఇద్దరు ప్లేయర్లకు కరోనా
- News
ఏపీలో వేగంగా పరిణామాలు-నిమ్మగడ్డ వద్దకు ఐఏఎస్‌ల్ని పంపిన జగన్- ఏం జరుగుతోంది ?
- Movies
బాలీవుడ్ కోసం తెలుగు సినిమాలను పక్కన పెట్టేశాడట.. టార్గెట్ మామూలుగా లేదు
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న హస్క్‌వర్నా బైకులు
కేటీఎం కంపెనీకి చెందిన హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి తమ ఎంట్రీ గురించి ప్రకటించింది. హస్క్‌వర్నా విట్‌పిలెన్ మరియు స్వార్ట్‌పిలెన్ 401 మోటార్ సైకిళ్లను 2019లో విడుదల చేసి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్దమవుతోంది.

వచ్చే ఏడాది నుండి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనున్న హస్క్‌వర్నా విట్‌పిలెన్ 401 బైకును రెట్రోల్ మరియు కెఫే రైసర్ స్టైల్లో అదే విధంగా స్వార్ట్‌పిలెన్ 401 బైకును రిలాక్స్‌డ్ మరియు స్క్రాంబ్లర్ స్టైల్లో ప్రవేశపెట్టనుంది.

రెండు మోటార్ సైకిళ్లను కూడా దేశీయంగా ఉత్తత్తి చేసే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఏడాది కేటీఎం విడుదల చేసిన ప్రకటన మేరకు, ఈ రెండు బైకులను కూడా పూనేలో ఉన్న బజాజ్ చకన్ ప్లాంటులో తయారీ చేపడుతున్నట్లు తెలిపింది.

బజాజ్ మరియు కేటీఎం ఉమ్మడి భాగస్వామ్యంతో చకన్ ప్లాంటులో ఇరు కంపెనీలకు చెందిన ఉత్పత్తులను తయారు చేస్తున్న విషయం సంగతి తెలిసిందే. హస్క్‌వర్నా కూడా కేటీఎంకు చెందిన కంపెనీయే కాబట్టి వీటి ప్రొడక్షన్ కూడా ఇక్కడే చేపట్టనున్నారు.

మార్కెట్‌ను పెంచుకునేందుకు విట్‌పిలెన్ 401, స్వార్ట్‌పిలెన్ 401 మరియు విట్‌పిలెన్ 701 మోడళ్లను ప్రొడక్షన్ దేశీయంగా చేపట్టనుంది. వీటి ఉత్పత్తి తొలుత ఆస్ట్రియాలో చేపట్టనున్నారు. 2018 చివరిలో అంతర్జాతీయ ప్రొడక్షన్‌ను పూనేలోని చకన్ బజాజ్ ప్రొడక్షన్ ప్లాంటుకు తరలించనున్నారు.

హస్క్‌వర్నా మోటార్ సైకిల్స్ విస్తరణ బజాజ్ ఆటో మరియు కేటీఎం కంపెనీల భాగస్వామ్యాన్యానికి మరింత బలాన్ని చేకూర్చనుంది. రెండు కంపెనీలు కూడా దేశీయంగా పదేళ్ల ఉమ్మడి భాగస్వామ్యపు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుంది.

విట్‌పిలెన్ 401 మరియు స్వార్ట్‌పిలెన్ 401 రెండు బైకులను కూడా కేటీఎం డ్యూక్ 390 ఆధారంగా డెవలప్ చేశారు. రెండింటిలో కూడా 373సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, 6-స్పీడ్ గేర్‍బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 44బిహెచ్‌పి పవర్ మరియు 37ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హస్క్‌వర్నా మోటార్ సైకిళ్లు ఇంజన్‌తో పాటు మరిన్ని ఇతర మెకానికల్ విడి భాగాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కేటీఎం బైకుల నుండి పంచుకోనున్నాయి. ప్రధానంగా ఛాసిస్, బ్రేకులు మరియు సస్పెన్షన్ సిస్టమ్‌ను కేటీఎం బైకుల నుండి సేకరించినవే.

కేటీఎం వచ్చే ఏడాది హస్క్‌వర్నా విట్‌పిలెన్ మరియు స్వార్ట్‌పిలెన్ 401 మోటార్ సైకిళ్లను లాంచ్ చేయనుంది. రెండు బైకుల ధరలు కేటీఎం డ్యూక్ 390 మరియు ఆర్సీ 390 మోడళ్లకు దగ్గరగా ఉండవచ్చు.

అంతే కాకుండా కేటీఎం త్వరలో అడ్వెంచర్ 390 మోడల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు బైకులు కూడా విపణిలో ఉన్న కేటీఎం 390 మోడళ్లకు గట్టి పోటీనిస్తాయి.