హైదరాబాద్ పోలీసుల మతిపోగొట్టిన డుకాటి బైక్ [వీడియో]

హైదరాబాద్ నగరంలో రూ. 18 లక్షల ఖరీదైన డుకాటి డైవెల్ బైకును చూసిన శంషాబాద్ పోలీసుల అసలు తాము పోలీసులమని మరిచిపోయి ఓ సాధారణ వ్యక్తులుగా ప్రవర్తించడాన్ని చూస్తే వ్యవస్థలో ఇలాంటి పోలీసులు కూడా ఉంటారా అనిపి

By Anil Kumar

టూ వీలర్ రైడర్ల వికృత చేష్టల కారణంగా ఇండియన్ పోలీసులు అప్పుడప్పుడు బైకర్లను విమర్శిస్తుంటారు. ఒక్కోసారి బైకర్ల ప్రవర్తన ఎలా ఉన్నా కూడా పోలీసులు తమ ప్రతాపం చూపిస్తుంటారు.

హైదరాబాద్ నగరంలో రూ. 18 లక్షల ఖరీదైన డుకాటి డైవెల్ బైకును చూసిన శంషాబాద్ పోలీసుల అసలు తాము పోలీసులమని మరిచిపోయి ఓ సాధారణ వ్యక్తులుగా ప్రవర్తించడాన్ని చూస్తే వ్యవస్థలో ఇలాంటి పోలీసులు కూడా ఉంటారా అనిపిస్తుంది.

డుకాటి డైవెల్ బైకును నడిపిన హైదరాబాద్ పోలీసులు

ఖరీదైన మరియు రేసింగ్ బైకులను చూడగానే తమ ప్రతాపం ఏంటో చూపించేందుకు కొంత మంది పోలీసులు సిద్దమైపోతారు. బైకర్లు అన్ని రకాల రైడింగ్ సేఫ్టీని పాటించినప్పటికీ సీజ్ చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కేరళలో ఇలాంటి సంఘటనలో ఎన్నో జరిగాయి.

డుకాటి డైవెల్ బైకును నడిపిన హైదరాబాద్ పోలీసులు

అయితే, హైదరాబాద్ పోలీసుల నుండి ఎదురైన అరుదైన అనుభవం పోలీసుల మీదున్న దురభిప్రాయాన్ని చెరిపేస్తుంది. వివరాల్లోకి వెళితే, ఓ యూట్యూబర్ జోహైర్ అహ్మద్ డుకాటి డైవెల్ బైకులో హైదరాబాద్ సిటీ మీదుగా ప్రయాణిస్తుండగా ఇద్దరు తెలగాణ పోలీసులు అహ్మద్‌ను రోడ్డు మీద ఆపారు.

డుకాటి డైవెల్ బైకును నడిపిన హైదరాబాద్ పోలీసులు

హీరో ఎక్స్‌‌ట్రీమ్ గస్తీ బైకులో వచ్చిన ఇద్దరు తెలంగాణ పోలీసులు అహ్మద్‌ను నిలిపి, తాను నడుపుతున్న డుకాటి డైవెల్ కార్బన్ బైకు రేటు ఎంత అని అడిగారు. ఇందుకు దీని ధర రూ. 18 లక్షలు అని చెప్పాడు.

డుకాటి డైవెల్ బైకును నడిపిన హైదరాబాద్ పోలీసులు

బైకు ధర విని ఖంగుతిన్న పోలీసులు, బైకుకు మరింత దగ్గరగా వచ్చి డుకాటి డైవెల్‌ను తదేకంగా పరిశీలించారు. ఆ తరువాత మైలేజ్ ఎంత ఇస్తుంది అని ఆరా తీసారు. అంతే కాకుడా, డుకాటి డైవెల్ బైకును కొంత దూరం నడిపి ఫోటోలు కూడా తీసుకున్నారు.

డుకాటి డైవెల్ బైకును నడిపిన హైదరాబాద్ పోలీసులు

జోహైర్ అహ్మద్ తన బైకును పోలీసులకు ఇవ్వడంతో, ఇటాలియన్ బైకును రైడ్ చేసిన పోలీసులు ఎంతో సంతోషించారు. ఆ తరువాత ఆనందంతో రైడర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

డుకాటి డైవెల్ బైకును నడిపిన హైదరాబాద్ పోలీసులు

ఇండియాలో పోలీసు సిబ్బంది గస్తీ నిర్వహించడానికి సాధారణ కమ్యూటర్ మోటార్‌సైకిళ్లను ఉపయోగిస్తున్నారు. గుజరాత్ మరియు కలకత్తా పోలీసుల వద్ద హ్యార్లీ-డేవిడ్సన్ స్ట్రీట్ 750 బైకులు ఉన్నప్పటికీ, వాటిని కేవలం కాన్వాయ్ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు.

డుకాటి డైవెల్ బైకును నడిపిన హైదరాబాద్ పోలీసులు

డుకాటి డైవెల్ బైక్‌కు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉంది. తన విభిన్న డిజైన్ మరియు అరుదైన రూపం కారణంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రపంచ మార్కెట్లో అత్యంత అరుదైన బైకుల్లో డుకాటి డైవెల్ ఒకటి, ఇండియన్ రోడ్ల మీద ఇలాంటి బైకులు చాలా అరుదుగా కనబడుతుంటాయి.

డుకాటి డైవెల్ బైకును నడిపిన హైదరాబాద్ పోలీసులు

డుకాటి డైవెల్ బైకులో సాంకేతికంగా 1198సీసీ కెపాసిటి గల లిక్విడ్-కూల్డ్, ఎల్-ట్విన్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 162బిహెచ్‌పి పవర్ మరియు 130.5ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా గంటకు 270కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు 2.83 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 100కిమీల వేగాన్ని చేరుకోగలదు.

డుకాటి డైవెల్ బైకును నడిపిన హైదరాబాద్ పోలీసులు

గస్తీ బైకు మీద వచ్చిన ఇద్దరు పోలీసులు హెల్మెట్ ధరించకపోవడాన్ని గుర్తించవచ్చు. ప్రమాదం జరిగినపుడు తీవ్రగాయాల నుండి రక్షించడంలో శిరస్త్రాణం ఎంతగానో సహాయపడుతుంది మరియు ఇండియాలో బైకు రైడర్లు తప్పనిసరిగా ధరించాలనే చట్టం కూడా ఉంది. చట్టాలను అమలు చేసే అధికారులే ఇలా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ఇక సాధారణ ప్రజలు ఎలా మారుతారు...?

జోహైర్ అహ్మద్ అప్‌లోడ్ చేసిన వీడియోను వీక్షించగలరు....

ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్సు ద్వారా పాఠకులతో పంచుకోండి.

Source: Zohair Ahmed

Most Read Articles

English summary
Read In Telugu: Hyderabad cop riding a Ducati Diavel superbike: What’s happening here [Video]
Story first published: Thursday, July 26, 2018, 17:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X