అక్విలా ప్రొ మరియు హ్యోసంగ్ జిటి250ఆర్ బైకులు ఇప్పుడు మరింత సురక్షితం

Written By:
Recommended Video - Watch Now!
Auto Rickshaw Explodes In Broad Daylight

కొరియా బైకుల తయారీ దిగ్గజం హ్యోసంగ్(Hyosung) బైకుల్లో భద్రత పరంగా అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS) అప్‌డేట్ చేసింది. భారత్‌లో బాగా పాపులర్ చెందిన అక్విలా ప్రొ(Aquila Pro) మరియు జిటి250ఆర్(GT250R) బైకుల్లో ఏబిఎస్ అందించింది.

హ్యోసంగ్ బైకుల్లో ఏబిఎస్

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 2019 నుండి ఇండియన్ మార్కెట్లో విక్రయించే ప్రతి బైకులో కూడా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరి చేయడంతో ఒక్కొక్క కంపెనీ తమ బైకుల్లో ఏబిఎస్ ఫీచర్ అప్‌గ్రేడ్ చేస్తోంది.

హ్యోసంగ్ బైకుల్లో ఏబిఎస్

తాజాగా, హ్యోసంగ్ జిటి250ఆర్ మరియు అక్విలా ప్రొ బైకుల్లో కొరియన్ దిగ్గజం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందించింది. ఈ బైకులను దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన సొంత విక్రయ కేంద్రాల్లోనే అందుబాటులో ఉంచింది.

హ్యోసంగ్ బైకుల్లో ఏబిఎస్

జిటి 250ఆర్ మరియు అక్విలా ప్రొ రెండు బైకుల్లో డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందించింది. ఇది వరకు అందుబాటులో ఉన్న నాన్ ఏబిఎస్ మోడళ్లతో పోల్చితే ఏబిఎస్ వచ్చిన మోడళ్ల ధర ఎక్కువగానే ఉండనుంది.

హ్యోసంగ్ బైకుల్లో ఏబిఎస్

జిటి250ఆర్ మరియు అక్విలా ప్రొ బైకులు దేశీయ విపణిలో బాగా ప్రసిద్ది చెందాయి. అందుకే తొలుత వీటిలో ఏబిఎస్ పరిచయం చేసింది. హ్యోసంగ్ ఇండియా లైనప్‌లో ఉన్న జిటి650ఆర్ బైకులో కూడా ఏబిఎస్ అందించే ఆలోచనలో ఉంది.

హ్యోసంగ్ బైకుల్లో ఏబిఎస్

హ్యోసంగ్, డిఎస్‌కె భాగస్వామ్యంతో 2014 ఏప్రిల్‌లో జిటి250ఆర్ బైకును దేశీయంగా విడుదల చేసింది. సాంకేతికంగా ఇందులో 249సీసీ కెపాసిటి గల వి-ట్విన్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ కలదు.

హ్యోసంగ్ బైకుల్లో ఏబిఎస్

5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఈ ఇంజన్ 10,000ఆర్‌పిఎమ్ వద్ద 27బిహెచ్‌పి పవర్ మరియు 8,000ఆర్‌పిఎమ్ వద్ద 22ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హ్యోసంగ్ జిటి250ఆర్ బైక్ కవాసకి నింజా 300, బెనెల్లీ 302ఆర్ మరియు యమహా ఫేజర్ 25 మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

హ్యోసంగ్ బైకుల్లో ఏబిఎస్

హ్యోసంగ్ అక్విలా ప్రొ విషయానికి వస్తే, ఈ క్రూయిజర్ బైకులో 647సీసీ కెపాసిటి గల వి-ట్విన్ వాటర్-కూల్డ్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 9,000ఆర్‌పిఎమ్ వద్ద 73బిహెచ్‌పి పవర్ మరియు 7,500ఆర్‌పిఎమ్ వద్ద 62ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హ్యోసంగ్ బైకుల్లో ఏబిఎస్

ప్రస్తుతం, హ్యోసంగ్ జిటి250ఆర్ ఫుల్లీ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ ప్రారంభ ధర రూ. 3.45 లక్షలు మరియు హ్యోసంగ్ అక్విలా ప్రొ ప్రారంభ ధర రూ. 5.63 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి. ఏబిఎస్ వెర్షన్ బైకుల ధరలు కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. అధికారికంగా కంపెనీ వెల్లడించే ధరల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

హ్యోసంగ్ బైకుల్లో ఏబిఎస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఏప్రిల్ 2019 నుండి అన్ని బైకుల్లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరిగా అమలు చేయడానికి ముందే హ్యోసంగ్ తమ మోస్ట్ పాపులర్ మోడళ్లు జిటి250ఆర్ మరియు అక్విలా ప్రొ బైకుల్లో ఏబిఎస్ ఫీచర్ అందించింది.

హ్యోసంగ్ బైకుల్లో ఏబిఎస్

ఈ రెండు స్పోర్ట్స్ మరియు క్రూయిజర్ బైకులు రైడర్లకు మరింత భద్రత కల్పించి, అత్యుత్తమ హ్యాండ్లింగ్ కల్పిస్తాయి. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కావడంతో వీల్ లాక్, రోల్ మరియు స్కిడింగ్ వంటి సమస్యలు అస్సలు ఉండవు.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Hyosung GT250R And Aquila Pro Gets More Safer — Now With ABS
Story first published: Saturday, February 3, 2018, 19:10 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark