దిగుమతి చేసుకునే బైకుల మీద భారీగా తగ్గుతున్న ధరలు

Written By:

భారత్‌లోకి దిగుమతి చేసుకునే బైకుల ధరలు విపరీతంగా తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఇంజన్ కెపాసిటి గల ఖరీదైన మరియు విలాసవంతమైన బైకుల దిగుమతి సుకం తగ్గించడంతో దిగుమతి చేసుకునే బైకుల ధరలు గణనీయంగా దిగిరానున్నాయి.

హై ఎండ్ బైకుల కంపెనీలు అయిన బిఎమ్‌డబ్ల్యూ, హ్యార్లీ డేవిడ్సన్, ట్రైయంప్ మరియు బెనెల్లీ వంటి బైకుల ధరలు భారీగా దిగిరానున్నాయి.

దిగుమతి చేసుకునే బైకుల మీద తగ్గుతున్న ధరలు

800సీసీ ఇంజన్ కెపాసిటి గల బైకుల దిగుమతి మీద బైకు మొత్తం ధరలో 60 శాతాన్ని మరియు 800సీసీ కంటే ఎక్కువ కెపాసిటి గల బైకుల దిగుమతి మీద 75 శాతం దిగుమతి సుంకాన్ని కేంద్రం వసూలు చేసేది.

Recommended Video - Watch Now!
UM Renegade Thor Electric Cruiser Bike India Launch Details, Price, Specifications - DriveSpark
దిగుమతి చేసుకునే బైకుల మీద తగ్గుతున్న ధరలు

అయితే, భారత ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో భారత్‌లోకి దిగుమతి చేసుకునే అన్ని ఖరీదైన బైకుల మీద దిగుమతి సుంకం గరిష్టంగా 50 శాతం వరకు మాత్రమే వసూలు చేయనుంది.

దిగుమతి చేసుకునే బైకుల మీద తగ్గుతున్న ధరలు

పూర్తిగా నిర్మించిన బైకులను కాకుండా కేవలం ఇంజన్ మరియు గేర్‌బాక్స్ అనుసంధానంతో దిగుమతి ఇండియాలో ఫిట్ చేసే బైకుల మీద 30 శాతం నుండి 25 శాతానికి దిగుమతి సుంకాన్ని తగ్గించారు.

దిగుమతి చేసుకునే బైకుల మీద తగ్గుతున్న ధరలు

అదే విధంగా ఇంజన్ మరియు గేర్‌బాక్స్ లేకుండా కేవలం బైకు బాడీని మాత్రమే దిగుమతి చేసుకుని భారత్‌‌లో అసెంబుల్ చేసే బైకుల మీద మునుపటి 10 శాతం ట్యాక్స్‌ను 15 శాతానికి పెంచారు. ఏదేమైనప్పటికీ పూర్తిగా దిగుమతి చేసుకునే బైకుల మీద ఇంపోర్ట్ ట్యాక్స్ గణనీయంగా దిగివచ్చింది.

దిగుమతి చేసుకునే బైకుల మీద తగ్గుతున్న ధరలు

ఇపోర్ట్ లేదా కస్టమ్ ట్యాక్స్ తగ్గించడానికి ప్రధానం కారణం భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దిగుమతి చేసుకునే బైకుల మీద తగ్గుతున్న ధరలు

హ్యార్లీ-డేవిడ్సన్, ట్రైయంప్, ఇండియన్ మోటార్‌సైకిల్స్, బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్, డుకాటి, డిఎస్‍‌‌కె బెనెల్లీ, కవాసకి, హోండా మరియు యమహా వంటి సంస్థలు దిగుమతి చేసుకుని భారత్‌లో విక్రయిస్తున్న మోడళ్ల మీద ధరలు సవరించి నూతన ధరలను అతి త్వరలో వెల్లడించనున్నాయి.

దిగుమతి చేసుకునే బైకుల మీద తగ్గుతున్న ధరలు

ప్రస్తుతం, కొన్ని కంపెనీలు హై ఎండ్ బైకులను థాయిలాండ్ నుండి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(FTA) ద్వారా దిగుమతి చేసుకుంటున్నాయి. ఇలా చేయడంతో ఇండియన్ కస్టమర్లకు అధిక ధర నుండి స్వల్ప విముక్తి లభిస్తుంది. ఏదేమైనప్పటికీ, కొత్తగా దిగుమతి సుంకం తగ్గించడం ఎఫ్‌టిఎ ద్వారా దిగుమతి చేసుకునే బైకుల మీద ఎలాంటి ప్రభావం చూపదు.

దిగుమతి చేసుకునే బైకుల మీద తగ్గుతున్న ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎక్కువ కెపాసిటి గల బైకుల మీద దిగుమతి సుంకం తగ్గించడంతో ఖరీదైన బైకును కొనుగోలు చేయడం కలగానే మిగిలిపోయిన కస్టమర్లకు గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు. కంపెనీలు ఇండియాలో తయారు చేయకుండా, దిగుమతి చేసుకుని విక్రయించే మోడళ్ల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇలాంటి బైకులు కోరుకునే కస్టమర్లు ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గిన ఈ సందర్భంలో ఎంచుకోవడం ఎంతో ఉత్తమం అని చెప్పవచ్చు.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Imported Bikes To Cost Lesser In India — Here's Why
Story first published: Thursday, February 15, 2018, 13:42 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark