ఇండియన్ చీఫ్‌టెయిన్ ఎలైట్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

ఇండియన్ మార్కెట్లో ఖరీదైన మోటార్ సైకిళ్లను విక్రయించే, ఇండియన్ మోటార్‌సైకిల్స్ నేడు విపణిలోకి తమ అత్యంత ఖరీదైన మరియు కంపెనీ యొక్క చీఫ్‌టెయిన్ శ్రేణిలోని హై ఎండ్ మోడల్‌ చీఫ్‌టెయిన్ ఎలైట్ బైకును విడుదల

By Anil Kumar

ఇండియన్ మార్కెట్లో ఖరీదైన మోటార్ సైకిళ్లను విక్రయించే, ఇండియన్ మోటార్‌సైకిల్స్ నేడు విపణిలోకి తమ అత్యంత ఖరీదైన మరియు కంపెనీ యొక్క చీఫ్‌టెయిన్ శ్రేణిలోని హై ఎండ్ మోడల్‌ చీఫ్‌టెయిన్ ఎలైట్ బైకును విడుదల చేసింది.

ఇండియన్ చీఫ్‌టెయిన్ ఎలైట్

ఇండియన్ చీఫ్‌టెయిన్ ఎలైట్ లిమిటెడ్ ఎడిషన్ బైకు, ప్రపంచ వ్యాప్తంగా కేవలం 350 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇండియన్ చీఫ్‌టెయిన్ ఎలైట్ ధర రూ. 38 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

ఇండియన్ చీఫ్‌టెయిన్ ఎలైట్

రోడ్ మాస్టర్ ఎలైట్ తర్వాత ఇండియన్ బ్రాండ్ యొక్క రెండవ లిమిటెడ్ ఎడిషన్ మోటార్‌సైకిల్ ఇండియన్ చీఫ్‌టెయిన్ ఎలైట్. ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్ మోటార్‌సైకిల్స్ ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ లిమిటెడ్ ఎడిషన్ బైకును రూ. 48 లక్షల ఎక్స్-షోరూమ్ ఇండియాతో ధరతో విడుదల చేసింది.

ఇండియన్ చీఫ్‌టెయిన్ ఎలైట్

రెగ్యులర్ ఇండియన్ చీఫ్‌టెయిన్ బైకుతో పోల్చుకుంటే స్పెషల్ ఎడిషన్‌లో పలు అధునాతన మరియు ప్రత్యేకమైన ఫీచర్లు పరిచయం అయ్యాయి. బ్లాక్ హిల్స్ సిల్వర్ పెయింట్ స్కీమ్ మరియు పాలరాతి సొబగులు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఇండియన్ చీఫ్‌టెయిన్ ఎలైట్

ఇతర ఫీచర్లలో, కస్టమ్ లెథర్ సీట్లు, 7-అంగుళాల గ్లోవ్-ఫ్రెండ్లీ రైడ్ కమాండ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు, ఇది బ్లూటూత్ కనెక్టివిటి, టర్న్-బై-టర్న్ న్యావిగేషన్‌ను సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా 200 వ్యాట్ ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటివి ఉన్నాయి.

ఇండియన్ చీఫ్‌టెయిన్ ఎలైట్

ఇండియన్ చీఫ్‌టెయిన్ ఎలైట్ బైకులో పుష్-బటన్ పవర్ విండ్ షీల్డ్, రిమోట్-లాకింగ్ హార్డ్ వెథర్ ప్రూఫ్ శాడిల్ బ్యాగ్స్, ప్రీమియం లెథర్ సీట్లు, అల్యూమినియం ప్లోర్‌బోర్డ్స్, పినాకల్ మిర్రర్స్ మరియు క్రాసోవర్ పైపులు ఉన్న డ్యూయల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కలదు.

ఇండియన్ చీఫ్‌టెయిన్ ఎలైట్

ఇండియన్ చీఫ్‌టెయిన్ ఎలైట్ బైకులో ఉన్న ఇంజన్ విషయానికి వస్తే, సాంకేతికంగా ఇందులో 1811సీసీ సామర్థ్యం గల థండర్‌స్ట్రోక్ 111 వి-ట్విన్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 161.1 టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, స్టాండర్డ్ వెర్షన్‌తో పోల్చితే 11.6ఎన్ఎమ్ ఎక్కువ టార్క్ ఇస్తుంది.

ఇండియన్ చీఫ్‌టెయిన్ ఎలైట్

సస్పెన్షన్ కోసం ముందు వైపున 119ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ఎయిర్ అడ్జెస్ట్ గల 114ఎమ్ఎమ్ మోనోషాక్ అబ్జార్వర్ కలదు. బ్రేకింగ్ విధుల నిర్వర్తించడానికి ముందు చక్రానికి 300ఎమ్ఎమ్ డ్యూయల్ డిస్క్ మరియు వెనుక చక్రానికి 300ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు.

ఇండియన్ చీఫ్‌టెయిన్ ఎలైట్ మొత్తం బరువు 388కిలోలుగా ఉంది. ముందు మరియు వెనుక వరుసగా 19 మరియు 16-అంగుళాల చక్రాలకు డనలప్‌ టైర్లను జోడించారు.

ఇండియన్ చీఫ్‌టెయిన్ ఎలైట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ చీఫ్‌టెయిన్ ఎలైట్ బైకులో కస్టమర్ల స్టేటస్‌కు తగ్గట్లుగా అత్యంత విలాసవంతమైన మరియు ఖరీదైన ఫీచర్లు ఉన్నాయి. లిమిటెడ్ ఎడిషన్ చీఫ్‌టెయిన్ ఎలైట్ బైకులో సిల్వర్ పెయింట్ స్కీమ్ మరియు పాలరాతి సొబగులు ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఇది విపణిలో ఉన్న హోండా గోల్డ్ వింగ్ మరియు హ్యార్లీ‌డేవిడ్సన్ స్ట్రీట్ గ్లిడ్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, August 13, 2018, 14:29 [IST]
English summary
Read In Telugu: Indian Chieftain Elite Launched In India At Rs 38 Lakh — A One-Of-A-Kind Limited Edition Motorcycle
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+