బెంగళూరు వేదికగా 16వ అంతర్జాతీయ జావా డే సెలబ్రేషన్స్‌

భారతదేశపు అతి పెద్ద జావా యెజ్డి మోటార్‌సైకిల్ కలయిక అతి త్వరలో బెంగళూరులో జరగనుంది. 16 వ అంతర్జాతీయ జావా డే సంభరాలను బెంగళూరు జావా యెజ్డి మోటార్‌సైకిల్ క్లబ్ (BJYMC) నిర్వహించనుంది.

By Anil Kumar

భారతదేశపు అతి పెద్ద జావా యెజ్డి మోటార్‌సైకిల్ కలయిక అతి త్వరలో బెంగళూరులో జరగనుంది. 16 వ అంతర్జాతీయ జావా డే సంభరాలను బెంగళూరు జావా యెజ్డి మోటార్‌సైకిల్ క్లబ్ (BJYMC) నిర్వహించనుంది.

అంతర్జాతీయ జావా డే సెలబ్రేషన్స్

ఈ ఏడాది జావా యెజ్డి ఓనర్ల కలయిక జూలై 8, 2018 ఆదివారం నాడు ఉదయం 10:30 గంటలకు బెంగళూరులోని విటల్ మాల్యా రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ ఇండియన్ హై స్కూల్ గ్రౌండ్స్‌లో ఘనంగా ప్రారంభం కానుంది.

అంతర్జాతీయ జావా డే సెలబ్రేషన్స్

అంతర్జాతీయ జావా డే వేడుకలు మొదలైనప్పటి నుండి ఇందులో పాల్గొనేవారి సంఖ్య ప్రతి ఏటా విపరీతంగా పెరుగుతోంది. ఈ ఏడాది జరిగే కార్యక్రమానికి సుమారుగా 500 మోటార్‌సైకిళ్లు మరియు 1000 మందికి పైగా పాల్గొనే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయ జావా డే సెలబ్రేషన్స్

2007లో ఏర్పాటైన బెంగళూరు జావా యెజ్డి మోటార్‌సైకిల్ క్లబ్ నిజానికి లాభాపేక్ష లేని సంస్థ. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జావా డే సెలబ్రేషన్స్‌లో అతి పురాతణ 50సీసీ క్లాట్, 125సీసీ పెరక్ మరియు 350 ట్విన్స్ వంటి ఇకానిక్ మోటార్‌సైకిళ్లను ప్రదర్శించనున్నారు.

అంతర్జాతీయ జావా డే సెలబ్రేషన్స్

అంతర్జాతీయ జావా రోజును ప్రతి ఏటా జూలై రెండవ ఆదివారం జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ మరియు దేశవ్యాప్తంగా ఉన్న జావా మోటార్‌సైకిల్ ప్రియులు స్వచ్ఛందంగా పాల్గొని ఒకరినొకరు పరిచయం చేసుకుని, క్లాసిక్ మోటార్‌సైకిళ్ల పట్ల తమ ఇష్టాన్ని ఆ వేదిక మీద అందరితో పంచుకుంటారు.

అంతర్జాతీయ జావా డే సెలబ్రేషన్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియాలో మోటార్‌సైకిళ్ల ఔత్సాహికులకు జావా మరియు యెజ్డి అత్యంత పురాతణమైన పాపులర్ క్లాసిక్ మోటార్‌సైకిల్ కంపెనీలుగా బాగా సుపరిచితం. రెండు కంపెనీల మోటార్‌సైకిళ్లు 1960 నుండి 1996 మధ్య కాలంలో తయారయ్యేవి. అతి తక్కువ నిర్వహణ, అత్యుత్తమ విశ్వసనీయతకు అప్పట్లో ఈ కంపెనీలు ఉత్పత్తి చేసే 2-స్ట్రోక్ 250సీసీ మోటార్ సైకిళ్లు ఎంతో ప్రసిద్ది. వీటిని మైసూరులోని ఐడియల్ జావా ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసే వారు.

అంతర్జాతీయ జావా డే సెలబ్రేషన్స్

ఏదేమైనప్పటికీ సుమారుగా కొన్ని సంవత్సరాల పాటు జావా మోటార్‌సైకిళ్లు అందుబాటులో లేవు, మహీంద్రా అండ్ మహీంద్రా సరిగ్గా రెండేళ్ల క్రితం జావా మోటార్‌సైకిల్స్ మరియు బిఎస్ఎ బ్లాండ్లను కొనుగోలు చేసింది. అతి త్వరలో జావా బ్రాండ్ పేరుతో నూతన ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Bangalore Jawa Yezdi Motorcycle Club (BJYMC) To Host 16th International Jawa Day Celebrations
Story first published: Thursday, July 5, 2018, 17:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X