కవాసకి నింజా 400 విడుదల: ప్రారంభ ధర రూ. 4.69 లక్షలు

Written By:

జపాన్ స్పోర్ట్స్ బైకుల తయారీ దిగ్గజం కవాసకి విపణిలోకి నింజా 400 బైకును లాంచ్ చేసింది. కవాసకి సరికొత్త ఫుల్ పెయిర్ నింజా 400 మోటార్ సైకిల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 4.69 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. కవాసకి తమ నింజా 400 బైకును మొట్టమొదటి సారిగా ఇటలీలో జరిగిన ఐక్మా 2017 మోటార్ సైకిల్ షోలో ఆవిష్కరించింది.

కవాసకి నింజా 400 విడుదల

సాంకేతికంగా కవాసకి నింజా 400 స్పోర్ట్స్ బైకులో శక్తివంతమైన 399సీసీ కెపాసిటి గల ప్యార్లల్ ట్విన్, లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీ జోడింపుతో అనుసంధానం చేసిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ గల ఇంజన్ 48.3బిహెచ్‌పి పవర్ మరియు 38ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కవాసకి నింజా 400 విడుదల

సుపీరియర్ రైడింగ్ డైనమిక్స్ కోసం కవాసకి నింజా 400 బైకును స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ ఆధారంగా నిర్మించారు. నింజా 400 మొత్తం బరువు 168కిలోలుగా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నింజా 300తో పోల్చుకుంటే దీని బరువు 6కిలోలు వరకు తక్కువగా ఉంది.

కవాసకి నింజా 400 విడుదల

డిజైన్ పరంగా, కవాసకి నింజా 400 ఫ్రంట్ మరియు రియర్ డిజైన్‌లో పదునైన ఫినిషింగ్ కలదు. మునుపటి 300 వెర్షన్‌తో పోల్చుకుంటే అత్యంత ఆకర్షణీయమైన కండలు తిరిగిన ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. అంతే కాకుండా, సరికొత్త ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ప్రీమియమ్ డిజిటల్ డిస్ల్పే ఇందులో వచ్చాయి.

Recommended Video - Watch Now!
2018 హోండా సిబిఆర్ 250ఆర్ రివీల్ | New Honda CBR 250 Details, Expected Launch & Price - DriveSpark
కవాసకి నింజా 400 విడుదల

కవాసకి నింజా 400లో ముందు వైపున 41ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. బ్రేకింగ్ విధులు నిర్వర్తించడానికి ముందు వైపున 310ఎమ్ఎమ్ మరియు వెనుక వైపున 220ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను తప్పనిసరిగా అందివ్వడం జరిగింది.

కవాసకి నింజా 400 విడుదల

సరికొత్త కవాసకి నింజా 400 బైకులో న్యారో టెయిల్ సెక్షన్ ఎల్ఇడి టెయిల్ లైట్ మరియు అధునాతన ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉన్నాయి. నింజా 400 సిగ్నేచర్ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ స్కీమ్‌లో లభ్యమవుతోంది. నింజా 400లో పిలియన్ సీట్ కౌల్, హెల్మెట్ లాక్, రేడియేటర్ స్క్రీన్, ట్యాంక్ బ్యాగ్ మరియు ట్యాంక్ ప్యాడ్‌లతో పాటు ఇంకా ఎన్నో ఫీచర్లను కవాసకి అదనంగా అందిస్తోంది.

కవాసకి నింజా 400 విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కవాసకి ఎట్టకేలకు నింజా 300 స్థానంలోకి నింజా 400 బైకును లాంచ్ చేసింది. యంగ్ ఇండియన్ కస్టమర్లను ఆకట్టుకునే డిజైన్ శైలి మరియు ఫీచర్లతో వచ్చిన కవాసకి నింజా 400 విపణిలో ఉన్న యమహా వైజడ్ఎఫ్ ఆర్3, కెటిఎమ్ ఆర్‌సి390, అపాచే ఆర్ఆర్310 మరియు బెనెల్లీ 302ఆర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Kawasaki Ninja 400 Launched In India; Priced At Rs 4.69 Lakh

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark