2018 కవాసకి నింజా జడ్ఎక్స్-10ఆర్ మీద బుకింగ్స్ ప్రారంభం
జపాన్ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం కవాసకి దేశీయ మార్కెట్లో సరికొత్త 2018 కవాసకి నింజా జడ్ఎక్స్-10ఆర్(Kawasaki Ninja ZX-10R) మోడల్ మీద అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింది.
జపాన్ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం కవాసకి దేశీయ మార్కెట్లో సరికొత్త 2018 కవాసకి నింజా జడ్ఎక్స్-10ఆర్(Kawasaki Ninja ZX-10R) మోడల్ మీద అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింది.

కవాసకి డీలర్లు 2018 కవాసకి నింజా జడ్ఎక్స్-10ఆర్ సూపర్ బైకు మీద బుకింగ్స్ ఆహ్వానిస్తున్నారు. ఔత్సాహిక కస్టమర్లు 3 లక్షల రుపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

లీటర్ కెపాసిటి ఇంజన్ గల ఈ బైకు విడుదల గురించి కవాసకి ఇండియా విభాగం నుండి ఎలాంటి సమాచారం అందలేదు. అయితే, మా వద్ద ఉన్న సమాచారం మేరకు జూన్ మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన పాపులర్ రేస్ బైకుల్లో కవాసకి నింజా జడ్ఎక్స్-10ఆర్ ఒకటి. గతంలో జడ్ఎక్స్-10ఆర్ మోడళ్లను పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకుని విక్రయించేవారు. అయితే, పూనేలోని చకన్ ప్లాంటులో కవాసకి దీనిని ఉత్పత్తి చేయనుంది.

విడి భాగాలను జపాన్ నుండి దిగుమతి చేసుకుని, ఇండియాలో అసెంబుల్ చేసే ఈ మోడళ్ల ధరలు గణనీయంగా తగ్గిపోతాయి. 2018 కవాసకి నింజా జడ్ఎక్స్-10ఆర్ ధర రూ. 18 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉండవచ్చు.

సాంకేతికంగా కవాసకి నింజా జడ్ఎక్స్-10ఆర్ బైకులో 998సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ ఇన్-లైన్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఉంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 194బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

అల్యూమినియం పెరిమీటర్ ఫ్రేమ్ మీద నిర్మించిన నింజా జడ్ఎక్స్-10ఆర్ బైకులో ముందు వైపున 120/70 జడ్ఆర్17 మరియు వెనుక వైపున 190/55 జడ్ఆర్17 కొలతల్లో ఉన్న టైర్లు ఉన్నాయి.

సస్పెన్షన్ కోసం మోటోజిపి వంటి రేస్ బ్రాండ్ మోటార్ సైకిళ్లలో వినియోగించే అత్యాధునిక షోవా 43ఎమ్ఎమ్ బ్యాలెన్స్ ఫ్రీ ఫోర్క్ ఫ్రంట్ సస్పెన్షన్ నింజా జడ్ఎక్స్-10ఆర్‌లో ఉంది.

బ్రేకింగ్ విధుల కోసం ముందు వైపున 330ఎమ్ఎమ్ బ్రెంబో సెమీ-ఫ్లోటింగ్ డ్యూయల్ డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపున 220ఎమ్ఎమ్ చుట్టకొలత గల సింగల్ డిస్క్ బ్రేక్ ఉంది. బ్రేకింగ్ వ్యవస్థ పనితీరును మరింత మెరుగుపరిచే కవాసకి ఇంటెలిజెంట్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది.

ఇది వరకు పేర్కొన్న ఫీచర్లతో పాటు 2018 కవాసకి నింజా జడ్ఎక్స్-10ఆర్ బైకులో ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ ఫీచర్లు...
- స్పోర్ట్ కవాసకి ట్రాక్షన్ కంట్రోల్ (S-KTRC)
- కవాసకి లాంచ్ కంట్రోల్ మోడల్ (KLCM)
- కవాసకి ఇంజన్ బ్రేకింగ్ కంట్రోల్ (KEBC)
- కవాసకి క్విక్ షిఫ్టర్ (KQS); అప్‌షిఫ్ట్ కోసం మాత్రమే
- కవాసకి కార్నరింగ్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్ (KCMF)
- బాష్ ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్ (IMU)

అంతే కాకుండా, 2018 కవాసకి జడ్ఎక్స్-10ఆర్ బైకులో పలు రకాల పవర్ మోడ్స్ ఉన్నాయి. మనం ఎంచుకునే "ఫుల్", "మిడిల్" మరియు "లో" పవర్ మోడ్స్ ద్వారా ఇంజన్ 100%, 80% మరియు 60% పవర్ మాత్రమే ఇస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
కవాసకి జడ్ఎక్స్-10ఆర్ సూపర్ బైకు నిజానికి 10ఆర్ పేరుతో రేసింగ్ ప్రియులకు బాగా సుపరిచితం. డిజైన్, పర్ఫామెన్స్, ఫీచర్లు మరియు అవసరానికి తగ్గ పవర్ అవుట్‌పుట్ ఇలా అన్ని అంశాల పరంగా పర్ఫెక్ట్ సూపర్ బైక్ అని నిరూపించుకుంది. పూర్తి స్థాయిలో లాంచ్ అయితే, విపణిలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ 1000ఆర్ఆర్ మరియు యమహా వైజడ్ఎఫ్-ఆర్1 మరియు హోండా సిబిఆర్1000ఆర్అర్ మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.


Click it and Unblock the Notifications








