విపణిలోకి కవాసకి వుల్కన్ ఎస్ పర్ల్ లావా ఆరేంజ్ బైక్ విడుదల

కవాసకి ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త కవాసకి వుల్కన్ ఎస్ పర్ల్ లావా ఆరేంజ్ బైకును లాంచ్ చేసింది. వుల్కన్ ఎస్ పర్ల్ లావా ఆరేంజ్ ప్రారంభ ధర రూ. 5.58 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

By Anil Kumar

జపాన్ దిగ్గజ ఖరీదైన మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ కవాసకి ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త కవాసకి వుల్కన్ ఎస్ పర్ల్ లావా ఆరేంజ్ బైకును లాంచ్ చేసింది. వుల్కన్ ఎస్ పర్ల్ లావా ఆరేంజ్ ప్రారంభ ధర రూ. 5.58 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. ఈ సరికొత్త ఆరేంజ్ కలర్ వుల్కన్ ఎస్ మోడల్ రెగ్యులర్ బ్లాక్ షేడ్ మోడల్‌తో విక్రయించబడుతుంది.

కవాసకి వుల్కన్ ఎస్ పర్ల్ లావా ఆరేంజ్ విడుదల

డిసెంబరు 2017లో రూ. 5.48 లక్షల ప్రారంభ ధరతో విడుదలైనప్పుడు కవాసకి వుల్కన్ ఎస్ కేవలం నలుపు రంగులో మాత్రమే లభించేది. ఈ క్రూయిజర్ మోడల్‌కు మార్కెట్లో డిమాండ్ అధికమవ్వడంతో వుల్కన్ ఎస్ మోడల్‌ను ఇప్పుడు ఆరేంజ్ కలర్ ఆప్షన్‌లో రూ. 5.58 లక్షలకు ప్రవేశపెట్టింది.

కవాసకి వుల్కన్ ఎస్ పర్ల్ లావా ఆరేంజ్ విడుదల

డిజైన్ పరంగా కవాసకి వుల్కన్ ఎస్ ఇతర క్రూయిజర్ మోడళ్ల తరహాలోనే ఉంటుంది. పురుష మరియు మహిళా రైడర్లను దృష్టిలో ఉంచుకుని అద్భుతమైన రైడింగ్ కోసం అన్ని విడి భాగాలను ప్రత్యేకంగా రూపొందించి, అభివృద్ది చేసి ఇందులో అందివ్వడం జరిగింది.

కవాసకి వుల్కన్ ఎస్ పర్ల్ లావా ఆరేంజ్ విడుదల

రైడింగ్ అనుభవాన్ని ఎప్పుటికప్పుడు, రైడర్ల సౌకర్యానికి అనుగుణంగా మార్చుకునేందుకు వుల్కన్ ఎస్ బైకులో స్టాండర్డ్, 25ఎమ్ఎమ్ ముందు వైపుకు మరియు 25ఎమ్ఎమ్ వెనుక వైపుకు ఇలా మూడు రకాలుగా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న ఫుట్ పెడల్స్ ఉన్నాయి.

కవాసకి వుల్కన్ ఎస్ పర్ల్ లావా ఆరేంజ్ విడుదల

కవాసకి నింజా 650 ఛాసిస్ మీద వుల్కన్ ఎస్ బైకును నిర్మించారు. సాంకేతికంగా ఇందులో 649సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ ప్యార్లల్ ట్విన్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 7500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 60.2బిహెచ్‌పి పవర్ మరియు 6600ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 62.78ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కవాసకి వుల్కన్ ఎస్ పర్ల్ లావా ఆరేంజ్ విడుదల

కవాసకి వుల్కన్ ఎస్ సీట్ ఎత్తు 705ఎమ్ఎమ్‌గా ఉంది. ఈ క్రూయిజర్ బైకు మొత్తం బరువు 235కిలోలుగా ఉంది. మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 130ఎమ్ఎమ్‌గా ఉంది. ఇండియన్ రోడ్లకు ఒక పర్ఫెక్ట్ క్రూయిజర్ అంటే కవాసకి వుల్కన్ ఎస్ అని చెప్పవచ్చు.

కవాసకి వుల్కన్ ఎస్ పర్ల్ లావా ఆరేంజ్ విడుదల

భద్రత పరంగా కవాసకి వుల్కన్ ఎస్ బైకులో ముందు వైపున 300ఎమ్ఎమ్ మరియు వెనుక వైపున 250ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇండియన్ వెర్షన్ వుల్కన్ ఎస్ బైకులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ మిస్సయ్యింది.

కవాసకి వుల్కన్ ఎస్ పర్ల్ లావా ఆరేంజ్ విడుదల

సరికొత్త కవాసకి వుల్కన్ ఎస్ క్రూయిజర్ బైకు విపణిలో ఉన్న హ్యార్లీ-డేవిడ్సన్ స్ట్రీట్ రాడ్ 750 మరియు అప్‌కమింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 మరియు ఇంటర్‌సెప్టార్ 650 మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

కవాసకి వుల్కన్ ఎస్ పర్ల్ లావా ఆరేంజ్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆరేంజ్ కలర్ షేడ్‌లో ఉన్న వుల్కన్ ఎస్ చూడటానికి చాలా చక్కగా ఉంది. అయితే, రెగ్యులర్ బ్లాక్ కలర్ షేడ్ మోడల్ కంటే దీని ధర రూ. 10,000 ల వరకు ఎక్కుగా ఉంది. లీనియర్ టార్క్, స్మూత్ ఇంజన్ రన్నింగ్ మరియు మంచి ఎగ్జాస్ట్ సౌండ్ విషయంలో నింజా 650 ఇంజన్ లక్షణాలను ఇందులో గమనించవచ్చు.

సరసమైన ధరలో ఎంట్రీ లెవల్ పర్ఫామెన్స్ ప్రీమియమ్ క్రూయిజర్ బైకు అధునాతన ఫీచర్లు మరియు డిజైన్ శైలితో ఇదే సెగ్మెంట్లో మంచి అనుభవం గడించిన హ్యార్లీ-డేవిడ్సన్ వంటి సంస్థలకు కవాసకి గట్టి పోటీగా నిలిచిందని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: Kawasaki Vulcan S Pearl Lava Orange Launched In India At Rs 5.58 Lakh: Costs More Than The Black
Story first published: Thursday, May 3, 2018, 9:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X