కవాసకి జడ్900ఆర్ఎస్ విడుదల: ధర, ఇంజన్ మరియు ప్రత్యేకతలు

కవాసకి మోటార్ ఇండియా విపణిలోకి తమ రెట్రో మరియు క్లాసిక్ స్టైల్ జడ్900ఆర్ఎస్ మోటార్ సైకిల్‌ను న్యూ కలర్ ఆప్షన్‌లో లాంచ్ చేసింది. సరికొత్త కవాసకి జడ్900ఆర్ఎస్ ఇప్పుడు ఆల్ న్యూ బ్లాక్ కలర్ పెయింట్ స్కీమ్

By Anil Kumar

కవాసకి మోటార్ ఇండియా విపణిలోకి తమ రెట్రో మరియు క్లాసిక్ స్టైల్ జడ్900ఆర్ఎస్ మోటార్ సైకిల్‌ను న్యూ కలర్ ఆప్షన్‌లో లాంచ్ చేసింది. సరికొత్త కవాసకి జడ్900ఆర్ఎస్ ఇప్పుడు ఆల్ న్యూ బ్లాక్ కలర్ పెయింట్ స్కీమ్‌లో లభ్యమవుతోంది.

కవాసకి జడ్900ఆర్ఎస్ విడుదల: ధర, ఇంజన్ మరియు ప్రత్యేకతలు

కవాసకి ఇండియా విభాగం ఫిబ్రవరి 2018లో ఈ జడ్900ఆర్ఎస్ బైకును క్యాండీ టోన్ ఆరేంజ్ కలర్ ఆప్షన్‌లో విపణిలోకి విడుదల చేసింది. ఇప్పుడు, తాజాగా కవాసకి జడ్900ఆర్ఎస్‌ను బ్లాక్ కలర్ ఆప్షన్‌లో పరిచయం చేసింది. కవాసకి జడ్900ఆర్ఎస్ బ్లాక్ కలర్ వేరియంట్ ధర రూ. 15.30 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

కవాసకి జడ్900ఆర్ఎస్ విడుదల: ధర, ఇంజన్ మరియు ప్రత్యేకతలు

1970 కాలం నాటి జడ్1 మరియు మోడ్రన్ జడ్900 మోడళ్ల సంపూర్ణ సమ్మేళనమే ఈ జడ్900ఆర్ఎస్. పురాతణ జడ్1 డిజైన్ లక్షణాలతో మరియు జడ్900 నుండి సేకరించిన సాంకేతిక అంశాలతో జడ్900ఆర్ఎస్ బైకును రూపొందించారు.

కవాసకి జడ్900ఆర్ఎస్ విడుదల: ధర, ఇంజన్ మరియు ప్రత్యేకతలు

కవాసకి జడ్900ఆర్ఎస్ బైకులో సాంకేతికంగా 948సీసీ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల ఇన్-లైన్ పెట్రోల్ ఇంజన్ కలదు, 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 109.48బిహెచ్‌పి పవర్ మరియు 98.5ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కవాసకి జడ్900ఆర్ఎస్ విడుదల: ధర, ఇంజన్ మరియు ప్రత్యేకతలు

బైకు ఐడ్లింగ్‌లో ఉన్నపుడు, తక్కువ స్పీడులో వెళుతున్నపుడు విభిన్న ఎగ్జాస్ట్ సౌండ్ వచ్చేందుకు కవాసకి ఈ జడ్900ఆర్ఎస్ సైలెన్సర్‌ను కొద్దిగా ట్యూనింగ్ చేసింది. ఇందులో అడ్లాన్స్‌డ్ కవాసకి ట్రాక్షన్ కంట్రోల్, ఎల్ఈడీ హెడ్‌లైట్, డ్యూయల్ అనలాగ్ స్టైల్ స్పీడో మీటర్ మరియు టాకోమీటర్ మధ్యన మల్టీ-ఫంక్షన్ ఎల్‌సీడీ స్క్రీన్ వంటివి ఫీచర్లు ఉన్నాయి.

కవాసకి జడ్900ఆర్ఎస్ విడుదల: ధర, ఇంజన్ మరియు ప్రత్యేకతలు

కవాసకి జడ్900ఆర్ఎస్ బైకులో ముందు వైపున 41ఎమ్ఎమ్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున గ్యాస్ ఛార్జ్‌డ్ మోనోషాక్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. ఈ రెండింటినీ రీబౌండ్ డ్యాంపింగ్ మరియు స్ప్రింగ్ ప్రి-లోడెడ్ అడ్జెస్ట్‌మెంట్ ఉంది.

కవాసకి జడ్900ఆర్ఎస్ విడుదల: ధర, ఇంజన్ మరియు ప్రత్యేకతలు

బ్రేకింగ్ విధులను నిర్వర్తించడానికి ముందు వైపున 300ఎమ్ఎమ్ ట్విన్ డిస్క్ బ్రేక్ సెటప్ మరియు వెనుక వైపున 250ఎమ్ఎమ్ సింగల్ డిస్క్ బ్రేక్ కలదు. మెరుగైన బ్రేకింగ్ కోసం డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను తప్పనిసరిగా అందించారు.

కవాసకి జడ్900ఆర్ఎస్ విడుదల: ధర, ఇంజన్ మరియు ప్రత్యేకతలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కవాసకి జడ్900ఆర్ఎస్ రెట్రో-స్టైల్ బైకును మోడ్రన్ ఫీచర్లతో మరియు నూతన బ్లాక్ కలర్ పెయింట్ స్కీమ్‌లో లాంచ్ చేసింది. సరికొత్త బ్లాక్ కలర్ కవాసకి జడ్900ఆర్ఎస్ దేశవ్యాప్తంగా ఉన్న కవాసకి అధీకృత డీలర్ల వద్ద అందుబాటులో ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 18, 2018, 13:10 [IST]
English summary
Read In Telugu: Kawasaki Z900RS In Black Colour Launched In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+