విపణిలోకి కవాసకి Z900RS బైక్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు

ఖరీదైన బైకుల సెగ్మెంట్లోకి కవాసకి సరికొత్త జడ్900ఆర్ఎస్ బైకును లాంచ్ చేసింది. సరికొత్త కవాసకి జడ్900ఆర్ఎస్ రెట్రో-నేక్డ్ మోటార్ సైకిల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 15.30 లక్షలుగా ఉంది.

By Anil

Recommended Video

BMW Motorcycles Auto Expo 2018

ఖరీదైన బైకుల సెగ్మెంట్లోకి కవాసకి సరికొత్త జడ్900ఆర్ఎస్(Kawasaki Z900RS) బైకును లాంచ్ చేసింది. సరికొత్త కవాసకి జడ్900ఆర్ఎస్ రెట్రో-నేక్డ్ మోటార్ సైకిల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 15.30 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా నిర్ణయించారు.

కవాసకి జడ్900ఆర్ఎస్ బైకును కవాసకి జడ్900 ఆధారంగా అభివృద్ది చేసింది. అయితే, రెట్రో స్టైలింగ్ లక్షణాలను మాత్రం 1970 కాలం నాటి ఇకానిక్ మోడల్ జడ్1 నుండి సేకరించి డిజైన్ చేశారు.

కవాసకి జడ్900ఆర్ఎస్ విడుదల

సాంకేతికంగా, కవాసకి జడ్900ఆర్ఎస్ రెట్రో-నేక్డ్ బైకులో 948సీసీ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల ఇన్ లైన్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది, 8,500ఆర్‌పిఎమ్ వద్ద 109.48బిహెచ్‌పి పవర్ మరియు 6,500ఆర్‌పిఎమ్ వద్ద 98.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కవాసకి జడ్900ఆర్ఎస్ విడుదల

కవాసకి జడ్900ఆర్ఎస్ బైకులోని శక్తివంతమైన ఇంజన్‌కు అనుసంధానం చేసిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా ఇంజన్ ప్రొడ్యూస్ పవర్ మరియు టార్క్ చైన్ డ్రైవ్‌తో రియర్ వీల్‌కు సరఫరా అవుతుంది. జడ్900 బైకుతో పోల్చుకుటే 7,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద అత్యుత్తమ పవర్ అందుతుంది.

కవాసకి జడ్900ఆర్ఎస్ విడుదల

సస్పెన్షన్ పరంగా కవాసకి జడ్900ఆర్ఎస్ బైకులో ముందు వైపున 41ఎమ్ఎమ్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున గ్యాస్ ఛార్జ్‌డ్ మోనోషాక్ అబ్జార్వర్ ఉన్నాయి. రెండింటిలో కూడా రిబౌండ్ డ్యాంపింగ్ మరియు స్ప్రింగ్ ప్రి-లోడ్ అడ్జెస్ట్‌మెంట్ ఫీచర్ కలదు.

కవాసకి జడ్900ఆర్ఎస్ విడుదల

బ్రేకింగ్ డ్యూటీ కోసం కవాసకి జడ్900ఆర్ఎస్‌లోని ఫ్రంట్ వీల్‌కు 300ఎమ్ఎమ్ ట్విన్ డిస్క్ బ్రేకులు మరియు రియర్ వీల్‌కు 250ఎమ్ఎమ్ సింగల్ డిస్క్ కలదు. రియర్ డిస్క్ బ్రేక్‌కు సేఫ్టీ కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందివ్వడం జరిగింది.

కవాసకి జడ్900ఆర్ఎస్ క్యాండీటోన్ బ్రౌన్ మరియు క్యాండీ టోన్ ఆరేంజ్ అనే రెండు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది.

కవాసకి జడ్900ఆర్ఎస్ విడుదల

డిజైన్ పరంగా కవాసకి జడ్900ఆర్ఎస్ చూడటానికి సొగసైన నేక్డ్ స్టైల్లో ఉంటుంది. గుండ్రటి ఆకారంలో ఉన్న ఎల్ఇడి హెడ్‌ల్యాంప్, నీటి చుక్క ఆకారంలో ఉన్న 17-లీటర్ల కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్ మరియు నాలుగు సిలిండర్ల నుండి వచ్చే పొగను బయటకు పంపించే సింగల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ వంటివి బైకు మొత్తానికి రెట్రో స్టైల్ తీసుకొచ్చాయి.

కవాసకి జడ్900ఆర్ఎస్ విడుదల

కవాసకి జడ్900ఆర్ఎస్ బైకులో ట్విన్-పోడ్ ఇస్ట్రుమెంట్ క్లస్టర్, మధ్యలో డిజిటల్ డిస్ల్పే, రెండు డయల్స్ కూడా బైక్ స్పీడ్ మరియు ఇంజన్ ఆర్‌పిఎమ్ చూపిస్తాయి. డిజిటల్ డిస్ల్పేలో గేర్ పొజిషన్ ఇండికేటర్, ఫ్యూయల్ గేజ్, ప్రస్తుతం మరియు సగటు ఇంధన వినియోగం, పరిధి మరియు ఇంజన్ ఉష్ణోగ్రత వంటి వివరాలను పొందవచ్చు.

కవాసకి జడ్900ఆర్ఎస్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జపాన్ మోటార్‌సైకిల్ తయారీ దిగ్గజం కవాసకి తమ జడ్1 ఆధారంతో అభివృద్ది చేసిన జడ్900ఆర్ఎస్ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. కవాసకి దీనిని జపాన్ నుండి పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకొని విక్రయించనుంది. ప్రస్తుతం విపణిలో ఉన్న జడ్1000ఆర్‌తో పోల్చుకుంటే జడ్900ఆర్ఎస్ ధర 20,000 ల వరకు తక్కువగా ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, February 23, 2018, 17:31 [IST]
English summary
Read In Telugu: Kawasaki Z900RS Launched At Rs 15.30 Lakh In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+