సరదా కోసం చేసిన బైక్ రైడ్‌లో 11 ఏళ్ల చిన్నారిని చంపేశాడు, చితకబాదిన గ్రామస్థులు

By Anil

స్పోర్ట్స్ బైకుల మీద హైవేలపై మెరుపు వేగంతో దూసుకుపోతూ రైడింగ్ చేయడమంటే యువతకు మహా సరదా. అయితే, ప్రతి సరదాకు ఓ హద్దు ఉండాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం మరియు మితిమీరిన వేగంతో రైడింగ్ చేస్తే సరదా కాస్త హద్దు మీరి విషాదంగా ముగుస్తుంది.

కెటిఎమ్ ఆర్‌సి 390 ప్రమాదం

ఆదివారం రోజు(07/01/18)న ఎన్‌హెచ్-7 మీద చిక్‌బళ్లాపూర్ సమీపంలో జరిగిన ఓ విషాద సంఘటనే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో బైకర్ల కారణంగా ముద్దులొలికే 11 ఏళ్ల చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది.

Recommended Video - Watch Now!
Bangalore Bike Accident At Chikkaballapur Near Nandi Upachar - DriveSpark
కెటిఎమ్ ఆర్‌సి 390 ప్రమాదం

ఏడవ నెంబర్ జాతీయ రహదారి మీద బెంగళూరు వైపు వస్తున్న కెటిఎమ్ ఆర్‌సి390 బైక్ రైడర్ చిక్‌బళ్లాపూర్ పరిధిలోని బుల్లాలి జంక్షన్ వద్ద నంది ఉపచార్ రెస్టారెంట్‌కు సమీపంలో అధిక వేగంతో ఒక పాపను ఢీకొన్నాడు. ఈ ఘటనలో ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది.

కెటిఎమ్ ఆర్‌సి 390 ప్రమాదం

కళ్ల ముందరే అమ్మాయి మరణించడాన్ని చూసిన స్థానికులు కోపంతో పరిస్థితిని చేతుల్లోకి తీసుకొని బైకును ధ్వంసం చేసి, రైడర్‌ను చెట్టుకు కట్టేసి చావబాదారు. అంతటి ఆగకుండా, జాతీయర రహదారి 7 కు ఇరువైపులా వాహన రాకపోకలను స్తంభింపజేశారు.

కెటిఎమ్ ఆర్‌సి 390 ప్రమాదం

ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న గ్రామస్థులంతా కోపంతో జాతీయ రహదారి మీద వచ్చే అనేక సూపర్ బైకులను ధ్వంసం చేసి, రైడర్ల మీద తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో కెటిఎమ్‌ ఆర్‌సి390, బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200జిఎస్ మరియు హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్‌బ్యాయ్ వంటి ఖరీదైన బైకులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.

కెటిఎమ్ ఆర్‌సి 390 ప్రమాదం

ఇదే మార్గంలో రైడింగ్ చేస్తున్న మరో రైడర్ సంఘటనా స్థలంలో నెలకొన్న పరిస్థితిని వెనకాలే వస్తున్న ఇతర రైడర్లకు తెలియజేశాడు. అధిక సంఖ్యలో రైడర్లు వస్తుండటంతో గ్రామస్థులంతా రైడర్ల మీద దాడి చేసి, ధ్వంసం చేయడానికి ఎగబడ్డారు.

కెటిఎమ్ ఆర్‌సి 390 ప్రమాదం

సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, గ్రామస్థుల ఆక్రోశానికి జరగాల్సిందంతా జరిగిపోయింది. బెంగళూరు సిటీ నుండి వీకెండ్ రైడ్ చేయడానికి ఎన్‌హెచ్-7 బాగా పేరుగాంచింది.

కెటిఎమ్ ఆర్‌సి 390 ప్రమాదం

ఎన్‌హెచ్-7 జాతీయ రహదారి మీదుగానే నంది హిల్స్ మరియు కోలార్ వంటి ప్రదేశాలకు బైక్ రైడర్లుగా బృందాలుగా ఏర్పడి రైడింగ్ చేస్తుంటారు. రైడింగ్‌లో ఉపయోగించే అన్ని బైకులు కూడా అత్యంత శక్తివంతమైన మరియు ఖరీదైనవి.

కెటిఎమ్ ఆర్‌సి 390 ప్రమాదం

జాతీయ రహదారి మీద ప్రమాదం జరగడం, మరిన్ని ప్రమాదాలు జరగడానికి కారణమవుతుంది. అంతే కాకుండా జాతీయ రహదారి మీద ఉన్న జంక్షన్లు, యూటర్నులు, మలుపుల్లో రైడర్లు జాగ్రత్తగా ఉండాలి. అంతే కాకుండా, హైవేల మీద పెద్ద ఎత్తున జనసందోహం ఉన్నపుడు, పాదచారులు రోడ్డు దాటుతున్నపుడు బైక్ వేగాన్ని అందుపులోకి తీసుకురావడం మంచిది.

కెటిఎమ్ ఆర్‌సి 390 ప్రమాదం

అదే విధంగా జాతీయ రహదారుల ప్రక్కన గ్రామాలు ఉన్నపుడు పరిమిత వేగంతోనే వెళ్లాలి. ఇలాంటి ప్రదేశాల్లో పాదచారులు ఎక్కువగా రోడ్డు దాటుతుంటారు. వేగాన్ని అదుపులోకి తీసుకొచ్చి పాదచారులను వెళ్లనిస్తే మంచిది, లేదంటే భారీ ప్రమాదాలు తప్పవు.

కెటిఎమ్ ఆర్‌సి 390 ప్రమాదం

రాత్రి వేళల్లో రైడింగ్ మరింత ప్రమాదకరం. రాత్రి పూట బైక్ ప్రయాణం తప్పనిసరి అయితే, రోడ్డు మీద గుంతలను, పాదచారులను మరియు ఇతర అడ్డంకులను చూసి స్పందించగలిగే వేగాన్ని ఫాలో అవ్వాల్సిందే. లేదంటే, అడ్డంకులను చూసి అలర్ట్ అయ్యేలోపే ప్రమాదాలు జరిగిపోతాయి.

కెటిఎమ్ ఆర్‌సి 390 ప్రమాదం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఊహించని విధంగా జరిగిన ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందడం చాలా భాదాకరం. అయితే, ఇది అమ్మాయి తప్పిదమా... లేకపోతే రైడర్ తప్పిదమా... అనేది తెలియరాలేదు. పరిస్థిని బట్టి చూస్తే, రైడర్ అధిక వేగంతో అమ్మాయిని ఢీకొని ఉండవచ్చు లేదంటే అమ్మాయే ఉన్నట్లుండి రోడ్డు మీదకు వెళ్లి ఉండవచ్చు.

అయితే, ఎలాంటి తప్పు చేయని ఇతర రైడర్ల మీద గ్రామస్థులు దాడికి పాల్పడి, వారి బైకులను ధ్వంసం చేశారు.

కెటిఎమ్ ఆర్‌సి 390 ప్రమాదం గురించిన అప్‌డేట్స్:

కెటిఎమ్ ఆర్‌సి 390 ప్రమాదం గురించిన అప్‌డేట్స్:

11 ఏళ్ల పాప మరణానికి కారణమయ్యాడని భావించి గ్రామస్థులు దాడి చేసిన వ్యక్తి ఇప్పుడు కెటిఎమ్ కివ్‌‌రాజ్ వాట్సాప్ గ్రూపులో జరిగిన అసలు పోస్ట్ చేశాడు. అతని మాటల్లో, "నిజానికి నేను ఆ అమ్మాయిని ఢీకొట్టలేదు. ఎవరో ఢీకొట్టి పారిపోయారు. మేమంతా బైక్ రైడర్స్, ప్రమాదం జరిగిన సంఘటను చూసి, మా టీమ్ మొత్తాన్ని అప్రమత్తం చేశాను."

కెటిఎమ్ ఆర్‌సి 390 ప్రమాదం గురించిన అప్‌డేట్స్:

"ప్రమాదం జరిగిన ప్రదేశంలో జనసందోహం మూగడంతో నేనే ఢీ కొట్టానని భావించి నా మీద దాడికి యత్నించారు. అయితే, అసలు విషయాన్ని వారికి వివరించాను. ఆ తరువాత హైవే మీద వస్తున్న అన్ని బైకులను నిలిపి ధ్వంసం చేయాలని భావించారు. దాదాపు అన్ని బైకులు నాశనం అయ్యాయి."

కెటిఎమ్ ఆర్‌సి 390 ప్రమాదం గురించిన అప్‌డేట్స్:

"అంతే కాకుండా ప్రమాదం జరిగినపుడు అక్కడ కేవలం నలుగురో ఐదు మందో ఉన్నారు. అక్కడికి వచ్చిన అందరూ నేనే ప్రమాదానికి కారకుడని గుడ్డిగా భావించి నా మీద పైశాచికంగా దాడి చేశారు." అసలు ప్రమాదం చేసింది ఒకరైతే, శిక్షించేది మరొకరినా అని వాపోయాడు.

ఈ సంభాషణ ఒక రైడర్స్‌ గ్రూపులో జరిగింది మాత్రమే. నిజానికి ఆ అమ్మాయిని ఢీకొన్నది ఇతనేనా లేదంటే వేరే వ్యక్తి ఢీకొట్టి పారిపోయాడా అనే విషయం ఇంకా తెలియరాలేదు. మరి ఈ కేసు మీద పోలీసుల దర్యాప్తులో ఏం తెలుతుందో చూడాలి మరి...

Most Read Articles

English summary
Read In Telugu: KTM RC390 Crashes Into A Child — Mob Thrashes Bikers And Destroys Bikes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more