మేడిన్ ఇండియా కవాసకి బైకులు విడుదల

కవాసకి దేశీయంగా తయరైన నింజా జడ్ఎక్స్-10ఆర్ మరియు జడ్ఎక్స్-10ఆర్ఆర్ బైకులను విపణిలోకి లాంచ్ చేసింది. సరికొత్త మేడిన్ ఇండియా కవాసకి నింజా జడ్ఎక్స్ 10ఆర్ ధర రూ. 12.80 లక్షలు మరియు కవాసకి నింజా జడ్ఎక్స్-1

By Anil Kumar

కవాసకి దేశీయంగా తయరైన నింజా జడ్ఎక్స్-10ఆర్ మరియు జడ్ఎక్స్-10ఆర్ఆర్ బైకులను విపణిలోకి లాంచ్ చేసింది. సరికొత్త మేడిన్ ఇండియా కవాసకి నింజా జడ్ఎక్స్ 10ఆర్ ధర రూ. 12.80 లక్షలు మరియు కవాసకి నింజా జడ్ఎక్స్-10ఆర్ఆర్ ధర రూ. 16.10 లక్షలు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి. ఈ రెండు ధరలు జూలై 2018 వరకు మాత్రమే అమల్లో ఉంటాయని కవాసకి పేర్కొంది.

కవాసకి బైకులు మీద తగ్గిన ధరలు

కవాసకి నింజా జడ్ఎక్స్-1ఆర్ మరియు నింజా జడ్ఎక్స్-1ఆర్ఆర్ మోడళ్ల దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కవాసకి అధీకృత డీలర్ల వద్ద ప్రారంభమయ్యాయి. రెండు మోడళ్లను కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిసింది. ఇండియాకు కేటాయించిన సంఖ్యలో బుకింగ్స్ నమోదైతే, ఆ తరువాత బుకింగ్స్ నిలిపేసి ఉత్పత్తి మరియు డెలివరీ చేపట్టనుంది.

కవాసకి బైకులు మీద తగ్గిన ధరలు

సాంకేతికంగా కవాసకి జడ్ఎక్స్-10ఆర్ మరియు జడ్ఎక్స్10-ఆర్ఆర్ బైకుల్లో 998సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు, 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 197బిహెచ్‌పి పవర్ మరియు 113.4ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కవాసకి బైకులు మీద తగ్గిన ధరలు

కవాసకి జడ్ఎక్స్-10ఆర్ మరియు జడ్ఎక్స్10-ఆర్ఆర్ బైకుల్లో కవాసకి లాంచ్ కంట్రోల్, కవాసకి ట్రాక్షన్ కంట్రోల్, కవాసకి బ్రేకింగ్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్, కార్నర్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్ మరియు బాష్ ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్ మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

కవాసకి బైకులు మీద తగ్గిన ధరలు

కవాసకి జడ్ఎక్స్-10ఆర్ కేఆర్‌టీ ఎడిషన్‌లో గ్రీన్ కలర్ మరియు పలు బాడీ గ్రాఫిక్స్ ఫినిషింగ్‌లో అదే విధంగా నింజా జడ్ఎక్స్-10ఆర్ఆర్ బ్లాక్ కలర్ స్కీములో కూడా లభ్యమవుతుంది. కవాసకి నింజా జడ్ఎక్స్-10ఆర్ అంతర్జాతీయ మార్కెట్లో మూడు విభిన్న వేరియంట్లు మరియు కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది.

కవాసకి బైకులు మీద తగ్గిన ధరలు

కవాసకి ఇండియా మేనేజింగ్ డైరక్టర్ యుటాకా యమషిట మాట్లాడుతూ, కవాసకి నింజా జడ్ఎక్స్-10ఆర్ మరియు జడ్ఎక్స్-10ఆర్ఆర్ మోటార్ సైకిళ్లను కవాసకి వారసత్వ ఇంజనీరింగ్ నైపుణ్యం మరియు అత్యాధునిక సాంకతిక పరిజ్ఞానం జోడింపుతో రూపొందించాము. ఇండియాలో కొత్తగా ఏర్పాటు చేసిన కవాసకి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బృందం ఈ రెండు మోడళ్లను పూర్తి స్థాయిలో దేశీయంగా ఉత్పత్తి చేయడంలో కీలకపాత్రను పోషించింది.

కవాసకి బైకులు మీద తగ్గిన ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జపాన్ దిగ్గజం కవాసకి దేశీయ విపణిలోకి ఎట్టకేలకు మేడిన్ ఇండియా కవాసకి నింజా జడ్ఎక్స్-10ఆర్ మరియు జడ్ఎక్స్-10ఆర్ఆర్ మోటార్ సైకిళ్లను లాంచ్ చేసింది. పూర్తి స్థాయిలో దేశీయంగా తయారు చేయడంతో దిగుమతి చేసుకునే మోడళ్ల కంటే వీటి ధర సుమారుగా 6 లక్షల వరకు తగ్గింది.

కవాసకి బైకులు మీద తగ్గిన ధరలు

మేడిన్ ఇండియా కవాసకి నింజా జడ్ఎక్స్ సిరీస్ బైకుల మీద ప్రకటించిన ధరలు జూలై 2018 వరకు మాత్రమే అమల్లో ఉంటాయి. కాబట్టి, నింజా జడ్ఎక్స్ బైకు కొనే ఆలోచనలో ఉన్నట్లయితే... ఏ మాత్రం ఆలస్యం చేయకండి...

More from DriveSpark

Article Published On: Saturday, June 30, 2018, 11:51 [IST]
English summary
Read In Telugu: Locally Assembled Kawasaki Ninja ZX-10R And ZX-10RR Launched — Prices Reduced
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+