డ్యూయల్ టోన్ రంగుల్లో లభ్యమవుతున్న మహీంద్రా మోజో ఎక్స్‌టి300

By Anil Kumar

మహీంద్రా టూ వీలర్స్ అందుబాటులో ఉంచిన మోజో ఎక్స్‌టి300 బైకుని నూతన కలర్ స్కీమ్‌లో అప్‌డేట్ చేసింది. మహీంద్రా మోజో ఎక్స్‌టి300 ఇప్పుడు ఓషియన్ బ్లూ/వైట్ మేళవింపుల డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌లో లభ్యమవుతోంది.

మహీంద్రా మోజో ఎక్స్‌టి300

మోజో ఎక్స్‌టి300 ధరలో ఎలాంటి మార్పులు జరగలేదు. డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ అప్‌డేట్ అదే మునుపటి ధరలకే లభ్యమవుతోంది. సరికొత్త మహీంద్రా మోజో ఎక్స్‌టి300 డ్యూయల్ టోన్ వేరియంట్ ధర రూ. 1.79 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

మహీంద్రా మోజో ఎక్స్‌టి300

మహీంద్రా మోజో ఎక్స్‌టి300 టాప్ ఎండ్ వేరియంట్ వొల్కానో రెడ్/సిల్వర్ డ్యూయవ్ టోన్ పెయింట్ స్కీమ్‌లో కూడా లభిస్తోంది. మహీంద్రా ఆఫీషియల్ వెబ్‌సైట్ మేరకు, మోజో గతంలో లభించే సింగల్-టోన్ బ్లాక్ పెయింట్ స్కీమ్ తొలగించింది.

మహీంద్రా మోజో ఎక్స్‌టి300

మహీంద్రా మోజో ఎక్స్‌టి300 పర్ఫామెన్స్ బైకులో సాంకేతికంగా 295సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 26బిహెచ్‌‌పి పవర్ మరియు 30ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా మోజో ఎక్స్‌టి300

మహీంద్రా మోజో ఎక్స్‌టి300 బైకులో ముందు వైపున అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో-షాక్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. బ్రేకింగ్ విధులు నిర్వర్తించడానికి ఫ్రంట్ వీల్‌కు 320ఎమ్ఎమ్ మరియు రియర్ వీల్‌కు 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులను అందివ్వడం జరిగింది.

మహీంద్రా మోజో ఎక్స్‌టి300

మోజో ఎక్స్‌టి300లో ముందు చక్రానికి 110/17 మరియు వెనుక చక్రానికి 150/60 కొలతల్లో పటిష్టమైన రోడ్ గ్రిప్ గల పిరెల్లీ డియాబ్లో రొస్సో II టైర్లు ఉన్నాయి.

మహీంద్రా మోజో ఎక్స్‌టి300

ఎక్స్‌టి300 వేరియంట్లో పలు విభిన్న ఫీచర్లు ఉన్నాయి. అందులో, ట్విన్ పోడ్ హెడ్‍‌ల్యాంప్స్, ఎల్ఇడి డీఆర్ఎల్, ట్విన్ ఎగ్జాస్ట్ పైపులు, సెమీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్ మరియు 21-లీటర్ల కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్ వంటివి ఉన్నాయి.

మహీంద్రా మోజో ఎక్స్‌టి300

మహీంద్రా ఈ ఏడాది ప్రారంభంలో మోజో యుటి300 అనే ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఎక్స్‌టి300 ఇంజన్ ఇందులోనూ వచ్చింది. స్పెసిఫికేషన్స్ పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు. అయితే, కొన్ని కీలకమైన ఫీచర్లు మిస్సయ్యాయి.

మహీంద్రా మోజో ఎక్స్‌టి300

మహీంద్రా ఎక్స్‌టి300 టాప్ ఎండ్ వేరియంట్ కాగా యుటి300 ఎంట్రీ లెవల్ వేరియంట్. దీని ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. మోజో యుటి300 వొల్కానొ రెడ్ మరియు ఓషియన్ బ్లూ అనే సింగల్ టోన్ కలర్ ఆప్షన్స్‌లో లభ్యమవుతోంది.

మహీంద్రా మోజో ఎక్స్‌టి300

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా తాజాగా ఎక్స్‌టి300 మోడల్‌ను నూతన పెయింట్ స్కీమ్‌తో అప్‌డేట్ చేసింది. సరికొత్త డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ 300సీసీ మోటార్ సైకిళ్లను ఎంచుకునే కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటుందని కంపెనీ ఆశిస్తోంది.

మహీంద్రా మోజో ఎక్స్‌టి300 విపణిలో ఉన్న కెటిఎమ్ డ్యూక్ 390, టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 మరియు హోండా సిబిఆర్250ఆర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra Mojo XT300 Receives New Colour Options — Prices Remain Unchanged
Story first published: Monday, June 18, 2018, 13:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X