మహీంద్రా నుండి మోజో యుటి300 బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్

మహీంద్రా టూ వీలర్స్ విపణిలోకి ఖరీదైన విడి భాగాలు మరియు ఫీచర్లతో స్పోర్ట్స్ టూరర్ నేక్డ్ "మోజో" బైకును లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు మోజో బైకును లో కాస్ట్ వేరియంట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది

By Anil

Recommended Video

Angry Bull Almost Rammed Into A Car - DriveSpark

మహీంద్రా టూ వీలర్స్ విపణిలోకి ఖరీదైన విడి భాగాలు మరియు ఫీచర్లతో స్పోర్ట్స్ టూరర్ నేక్డ్ "మోజో" బైకును లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు మోజో బైకును లో కాస్ట్ వేరియంట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

మహీంద్రా మోజో యుటి300

రెగ్యులర్ వెర్షన్ మోజో బైకు నుండి ఖరీదైన ఫీచర్లను తొలగించి స్టాండర్డ్ వెర్షన్‌ మోజో బైకును యుటి300 పేరుతో ప్రవేశపెట్టనుంది. డిజైన్ పరంగా చూడటానికి అచ్చం మోజో బైకునే పోలి ఉంటుంది.

మహీంద్రా మోజో యుటి300

సరికొత్త మోజో యుటి300 బైకులో ముందు వైపున కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ ఉన్నాయి. అయితే రెగ్యులర్ మోజో బైకులో అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ ఉండేవి.

మహీంద్రా మోజో యుటి300

రెగ్యులర్ వెర్షన్ మోజో బైకులో ఉండే ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ గల ఇంజన్‌కు బదులుగా మోజో యుటి300 బైకులో కార్బోరేటర్ గల ఇంజన్ ఉంది. అంతే కాకుండా, ఎల్ఇడి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్ పైపులు, పిరెల్లీ డియాబ్లో రొస్సోII టైర్లు వంటివి మిస్సయ్యాయి. వీటి స్థానంలో సాధారణ ఎమ్‌ఆర్‌ఎఫ్ టైర్లు వచ్చాయి.

మహీంద్రా మోజో యుటి300

రెగ్యులర్ వెర్షన్ మోజో బైకులో గమనించినట్లు బాడీ మీద ఉన్న గోల్డెన్ పెయింట్ స్కీమ్ గల ఫ్రేమ్ మరియు ఫ్రంట్ ఫోర్క్స్ ఇందులో రాలేదు. అయితే, పూర్తి స్థాయిలో బ్లాక్ పెయింట్ స్కీములో ఉన్న స్వింగ్ ఆర్మ్ మరియు ఛాసిస్ ఉన్నాయి.

మహీంద్రా మోజో యుటి300

మహీంద్రా మోజో యుటి300 బైకు రెండు విభిన్న కలర్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది. అవి, రెడ్ మరియు బ్లూ. అత్యుత్తమ రైడింగ్ కోసం సౌకర్యవంతమైన రైడర్ మరియు పిలియన్ సీటు ఇందులో ఉంది.

మహీంద్రా మోజో యుటి300

భారీ ఫీచర్లతో ఇప్పటికే అందుబాటులో ఉన్న మోజో బైకును మోజో ఎక్స్‌టి300 పేరుతో రీలాంచ్ చేయనుంది. మోజో ఎక్స్‌టి300 మరియు మోజో యుటి300 రెండు బైకుల్లో కూడా 295సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 27బిహెచ్‌పి పవర్ మరియు 30ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా మోజో యుటి300

మహీంద్రా తమ మోజో యుటి300 బైకులను ఇప్పటికే డీలర్ల చెంతకు చేరుస్తోంది. అతి త్వరలో దీని విడుదల ఉండనుంది. మహీంద్రా మోజో యుటి300 బైకు ధర రూ. 1.4 లక్షల నుండి రూ. 1.5 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది.

మహీంద్రా మోజో యుటి300

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా ప్రస్తుతం విక్రయిస్తున్న మోజో యొక్క స్టాండర్డ్ వేరియంట్‌గా మోజో యుటి300 బైకును అందుబాటులోకి తీసుకొస్తోంది. మిడ్ సైజ్ స్పోర్ట్స్ టూరర్ బైకుల సెగ్మెంట్లో ఉన్న బజాజ్ డామినర్ 400 కు పోటీగా దీన్ని లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Image courtesy: Bikers Guide-India

More from DriveSpark

Article Published On: Wednesday, January 17, 2018, 18:15 [IST]
English summary
Read In Telugu: Low-Cost Mahindra Mojo UT300 Spotted At Dealership — To Rival Bajaj Dominar 400
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+