ఒప్పందం కుదిరి నాలుగేళ్లయినా ఇంకా సందిగ్ధంలోనే మహీంద్రా-ప్యూజో స్కూటర్లు

By Anil Kumar
Recommended Video - Watch Now!
Auto Expo 2018: Suzuki Burgman Street First Look, Price, Features, Specifications - DriveSpark

టూ వీలర్లు, కార్లు, లారీల నుండి విమానాలు మరియు షిప్పుల వరకు ఆటోమొబైల్ పరిశ్రమలో ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకునే సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2014లో ప్యూజో స్కూటర్స్‌లో 51 శాతం వాటాను సొంతం చేసుకుంది.

మహీంద్రా-ప్యూజో స్కూటర్లు

2017-18లో ప్యూజో బ్రాండ్ పేరుతో మహీంద్రా పలు ప్రీమియమ్ స్కూటర్లను విపణిలోకి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, భారత్‌లో ప్యూజో స్కూటర్ల విడుదల చేసే ఆలోచనను తాత్కాలికంగా ప్రక్కన పెట్టేసింది.

మహీంద్రా-ప్యూజో స్కూటర్లు

ఇండియన్ స్కూటర్ల పరిశ్రమలోకి మహీంద్రా మరియు ప్యూజో భాగస్వామ్యంలో స్కూటర్లను పరిచయం చేయడాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు మహీంద్రా మేనేజింగ్ డైరక్టర్ పవన్ గోయెంకా స్పష్టం చేశాడు.

మహీంద్రా-ప్యూజో స్కూటర్లు

మహీంద్రా టూ వీలర్స్ విభాగం ప్యూజో స్కూటర్లను విపణిలోకి విడుదల చేయకపోవడానికి గల ప్రదానం కారణం, ఇండియన్ కస్టమర్ల అంచనాలకు తగ్గట్లుగా ప్యూజో స్కూటర్ల ధరలను మహీంద్రా నిర్ణయించలేకపోతోంది.

మహీంద్రా-ప్యూజో స్కూటర్లు

మహీంద్రా సంస్థ 2014లో ప్యూజో బ్రాండ్‌ను సొంతం చేసుకున్నప్పటి నుండి ఇండియన్ కస్టమర్ల అభిరుచులు మరియు ఇష్టాలకు అనుగుణమైన ఉత్పత్తులను ప్రవేశపెట్టడం మరియు అత్యంత పోటీగా ఉన్న సెగ్మెంట్లో తమ స్కూటర్ల ధరలను నిర్ణయించడం మరియు మార్కెట్లో ఒక సరైన స్థానాన్ని సొంతం చేసుకోవడానికి అవసరమయ్యే మోడళ్ల గురించి తెలుసుకోవడానికి పలు కస్టమర్ క్లినిక్ క్యాంపెయిన్స్ నిర్వహించింది.

మహీంద్రా-ప్యూజో స్కూటర్లు

ఏదేమైనా మహీంద్రా ఇండియన్ స్కూటర్ల పరిశ్రమలో ప్రవేశించడమనేది ఒక పెద్ద సవాలుతో కూడుకున్న అంశం. ప్యూజో బ్రాండ్ స్కూటర్లు నిజానికి చాలా ఖరీదైనవి. అయినప్పటికీ, ప్యూజో స్కూటర్స్ రెండు నుండి మూడు మోడళ్లను మార్కెట్లోకి లాంచ్ చేయాలని భావించింది.

మహీంద్రా-ప్యూజో స్కూటర్లు

ప్యూజో భావించిన స్కూటర్లలో డిజాంగో మరియు స్పీడ్‌ఫైట్ ఉన్నాయి. రెండు కూడా 125సీసీ ప్రీమియమ్ స్కూటర్ సెగ్మెంట్ క్రిందకు వస్తాయి. ప్రస్తుతం, దేశీయ విపణిలో 125సీసీ స్కూటర్ సెగ్మెంట్ గత కొన్ని నెలలుగా అత్యంత ప్రసిద్ది చెందుతోంది.

మహీంద్రా-ప్యూజో స్కూటర్లు

ఇటీవల, హోండా గ్రాజియా 125 స్కూటర్ మరియు టీవీఎస్ ఎన్‌టార్క్ 125 మరియు అప్రిలియా ఎస్ఆర్125 స్కూటర్లు వరుసగా విపణిలోకి లాంచ్ అయ్యాయి. సుజుకి వచ్చే పండుగ సీజన్ నాటికి మోస్ట్ ప్రీమియమ్ వెర్షన్ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటోంది.

మహీంద్రా-ప్యూజో స్కూటర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ స్కూటర్ పరిశ్రమలో 125సీసీ స్కూటర్ సెగ్మెంట్ ఇప్పటికే చాలా పాపులర్ అయ్యింది. మహీంద్రా ఈ విభాగంలో ఇంకా తొందరగానే ప్రవేశించాల్సింది. అయితే, బిఎస్-VI ప్రమాణాలు అమలు అయితే స్కూటర్ల ధరలు ఎలా మారనున్నాయో అని తెలుసుకునేందుకు మహీంద్రా వేచి ఉన్నట్లు తెలుస్తోంది.

Source: Moneycontrol

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra-Peugeot Scooter Launch Plan Put On Hold
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X