స్కూటర్ నడుపుతూ ఇతను చేసిన పని ఎంత వరకు కరెక్ట్...?

చిన్న పిల్లలకు వాహనాలను నడపడానికి ఇచ్చిన తల్లిదండ్రులను అరెస్ట్ చేసి, జైలు శిక్షను కూడా విధిస్తున్నారు. కేరళలో అయితే, పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించే తల్లిదండ్రుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్

By Anil Kumar

అండర్ ఏజ్ డ్రైవింగ్ లేదా రైడింగ్ కేసులు ఇటీవల కాలంలో ఎక్కువగా నమోదవుతున్నాయి. మోటార్ వాహనాల చట్టం ప్రకారం, కనీస వయో పరిమితి లేని యువత మరియు పిల్లలు వాహనాలను నడపడం వలన ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు తమదైన శైలిలో ఈ సమస్యను అరికట్టేందుకు పలు రకాల చర్యలు తీసుకుంటున్నాయి.

వద్దన్న పని చేసినందుకు తగిన శాస్తే జరిగింది!

చిన్న పిల్లలకు వాహనాలను నడపడానికి ఇచ్చిన తల్లిదండ్రులను అరెస్ట్ చేసి, జైలు శిక్షను కూడా విధిస్తున్నారు. కేరళలో అయితే, పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించే తల్లిదండ్రుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నారు.

వద్దన్న పని చేసినందుకు తగిన శాస్తే జరిగింది!

ఇటీవల, ఓ చిన్నారి స్కూటర్ నడుపుతుండగా తీసిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. అయితే, అదే స్కూటర్లో కూర్చుని తమ కూతురున్న ప్రోత్సహించిన తల్లిదండ్రుల డ్రైవింగ్ లైసెన్స్‌ను కేరళ రాష్ట్ర పోలీస్ అధికారులు రద్దు చేశారు.

వద్దన్న పని చేసినందుకు తగిన శాస్తే జరిగింది!

సరిగ్గా ఏం జరిగిందో చూద్దాం రండి...

వివరాల్లోకి వెళితే, కేరళలో ఓ జంట టీవీఎస్ స్కూటర్ మీద ప్రయాణిస్తున్నపుడు. అదే స్కూటర్‌లో ముందు వైపున తమ ఐదేళ్ల కూతురు నిలుచుని స్కూటర్ హ్యాండిల్ చేస్తోంది. నిలుచున్నప్పటికీ అధిక వేగంతో బాగానే రైడ్ చేస్తోంది.

వద్దన్న పని చేసినందుకు తగిన శాస్తే జరిగింది!

అయితే, వీరిని అనుసరించిన కారులోని వ్యక్తులు చక్కగా వీడియో తీసి సోషల్ మరియు య్యూట్యూబ్‌లో శుభ్రంగా అప్‌లోడ్ చేశారు. అంతే కొన్ని గంటల వ్యవధిలోనే ఆ వీడియో వైరస్‌లా అంతర్జాలం మొత్తాన్ని వ్యాపించింది.

వద్దన్న పని చేసినందుకు తగిన శాస్తే జరిగింది!

వీడియో తీస్తున్న వ్యక్తులు, అలా చేయడం ప్రమాదకరం మరియు మంచిది కాదని కూడా ఆ దంపతులకు వివరించారు. స్కూటర్ మీద ఉన్న వ్యక్తి మాత్రమే హెల్మెట్ ధరించాడు. ఇద్దరు చిన్న పిల్లలు మరియు మహిళ హెల్మెట్ ధరించకుండా అత్యంత ప్రమాదకరంగా ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తున్నారు.

వద్దన్న పని చేసినందుకు తగిన శాస్తే జరిగింది!

ఈ కంట ఆ కంటపడిన ఆ వీడియోను టీవీ ఛానళ్లు కూడా ప్రసారం చేశాయి. చిలికి చిలికి గాలి వానాలా వ్యాపించి వైరల్ అయిన ఆ వీడియో చివరికి కేరళ పోలీసుల దృష్టికి వెళ్లింది. అంతే... ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, చిన్న పిల్లలను రైడింగ్ చేయడానికి ప్రోత్సహించినందుకు గాను ఆ తల్లిదండ్రుల లైసెన్స్‌ను రద్దు చేశారు.

వద్దన్న పని చేసినందుకు తగిన శాస్తే జరిగింది!

ప్రజల భద్రత దృష్టా అధికారులు ఎంత చెబుతున్నా ప్రజలు వినడం లేదు. దేశవ్యాప్తంగా అక్కడక్కడా ఇలాంటి సంఘటనలో పునరావృతం అవుతూనే ఉన్నాయి. చిన్న పిల్లలు రైడ్ చేస్తున్నంత వరకు చాలా ముద్దుగా ఉంటుంది. కానీ అనుకోకుండా ఎదైనా ప్రమాదం జరిగితే భారీ నష్టం తప్పదు. వద్దన్నా చేసిన పనికి ఇప్పుడు ఆ తండ్రికి తగిన శాస్తే జరిగింది.

వద్దన్న పని చేసినందుకు తగిన శాస్తే జరిగింది!

చిన్న పిల్లలు వాహనాలు ఇవ్వడం...

పబ్లిక్ రోడ్ల మీద చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వడం అత్యంత ప్రమాదకరం మరియు చట్ట పరంగా ఇది నేరం కూడా. చిన్న పిల్లలను వాహనాలు నడిపేందుకు ప్రోత్సహించడం లేదా స్వయంగా తల్లిదండ్రులే వారి చేతికి స్టీరింగ్ లేదా హ్యాండిల్ ఇవ్వడం అత్యంత ప్రమాదకరం, ఎదైనా అవాంతరంం ఎదురైతే వాటిని అధిగమించే సామర్థ్యం పిల్లలు ఏ మాత్రం ఉండదు.

డ్రైవింగ్ పట్ల శిక్షణ లేకుండా వాహనాన్ని నడపంతో రహదారులకు సంభందించి ప్రాథమిక అవగాహన కూడా వారికి ఉండదు. అదే విధందా స్కూటర్లు లేదా బైకులు అయితే వాటిని బరువును అస్సలు కంట్రోల్ చేయలేరు. కాబట్టి, వీలైనంత వరకు మీ పిల్లలను మీ వ్యక్తి గత వాహనాలకు దూరంగా ఉంచండి. లేదంటే వారి వలన మీరు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

Source: Asianetnews

More from DriveSpark

Article Published On: Tuesday, July 31, 2018, 15:33 [IST]
English summary
Read In Telugu: Man allows 5-year old daughter to ride TVS Jupiter: RTO cancels his license [Video]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+