మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 - స్టేజ్ 1 ఫలితాలు

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ మొదటి స్టేజ్ పూర్తి చేసుకుంది. భారతదేశపు అతి ర్యాలీ పోటీల్లోని ఫస్ట్ స్టేజ్ రాజస్థాన్‌లోని బికనీర్ భూబాగాల గుండా సాగింది.

By Anil Kumar

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ మొదటి స్టేజ్ పూర్తి చేసుకుంది. భారతదేశపు అతి ర్యాలీ పోటీల్లోని ఫస్ట్ స్టేజ్ రాజస్థాన్‌లోని బికనీర్ భూబాగాల గుండా సాగింది.

పోటీదారులు అత్యంత దుర్భేధ్యమైన భూగాల్లోని ఇసుక మరియు ముళ్ల పొదల మధ్య పోటీపడ్డారు. టూ వీలర్ల ర్యాలీ మధ్యాహ్నం తరువాత ప్రారంభమవగా, ఫోర్ వీలర్ ర్యాలీ సాయంత్రం ఆరు తరువాత ప్రారంభమైంది.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ 2018

ర్యాలీ నిర్వాహకులు ప్లాన్ చేసిన స్టేజ్-1 రూట్ రవాణాకు ఏ మాత్రం సాధ్యం కాదు. మీడియా మరియు నిర్వాహకులందరూ స్టేజ్-1 ర్యాలీ ముగిసే ప్రదేశంలో ఉన్నారు. జనవాసం చాలా తక్కువగా ఉన్న ఈ మార్గంలో కేవలం కంటెస్టెంట్లు మాత్రమే వెళ్లారు.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ 2018

స్టేజ్-1 ర్యాలీలో టూ వీలర్ల విభాగంలో డకార్ ర్యాలీలో చివరి జాబితాలో నిలిచిన మరియు హీరో మోటోకార్ప్ రైడర్ సిఎస్ సంతోష్ అందరికంటే ముందుగా ర్యాలీ ముంగిసే ప్రదేశానికి చేరుకున్నాడు.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ 2018

టూ వీలర్ ర్యాలీ విభాగంలో మోటార్‌సైకిళ్లతో పాటు క్వాడ్ బైకులు కూడా పాల్గొన్నాయి. ఆఫ్ రోడ్ బైకుల కంటే ఏటివి వాహనాలు ఇసుక తిన్నెల మీద ఎంతో ఎంతో సులభంగా దూసుకెళ్లాయి.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ 2018

ర్యాలీ మొత్తం ఎడారిలో ఉండటంతో, రైడర్లు తప్పిపోకుండా ఉండేందుకు ర్యాలీ నిర్వాహకులు పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఏదేమైనప్పటికి, కఠినమైన మార్గాల గుండా వెళ్లి సహాయం అందించడానికి కాస్త సమయం తీసుకుంటుంది. కాబట్టి, చాలా వరకు రైడర్లు తమ తామే సేఫ్టీ చూసుకోవాల్సి వచ్చింది.

Recommended Video

హోండా ఎక్స్-బ్లేడ్ 160సీసీ బైక్ రివీల్ | Honda X-Blade - Details & Full Specifications - DriveSpark
మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ 2018

ప్రాంతీయంగా ఉండే జనాలకు తమ ప్రాంతంలో ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. పిల్లలు నుండి పెద్దల వరకు అందరూ ర్యాలీ పొడవునా మరియు ముగిసే ప్రాంతంలో ఎంతో ఆసక్తిగా చూస్తూ గుంపులుగా గుమిగూడారు. నిజానికి, ఇలాంటి ఈవెంట్లు చాలా అరుదుగా జరుగుతుంటాయి, స్వయంగా ఇలాంటి ర్యాలీని వీక్షించడం గ్రామాల్లో నివసించే వారికి కాస్త కొత్తగా ఉంటుంది.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ 2018

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 స్టేజ్-1 ఫలితాలు

మోటో కెటగిరీలో

1. సిఎస్ సంతోష్ #1

2. అరోన్ మరె #3

3. సంజయ్ కుమార్ #6

ఎక్స్‌ప్లోర్ కెటగిరీలో

1. నిపున్ అగర్వాల్, కబీర్ మన్షర్మణి #301

2. విశాల్ చౌదరి, అభివేక్ సింగ్ గోధార #305

3. సురేంద్ర గోపు, హర్దీప్ సింగ్ #307

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ 2018

ఎండ్యూర్ కెటగిరీలో

1. సుఖ్‌జీత్ సింగ్, ధళివాల్, లెనిల్ జె #217

2. గురిపిందర్ సింగ్, మ్రిన్మోయ్ సాహా #207

3. రుచిత్ జాదవ్, ఆదిత్యా గర్గ్ #214

ఎక్స్‌ట్రీమ్ కెటగిరీలో

1. సురేశ్ రాణా, పి.వి శ్రీనివాస్ మూర్తి #101

2. అభిషేక్ మిశ్రా, వి వేణు రమేష్ కుమార్ #103

3. గౌరల్ క్రిపాల్, శ్రీకాంత్ గౌడ్ #102

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ 2018

మారుతి సుజుకి మరియు ఎగ్జాన్‌మొబిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న డెసర్ట్ స్టార్మ్ 2018 స్టేజ్-1 ర్యాలీలో తొలిరోజే కంటెస్టెంట్లు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. కాస్త ఆలస్యంగానే అయినప్పటికీ, స్టేజ్-1 ర్యాలీ విజయవంతంగా ముగిసింది.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ కంప్లీట్ అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ 2018

డ్రైవ్‌స్పార్క్ తెలుగులో ఎక్కువ మంది చదువిన కథనాలు:

1. 16 ఎడిషన్ డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ ప్రారంభించిన మారుతి సుజుకి

2.రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 క్రిస్టల్ ఎడిషన్

3.అన్ని కార్ల మీద భారీగా ధరలు పెంచిన టాటా మోటార్స్

4.హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్: ధర, డిజైన్, ఫీచర్లు మరియు మైలేజ్ పరంగా ఏ స్కూటర్ బెస్ట్?

5.ఫోర్డ్ ఆస్పైర్ ఎలక్ట్రిక్ సెడాన్ విడుదల చేయనున్న మహీంద్రా

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Suzuki Desert Storm 2018 Powered By ExxonMobil — Stage 1 Results
Story first published: Thursday, March 22, 2018, 15:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X