మోడిఫైడ్ యమహా ఆర్‌డి350 కఫే రేసర్: ఫోటోలు మరియు ఇతర వివరాలు

మోడిఫైడ్ కఫే రేసర్ యమహా ఆర్‌డి350 బైకు అంటే నమ్మలేకపోతున్నారు కదా... మీరే కాదు, మొదట్లో మేము కూడా నమ్మలేదు. 2-స్ట్రోక్ మోటార్ సైకిల్ అభిమానుల్ని ఎంతగానో ఆకర్షిస్తున్న మోడిఫైడ్ యమహా ఆర్‌డి350 కఫే రేసర్

By Anil Kumar

2-స్ట్రోక్ మోటార్ సైకిల్ ఔత్సాహికులు అత్యధికంగా అభిమానించే బైకు యమహా ఆర్‌డి350. యమహా ఆర్‌డి350 మోటార్ సైకిల్‌ను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టి రగిలించిన చిచ్చు అంతా ఇంత కాదు. మార్కెట్ నుండి శాస్వతంగా దూరమైన ఆర్‌డి350 అప్పుడు అప్పుడు ఇలా అద్భుతమైన మోడిఫికేషన్స్‌లో పట్టుబడుతోంది.

మోడిఫైడ్ యమహా ఆర్‌డి350 కఫే రైసర్

ఈ మోడిఫైడ్ కఫే రేసర్ యమహా ఆర్‌డి350 బైకు అంటే నమ్మలేకపోతున్నారు కదా... మీరే కాదు, మొదట్లో మేము కూడా నమ్మలేదు. 2-స్ట్రోక్ మోటార్ సైకిల్ అభిమానుల్ని ఎంతగానో ఆకర్షిస్తున్న మోడిఫైడ్ యమహా ఆర్‌డి350 కఫే రేసర్ గురించి మరిన్ని వివరాలు మరియు ఫోటోలు...

మోడిఫైడ్ యమహా ఆర్‌డి350 కఫే రైసర్

తయారీదారులను సైతం అసూయపడేలా ఉన్న ఈ యమహా ఆర్‌డి350 కఫే రేసర్ బైకును డెహ్రాడూన్‌కు చెందిన మోటో ఎక్సోటిక్ మోడిఫికేషన్ బృందం ఇలా తీర్చిద్దింది. చాలా పాత మోడల్‌ను ఎంచుకున్న అత్యంత అరుదైన విడి భాగాలతో మోడఫికేషన్స్ నిర్వహించినట్లు మోటో ఎక్సోటిక్ బృందం చెప్పుకొచ్చింది.

మోడిఫైడ్ యమహా ఆర్‌డి350 కఫే రైసర్

నిజానికి, సెకండ్ హ్యాండ్ బైకుల మార్కెట్లో యమహా ఆర్‌జి350 బైకులు లభించడం చాలా కష్టం. 1983 కాలంలో అత్యంత అరుదైన టెక్నాలజీ మార్కెట్లోకి ప్రవేశించిన ఆర్‌డి350 తీవ్ర అలజడి సృష్టించింది.

మోడిఫైడ్ యమహా ఆర్‌డి350 కఫే రైసర్

మోటో ఎక్సోటిక్ సభ్యులు ధృడమైన ఛాసిస్, నూతన స్వింగ్ఆర్మ్ మీద చేతితో తయారు చేసిన ఫ్యూయల్ ట్యాంక్ మరియు పొడవాటి సీటుతో ఆర్‌డి350 బైకును పూర్తి స్థాయిలో కొత్తగా మార్చేశారు. మోడిఫైడ్ కఫే రేసర్‌లో సిఎన్‌సి మెషినింగ్ చేయబడిన ట్రిపుల్ క్లాంప్ మరియు బాటమ్ కనెక్టర్ గల హ్యాండిల్ ఉంది.

మోడిఫైడ్ యమహా ఆర్‌డి350 కఫే రైసర్

మోడిఫైడ్ యమహా ఆర్‌డి350 కఫే రేసర్‌లో ముందు వైపున చిన్న పరిమాణంలో గుండ్రంగా ఉన్న హెడ్ ల్యాంప్ మరియు సింగల్ పోడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. సస్పెన్షన్ పరంగా ముందు వైపున అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున అడ్జస్టబుల్ మోనోషాక్ అబ్జార్వర్ ఉంది.

మోడిఫైడ్ యమహా ఆర్‌డి350 కఫే రైసర్

బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు చక్రానికి 4-పిస్టన్ కాలిపర్ గల పెద్ద డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున ఉన్న డ్రమ్ బ్రేక్ స్థానంలో డిస్క్ బ్రేక్ అందివ్వడం జరిగింది. ఇరువైపులా 18-అంగుళాల వైర్-స్పోక్ వీల్స్ మరియు కస్టమ్-మేడ్ స్ప్రాకెట్లను అందివ్వడం జరిగింది. ఇందులో ఆశ్చర్యకరంగా ఆఫ్-రోడ్ బటన్ టైర్లను అందించారు.

మోడిఫైడ్ యమహా ఆర్‌డి350 కఫే రైసర్

మోడిఫైడ్ యమహా ఆర్‌డి350 కఫే రేసర్ బైకులో మెకానికల్ పరంగా జరిగిన మార్పులు గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే, అసలైన యమహా ఆర్‌డి350 బైకులో 347సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే 2-స్ట్రోక్ ప్యార్లల్ ట్విన్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 30.5బిహెచ్‌పి పవర్ మరియు 32.3ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మోడిఫైడ్ యమహా ఆర్‌డి350 కఫే రైసర్

చరిత్రను తిరగేస్తే... యమహా ఆర్‌డి350 బైకులను 1983 నుండి 1989 వరకు ఇండియాలో తయారు చేసింది. అప్పట్లో ఇది హెచ్‌టి(హై టార్క్) మరియు ఎల్‌టి(లో టార్క్) అనే రెండు వెర్షన్‌లలో లభ్యమయ్యేది. అధిక మెయింటనెన్స్ మరియు తక్కువ మైలేజ్ కారణంగా ఎక్కువ మంది ఎంచుకునే వారు కాదు. కానీ,ఇప్పుడు దీనికున్న డిమాండే వేరు.

మోడిఫైడ్ యమహా ఆర్‌డి350 కఫే రేసర్ గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్సు ద్వారా మాతో పంచుకోండి....

Source: Motoexotica India

Most Read Articles

English summary
Read In Telugu: Modified Yamaha RD350 café racer by Moto Exotica
Story first published: Sunday, July 29, 2018, 11:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X