డ్యూయెట్ 125 ఐ3ఎస్ స్కూటర్‌తో మరో సంచలనానికి సిద్దమైన హీరో

హీరో మోటోకార్ప్ 125సీసీ స్కూటర్ల సెగ్మెంట్లో సరికొత్త డ్యూయట్ 125 స్కూటర్‌ను ప్రవేశపెట్టేందుకు కసరత్తులు ప్రారంభించింది. అందులో భాగంగానే డ్యూయట్ 125 స్కూటర్ విడుదలను ఖాయం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ

By Anil Kumar

దేశీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 125సీసీ స్కూటర్ల సెగ్మెంట్లో సరికొత్త డ్యూయట్ 125 స్కూటర్‌ను ప్రవేశపెట్టేందుకు కసరత్తులు ప్రారంభించింది. అందులో భాగంగానే డ్యూయట్ 125 స్కూటర్ విడుదలను ఖాయం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ టీజర్‌ రివీల్ చేసింది.

హీరో డ్యూయెట్ 125 ఐ3ఎస్ స్కూటర్ సిద్దం చేసిన హీరో మోటోకార్ప్

ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో మాయెస్ట్రో 125 స్కూటర్‌తో పాటు డ్యూయట్ 125 స్కూటర్ ప్రజా సందర్శనకు వచ్చింది. డిజైన్ పరంగా డ్యూయెట్ 125 మోడల్ 110సీసీ మోడల్‌నే పోలి ఉంటుంది. ఇందులో బాడీ మీద పలు క్రోమ్ ఎలిమెంట్స్ వచ్చాయి.

హీరో డ్యూయెట్ 125 ఐ3ఎస్ స్కూటర్ సిద్దం చేసిన హీరో మోటోకార్ప్

సరికొత్త హీరో డ్యూయెట్ 125 స్కూటర్‌లో అనలాగ్ స్పీడో మీటర్ ఉంది, దీని ప్రక్కనే ఓడో మీటర్, ఫ్యూయల్ లెవల్, ట్రిప్ మీటర్ మరియు సర్వీస్ ఇండికేటర్ వివరాలును చూపించే ఓ చిన్న డిస్ల్పే ఉంది.

హీరో డ్యూయెట్ 125 ఐ3ఎస్ స్కూటర్ సిద్దం చేసిన హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ డ్యూయెట్ 125 స్కూటర్‌ను ప్రత్యేకించి యువతను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసింది. అంతే కాకుండా ఇది, డ్యూయెట్ 110 యొక్క పవర్‌ఫువ్ వెర్షన్ కూడా. 113కిలోలు బరువున్న ఈ స్కూటర్ గరిష్టంగా 130కిలోల బరువును మోయగలుగుతుంది.

హీరో డ్యూయెట్ 125 ఐ3ఎస్ స్కూటర్ సిద్దం చేసిన హీరో మోటోకార్ప్

దేశీయ 125సీసీ స్కూటర్ల విభాగంలో పరిచయం చేయనున్న డ్యూయెట్ 125 స్కూటర్‌లో 124.6సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. సీవీటీ ట్రాన్స్‌మిషన్ గల ఇంజన్ 8.7బిహెచ్‌పి పవర్ మరియు 10.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హీరో డ్యూయెట్ 125 ఐ3ఎస్ స్కూటర్ సిద్దం చేసిన హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ ఇప్పటి వరకు బైకుల్లో మాత్రమే పరిచయం చేసిన ఐ3ఎస్ టెక్నాలజీని ఇప్పుడు డ్యూయెట్ 125 స్కూటర్‌లో పరిచయం చేసింది. స్కూటర్ ఇంజన్ ఐడిల్‌లో లేదా ఎక్కువ సమయం పాటు ఆన్‌లో ఉన్నపుడు ఇంజన్‌ను ఆటోమేటిక్‌గా ఆఫ్ చేస్తుంది. అయితే, ముందుకెళ్లాలి అనుకున్నపుడు యాక్సిలరేషన్ రైజ్ చేస్తే ఇంజన్ దానంతట అదే ఆన్ అవుతుంది.

హీరో డ్యూయెట్ 125 ఐ3ఎస్ స్కూటర్ సిద్దం చేసిన హీరో మోటోకార్ప్

ఐ3ఎస్ - స్టార్ట్-స్టాప్-సిస్టమ్ ట్రాఫిక్ సిగ్నల్స్‌లో ఇంధనాన్ని ఆదా చేస్తుంది. దీంతో అధిక మైలేజ్ సాధ్యమవుతుంది. ఈ ఇంధన ఆదా టెక్నాలజీ ఇప్పటి వరకు మరే స్కూటర్‌లో కూడా రాలేదు. ప్రత్యేకించి దీని పోటీదారుల్లో ఈ ఫీచర్‌ లేదు.

హీరో డ్యూయెట్ 125 ఐ3ఎస్ స్కూటర్ సిద్దం చేసిన హీరో మోటోకార్ప్

హీరో డ్యూయెట్ 125 పొడవు 1,830ఎమ్ఎమ్, వెడల్పు 726ఎమ్ఎమ్, ఎత్తు 1,155ఎమ్ఎమ్ మరియు వీల్ బేస్ 1,245ఎమ్ఎమ్ అదే విధంగా మెరుగైన 155ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. డ్యూయెట్ 125 స్కూటర్‌లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున సింగల్ కాయిల్ స్ప్రింగ్-టైప్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్ ఉన్నాయి.

హీరో డ్యూయెట్ 125 ఐ3ఎస్ స్కూటర్ సిద్దం చేసిన హీరో మోటోకార్ప్

బ్రేకింగ్ విధులు నిర్వర్తించడానికి, ముందు మరియు వెనుక చక్రాలకు 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. మెరుగైన బ్రేకింగ్ మరియు పరిష్టమైన రైడింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు 90/100-10 కొలతల్లో ఉన్న ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి.

హీరో డ్యూయెట్ 125 ఐ3ఎస్ స్కూటర్ సిద్దం చేసిన హీరో మోటోకార్ప్

హీరో డ్యూయెట్ 125 స్కూటర్‌లో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, బయటి వైపునున్న ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్, లైటింగ్ గల అండర్ సీట్ స్టోరేజ్, బాడీ కలర్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ అంతే కాకుండా మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హీరో డ్యూయెట్ 125 రూ. 58,000 ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

హీరో డ్యూయెట్ 125 ఐ3ఎస్ స్కూటర్ సిద్దం చేసిన హీరో మోటోకార్ప్

హీరో డ్యూయెట్ 125 పర్ఫామెన్స్ స్కూటర్ పూర్తి స్థాయిలో మార్కెట్లోకి లాంచ్ అయితే, విపణిలో ఉన్న టీవీఎస్ ఎన్‌టార్క్ 125, సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125, సుజుకి యాక్సెస్ 125 మరియు అప్రిలియా ఎస్ఆర్ 125 స్కూటర్లకు గట్టి పోటీనిస్తుంది.

హీరో డ్యూయెట్ 125 ఐ3ఎస్ స్కూటర్ సిద్దం చేసిన హీరో మోటోకార్ప్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కమ్యూటర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్ లీడర్‌గా రాణిస్తున్న హీరో మోటోకార్ప్ ఇప్పటి వరకు స్కూటర్ల విభాగంలో ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే, తన వద్ద ఇది వరకే ఉన్న డ్యూయెట్ 110 స్కూటర్‌కు కొనసాగింపుగా ఇప్పుడు డ్యూయెట్ 125 మోడల్‌ను ప్రవేశపెట్టడానికి సిద్దమైంది. యువ కొనుగోలుదారులు మరియు మైలేజ్ ప్రియులను లక్ష్యంగా వస్తోన్న హీరో డ్యూయెట్ 125 ఐ3స్ ఎలాంటి సక్సెస్ సాధిస్తోంది చూడాలి మరి.

Most Read Articles

English summary
Read In Telugu: New Hero Duet 125 teased — Launching Soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X