Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరో నుండి సరికొత్త హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్
భారతదేశపు అతి పెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీ దిగ్గజం హీరో ఎలక్ట్రిక్ విపణిలోకి సరికొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. హీరో ఎలక్ట్రిక్ నుండి వస్తున్న ఈ నూతన మోడల్ పర్ఫామెన్స్ మరియు రేంజ్ రెండింటిని లక్ష్యంగా చేసుకొని రానుంది.
ఎలక్ట్రిక్ స్కూటర్లు నిజానికి ఆశించినంత పవర్ ఇవ్వలేవు, అంతే కాకుండా వీటి టాప్ స్పీడ్ కూడా 50 కిలోమీటర్లకు లోపే ఉంటుంది. దీంతో చాలా మంది కస్టమర్లు పెట్రోల్ టూ వీలర్లను ఆశ్రయిస్తుంటారు.

ఈ నేపథ్యంలో హీరో ఎలక్ట్రిక్ AXHLE-20 అనే కోడ్ పేరుతో ఓ హై స్పీడ్ స్కూటర్‌ను పరిచయం చేయడానికి సిద్దమైంది. ఈ స్కూటర్ హీరో లైనప్‌లో టాప్ బ్రాండ్‌గా నిలవనుంది. అంతే కాకుండా హై స్పీడ్ సిరీస్ అనే సెగ్మెంటుకు చెందిన స్కూటర్‌గా మార్కెట్లోకి రానుంది.

ప్రస్తుతం హీరో హై స్పీడ్ సిరీస్‌లో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. అవి, నిక్స్, ఫోటాన్ మరియు ఫోటాన్ 72వి. ఈ శ్రేణిలోకి వస్తున్న AXHLE-20 స్కూటర్ టాప్ ఎండ్ మోడల్‌గా మరియు అత్యంత ఖరీదైన స్కూటర్‌గా నిలవనుంది.

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, AXHLE-20 స్కూటర్లో 8బిహెచ్పి పవర్ ప్రొడ్యూస్ చేసే 4కిలోవాట్ మోటార్ ఉంది, దీంతో గంటకు 85కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు మరియు ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్టంగా 110కిలోమీటర్లు నడుస్తుంది. మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోల్చుకుంటే మంచి ఫలితాలని చెప్పవచ్చు.

హీరో AXHLE-20 ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్లూటూత్ ద్వారా మొబైల్ కనెక్టివిటీ ఫీచర్ ఉంది. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఇంస్ట్రుమెంట్ కన్సోల్ స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్‌ను సపోర్ట్ చేస్తుంది.

హీరో తమ AXHLE-20 స్కూటర్‌ను ఈ ఏడాది ప్రారంభంలో ఆవిష్కరించింది. ఈ స్కూటర్లో రీజనరేటివ్ బ్రేకింగ్ ఫీచర్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరియు నాలుగు గంటల్లోపే బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ల పరిశోధన మరియు అభివృద్ది కోసం హీరో ఎలక్ట్రిక్ భారీ ఎత్తున పెట్టుబడి పెట్టింది. అంటే, అతి త్వరలో అనేక రకాల ఉద్గార రహిత టూ వీలర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హీరో ఎలక్ట్రిక్ భారీ ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తోంది.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆశించిన డిమాండ్ లభించకపోవడంతో కంపెనీలు కూడా ఓ మోస్తారు పర్ఫామెన్స్ మరియు రేంజ్ ఉన్న స్కూటర్లను మాత్రమే విక్రయించేవి. అయితే, ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగం పుంజుకోవడంతో సిగంల్ ఛార్జింగ్‌తో ఎక్కువ దూరం ప్రయాణించే, మరియు అత్యధిక వేగంతో దూసుకెళ్లే స్కూటర్లకు డిమాండ్ ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో హీరో ఎలక్ట్రిక్ అత్యుత్తమ సాంకేతిక అంశాలతో పెట్రోల్ స్కూటర్లకు ధీటైన పనితీరుతో AXHLE-20 స్కూటర్‌ను సిద్దం చేస్తోంది.
Source: BikeWale