2018 హీరో హెచ్ఎఫ్ డాన్ బైక్ లాంచ్: ధర రూ. 37,400 లు

భారతదేశపు అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ మార్కెట్లోకి 2018 హెచ్ఎఫ్ డాన్ కమ్యూటర్ మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. సరికొత్త 2018 హీరో హెచ్ఎఫ్ డాన్ బైక్ ప్రారంభ ధర రూ. 37,400 లు

By Anil

Recommended Video

Under-Aged Rider Begs The Policewomen To Spare Him - DriveSpark

భారతదేశపు అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ మార్కెట్లోకి 2018 హెచ్ఎఫ్ డాన్ కమ్యూటర్ మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. సరికొత్త 2018 హీరో హెచ్ఎఫ్ డాన్ బైక్ ప్రారంభ ధర రూ. 37,400 లు ఎక్స్-షోరూమ్(ఒడిసా)గా ఉంది.

హీరో హెచ్ఎఫ్ డాన్

ప్రస్తుతం, 2018 హీరో హెచ్ఎఫ్ డాన్ కేవలం ఒడిసాలో మాత్రమే లభ్యమవుతోంది. వివిధ రాష్ట్రాల్లో విడతల వారీగా దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

హీరో హెచ్ఎఫ్ డాన్

బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ లేదనే కారణంతో హీరో తమ హెచ్ఎఫ్ డాన్ బైకును మే 2017 లో మార్కెట్ నుండి తొలగించింది. తాజాగా విడుదల చేసిన హెచ్ఎఫ్ డాన్ బైకులో బిఎస్-IV ఇంజన్‌తో పాటు బాడీ మీద కొన్ని కాస్మొటిక్ అప్‌డేట్స్ కూడా నిర్వహించింది.

హీరో హెచ్ఎఫ్ డాన్

హీరో హెచ్ఎఫ్ డాన్ రెండు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంది. అవి, రెడ్ మరియు బ్లాక్. ఈ కొత్త తరం హెచ్ఎఫ్ డాన్ బైకులో బ్లాక్ పెయింట్ స్కీమ్‌లో ఉన్న ఇంజన్, టెయిల్ సెక్షన్, హెడ్‌లైట్ బెజెల్, షాక్ అబ్జార్వర్ మరియు రిమ్ములు ఉన్నాయి.

హీరో హెచ్ఎఫ్ డాన్

ఫ్రంట్ సస్పెన్షన్‌లోని అప్పర్ ట్యూబ్స్ బాడీ కలర్‌లో మరియు లోయర్ ట్యూబ్స్ బ్లాక్ కలర్‌లో ఉన్నాయి. ఈ కాంబినేషన్ బైకు మొత్తానికి మరింత ఆకర్షణీయమైన లుక్ తీసుకొచ్చింది. సిల్వర్ లేదా క్రోమ్ బాడీ పార్ట్స్ అన్నింటిని బ్లాక్ కలర్‌లో అందించింది. అందులో బ్రేక్ డ్రమ్, ఎగ్జాస్ట్ పైప్, లెగ్ గార్డ్స్ మరియు ఇతరత్రా విడి భాగాలు.

హీరో హెచ్ఎఫ్ డాన్

సరికొత్త 2018 హెచ్ఎఫ్ డాన్ బైకులో సాంకేతికంగా 97.2సీసీ సామర్థ్యం ఉన్న గాలితో చల్లబడే బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 8.2బిహెచ్‌పి పవర్ మరియు 8.05ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Trending On DriveSpark Telugu:

మహీంద్రా నుండి మోజో యుటి300 బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం గురించి ఆసక్తికరమైన నిజాలు

గాల్లోకి ఎగిరి రెండు అంతస్థుల మేడ మీదకు దూసుకెళ్లిన కారు

హీరో హెచ్ఎఫ్ డాన్

హీరో హెచ్ఎఫ్ డాన్ బైకులో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున డ్యూయల్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ వీల్‌కు 130ఎమ్ఎమ్ చుట్టుకొలత గల డ్రమ్ మరియు రియర్ వీల్‌కు 110ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్‌ ఉంది.

హీరో హెచ్ఎఫ్ డాన్

105కిలోల బరువున్న హీరో హెచ్ఎఫ్ డాన్ బైకులో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 9.5-లీటర్లుగా ఉంది. హీరో మోటోకార్ప్ ఇటీవలె ప్యాసన్ ప్రొ, ప్యాసన్ ఎక్స్‌పో మరియు సూపర్ స్ల్పెండర్ కమ్యూటర్ మోటార్ సైకిళ్లను అప్‌డేటెడ్ వెర్షన్‌లో ఆవిష్కరించింది.

హీరో హెచ్ఎఫ్ డాన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హీరో మోటోకార్ప్ తమ ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్ సైకిల్ హెచ్ఎఫ్ డాన్‌ బైకును పూర్తి స్థాయిలో అప్‌డేట్స్ నిర్వహించి, ఒక కొత్త ఉత్తేజంతో లాంచ్ చేసింది. 100సీసీ బైకుల సెగ్మెంట్లో హెచ్ఎఫ్ డాన్ ఎంపిక అత్యుత్తమం. ఇది విపణిలో ఉన్న బజాజ్ సిటి100 మరియు టీవీఎస్ స్పోర్ట్స్ బైకులకు పోటీనివ్వనుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Hero HF Dawn Launched In India; Priced At Rs 37,400
Story first published: Thursday, January 18, 2018, 10:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X