Just In
- 12 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 15 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 16 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 17 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..
- Movies
చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్: వాళ్లందరిపై ఆధిపత్యం చూపిస్తూ.. ఊహించని రికార్డు సొంతం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నూతన మార్పులతో విడుదలైన 2018 హోండా యాక్టివా 125
హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి సరికొత్త 2018 హోండా యాక్టివా స్కూటర్‌ను లాంచ్ చేసింది. పలు నూతన ఫీచర్ల జోడింపుతో విడుదలైన 2018 ఎడిషన్ హోండా యాక్టివా 125 ప్రారంభ ధర రూ. 59,621 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

సరికొత్త 2018 హోండా యాక్టివా 125 స్కూటర్‌లో నూతన ఎల్ఇడి హెడ్‌ల్యాంప్‌తో పాటు పలు ఫీచర్లు పరిచయం అయ్యాయి. 2018 హోండా యాక్టివా 125 మూడు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది.

2018 హోండా యాక్టివా 125 వేరియంట్లు మరియు ధరలు
- యాక్టివా 125 డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 59,621 లు
- యాక్టివా 125 డ్రమ్ అండ్ అల్లాయ్ వీల్ వేరియంట్ ధర రూ. 61,558 లు
- యాక్టివా 125 డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 64,007 లు.

సరికొత్త హోండా యాక్టివా 125 స్కూటర్‌లో యాక్టివా 5జీ తరహా ఎల్ఇడి హెడ్‌లైట్, రీడిజైన్ చేయబడిన ఇకో మోడ్ మరియు సర్వీస్ ఇండికేటర్ గల డిజిటల్-అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, సీట్ ఓపెనింగ్ స్విచ్‌తో పాటు ఫోర్-ఇన్-వన్ లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

యాక్టివా 125 స్కూటర్‌లో పలు కాస్మొటిక్ మార్పులతో పాటు టాప్ ఎండ్ వేరియంట్లో క్రోమ్ మఫ్లర్ మరియు మిడ్ వేరియంట్లో గ్రే అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. యాక్టివా 125 రెండు సరికొత్త మ్యాట్ కలర్ స్కీమ్‌లో లభ్యమవుతోంది. అవి, మ్యాట్ క్రస్ట్ మెటాలిక్ మరియు మ్యాట్ సెలీన్ సిల్వర్. మొబైల్ ఛార్జింగ్ ఫీచర్‌న ఆప్షనల్‌గా అందివ్వడం జరిగింది.

సాంకేతికంగా సరికొత్త హోండా యాక్టివా 125 స్కూటర్‌లో 124.9సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 8.52బిహెచ్‌పి పవర్ మరియు 10.54ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 హోండా యాక్టివా 125 స్కూటర్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున 3-స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ అబ్జార్వర్ ఉన్నాయి. యాక్టివా 125 స్కూటర్‌లో మెటల్ బాడీ ప్యానళ్లు వచ్చాయి.

యాక్టివా 125 బేస్ మరియు మిడ్ వేరియంట్లలో రెండు చక్రాలకు 130ఎమ్ఎమ్ కొలతల్లో ఉన్న డ్రమ్ బ్రేకులు వచ్చాయి. అయితే, టాప్ ఎండ్ వేరియంట్లో ముందు వైపున 190ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ఉంది. అన్ని వేరియంట్లలో కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను తప్పనిసరిగా అందించారు. మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే స్కూటర్ ఓవరాల్ డిజైన్ చాలా కొత్తగా ఉంది.

డ్రైవ్‍స్పార్క్ తెలుగు అభిప్రాయం!
సరికొత్త 2018 హోండా యాక్టివా 125 స్కూటర్ పలు నూతన ఫీచర్లతో పాటు మరెన్నో కాస్మొటిక్ అప్‌డేట్స్‌తో వచ్చాయి. అంతే కాకుండా యాక్టివా 4జీ స్కూటర్‌కు కొనసాగింపుగా ఈ ఏడాది ప్రారంభంలో యాక్టివా 5జీ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. సరికొత్త యాక్టివా 125 విపణిలో ఉన్న మోస్ట్ పాపులర్ సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌కు గట్టి పోటీనిస్తుంది.