2018 హోండా యాక్టివా-ఐ స్కూటర్ విడుదల
హోండా మోటర్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా(HMSI) విపణిలోకి సరికొత్త 2018 హోండా యాక్టివా-ఐ స్కూటర్‌ను విడుదల చేసింది. నూతన 2018 హోండా యాక్టివా-ఐ స్కూటర్ ప్రారంభ ధర రూ. 50,010 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా
హోండా మోటర్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా(HMSI) విపణిలోకి సరికొత్త 2018 హోండా యాక్టివా-ఐ స్కూటర్‌ను విడుదల చేసింది. నూతన 2018 హోండా యాక్టివా-ఐ స్కూటర్ ప్రారంభ ధర రూ. 50,010 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

పలు కాస్మొటిక్ అప్‌డేట్స్ మరియు అదనపు ఫీచర్లతో యాక్టివా-ఐ స్కూటర్‌ను 2018 ఎడిషన్‌లో లాంచ్ చేశారు. సాధారణం యాక్టివా స్కూటర్‌తో పోల్చుకుంటే యాక్టివా-ఐ చాలా సన్నగా ఉంటుంది. మహిళలు మరియు యువ రైడర్లు సులభంగా నడిపేందుకు తక్కువ బరువుతో తయారు చేశారు.

కొత్తగా విడుదలైన 2018 హోండా యాక్టివా-ఐ స్కూటర్ ఐదు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. అవి, క్యాండీ జాజి బ్లూ, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, లష్ మ్యాగెంటా మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ మరియు ఆర్చిడ్ పర్పుల్ మెటాలిక్.

హోండా యాక్టివా-ఐ న్యూ వెర్షన్ పలు అదనపు ఫీచర్లతో వచ్చంది. ప్రత్యేకించి, డ్యూయల్ టోన్ కలర్స్ మరియు బాడీ గ్రాఫిక్స్, మెటాలిక్ మఫ్లర్ ప్రొటెక్టర్, సీట్ ఓపెనింగ్ గల ఫోర్-ఇన్-వన్ లాక్ మరియు ముందు వైపున హుక్ కలదు.

2018 హోండా యాక్టివా-ఐ స్కూటర్‌లో అదనంగా బాడీ కలర్ మిర్రర్స్, డైనమిక్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, మొబైల్ ఛార్జింగ్ మరియు 18-లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా హోండా టూ వీలర్స్ యాక్టివా-ఐ కోసం విసృత శ్రేణి యాక్ససరీలను కూడా అందిస్తోంది.

సాంకేతికంగా 2018 హోండా యాక్టివా-ఐ స్కూటర్ అదే మునుపటి 109.19సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే 4-స్ట్రోక్ సింగల్ సిలిడంర్ పెట్రోల్ ఇంజన్ కలదు. సీవీటీ ట్రాన్స్‌మిషన్ గల ఇది గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 8.94ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా యాక్టివా-ఐ స్కూటర్లో ఇరువైపులా 10-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి. బ్రేకింగ్ విధులు నిర్వర్తించడానికి రెండు చక్రాలకు 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్ మరియు మెరుగైన బ్రేకింగ్ కోసం కాంబి బ్రేకింగ్ టెక్నాలజీ జోడించారు. ఇరువైపులా స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అందివ్వడం జరిగింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
హోండా టూ వీలర్స్ మహిళా రైడర్లు, కాలేజీ యువతకు అత్యంత వీలుగా ఉండేందుకు తేలికపాటి బరువుతో యాక్టివా-ఐ స్కూటర్‌ను పరిచయం చేసింది. పలు అప్‌డేట్స్‌తో రీలాంచ్ అయిన 2018 హోండా యాక్టివా-ఐ విపణిలో ఉన్న టీవీఎస్ స్కూటీ జెస్ట్, హీరో ప్లెజర్, సుజుకి లెట్స్ మరియు యమహా రే జడ్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.


Click it and Unblock the Notifications








