2018 హోండా ఆఫ్రికా ట్విన్ మీద ప్రారంభమైన బుకింగ్స్: ధర రూ. 13.23 లక్షలు

హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా తమ సరికొత్త 2018 హోండా ఆఫ్రికా ట్విన్ బైకు మీద అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింది. ఆఫ్రికా ట్విన్ బైకును కేవలం పరిమితి సంఖ్యలో మాత్రమే విక్రయించనుంది. దాం

By Anil Kumar

హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా తమ సరికొత్త 2018 హోండా ఆఫ్రికా ట్విన్ బైకు మీద అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింది. ఆఫ్రికా ట్విన్ బైకును కేవలం పరిమితి సంఖ్యలో మాత్రమే విక్రయించనుంది. దాంతో తొలి 50 మంది కస్టమర్లకు మాత్రమే బుకింగ్స్ ఆహ్వానిస్తోంది.

2018 హోండా ఆఫ్రికా ట్విన్ బుకింగ్స్ ప్రారంభం

అప్‌డేటెడ్ వెర్షన్ 2018 హోండా ఆఫ్రికా ట్విన్ ధర రూ. 13.23 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 22 "హోండా వింగ్ వరల్డ్" విక్రయ కేంద్రాలలో ఏదేని షోరూమ్‌లో ఆఫ్రికా ట్విన్ బైకును బుక్ చేసుకోవచ్చు. కొంత మంది లక్కీ కస్టమర్లు మోటోజీపీ రేస్‌ను లైవ్‌ చూసే ఛాన్స్ కూడా పొందుతారు.

2018 హోండా ఆఫ్రికా ట్విన్ బుకింగ్స్ ప్రారంభం

హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా సేల్స్ మరియు మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యడ్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ, "ఎంతగానో ఎదురుచూస్తున్న 2018 ఆఫ్రికా ట్విన్ ఇండియాలో ఉన్న అడ్వెంచర్ ప్రియుల కోసం మార్కెట్లో సిద్దంగా ఉంది. పలు నూతన అప్‌డేట్స్ మరియు అదనపు విలువలతో ఆఫ్రికా ట్విన్ అందిస్తున్నట్లు తెలిపాడు."

2018 హోండా ఆఫ్రికా ట్విన్ బుకింగ్స్ ప్రారంభం

2018 హోండా ఆఫ్రికా ట్విన్ బైకులో పలు చిన్న చిన్న అప్‌డేట్స్ నిర్వహించింది. హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ బైకులో సరికొత్త లిథియం-అయాన్ బ్యాటరీ అందించింది. ఈ బ్యాటరీ బైకు మొత్తం బరువును 2.3 కిలోల వరకు తగ్గించింది.

2018 హోండా ఆఫ్రికా ట్విన్ బుకింగ్స్ ప్రారంభం

సరికొత్త 2018 హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ బైకులో బ్రాండ్ న్యూ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఇడి గల హెడ్‌ల్యాంప్ల్, టెయిల్ లైట్లు మరియు టర్న్ ఇండికేటర్లు అదే విధంగా థ్రోటిల్-బై-వైర్ ఫీచర్లు ఉన్నాయి.

2018 హోండా ఆఫ్రికా ట్విన్ బుకింగ్స్ ప్రారంభం

ఈ అడ్వెంచర్ బైకులో ఉన్న ఇతర ఫీచర్లలో నాలుగు విభిన్న రైడింగ్ మోడ్స్, ఏడు దశల ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హోండా వారి సెలక్టబుల్ టార్క్ కంట్రోల్ సిస్టమ్, విభిన్న ఇంక్లైన్ డిటెక్షన్ సిస్టమ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఆఫ్ రోడింగ్‌లో ఉన్నపుడు అన్ని రకాల రైడింగ్ మోడ్‌లలో ట్రాక్షన్ ఇంప్రూవ్ చేసే జి-స్విచ్ పరికరం కలదు.

2018 హోండా ఆఫ్రికా ట్విన్ బుకింగ్స్ ప్రారంభం

సాంకేతింగా 2018 హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ బైకులో అదే మునుపటి 998సీసీ కెపాసిటి గల ప్యార్లల్ ట్విన్ ఇంజన్ కలదు. డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 87బిహెచ్‌పి పవర్ మరియు 92ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 హోండా ఆఫ్రికా ట్విన్ బుకింగ్స్ ప్రారంభం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా ఆఫ్రికా ట్విన్ బైకును ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిర్మించిన యూనిట్లుగా దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. కేవలం తొలి 50 మంది కస్టమర్లకు మాత్రమే హోండా మోటార్స్ అందుబాటులో ఉంచుతోంది. మరియు ఇది జిపి రెడ్ కలర్ స్కీములో మాత్రమే లభిస్తోంది.

అప్‌డేటెడ్ హోండా ఆఫ్రికా ట్విన్ మోటార్‌సైకిల్ విపణిలో ఉన్న ట్రయంప్ టైగర్, డుకాటి మల్టీస్ట్రాడా 950 మరియు బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200జిఎస్ మోటార్‌సైకిళ్లకు గట్టిపోటీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 7, 2018, 10:29 [IST]
English summary
Read In Telugu: 2018 Honda Africa Twin Bookings Open — Priced At Rs 13.23 Lakh
Read more on: #hyundai #హోండా
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+