హోండా సిబి హార్నెట్ 160ఆర్ ఏబిఎస్ విడుదల: ధర రూ. 84,675 లు

జపాన్ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి 2018 హోండా సిబి హార్నెట్ 160ఆర్ బైకును లాంచ్ చేసింది. సరికొత్త 2018 హోండా సిబి హార్నెట్ ప్రారంభ ధర

By Anil Kumar

జపాన్ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి 2018 హోండా సిబి హార్నెట్ 160ఆర్ బైకును లాంచ్ చేసింది. సరికొత్త 2018 హోండా సిబి హార్నెట్ ప్రారంభ ధర రూ. 84,675 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. కొత్త తరం హార్నెట్ బైకులో ఇప్పుడు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ కూడా వచ్చింది.

హోండా సిబి హార్నెట్ 160ఆర్

2018 తరానికి చెందిన హోండా సిబి హార్నెట్ 160ఆర్ మోటార్‌సైకిల్‌ను తొలుత ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించింది. 160సీసీ ఇంజన్ సెగ్మెంట్లో ఏబిఎస్ వచ్చిన తొలి హోండా మోటార్‌సైకిల్ ఇదే. ఇందులో సింగల్-ఛానల్ ఏబిఎస్ కలదు.

హోండా సిబి హార్నెట్ 160ఆర్

2018 హోండా సిబి హార్నెట్ 160ఆర్ లభించే వేరియంట్లు మరియు వాటి ధరలు

ఏబిఎస్ జోడింపుతో వచ్చిన 2018 హోండా సిబి హార్నెట్ 160ఆర్ బైకు నాలుగు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ గల ఎస్‌‌టిడి, రియర్ డిస్క్ బ్రేక్ గల సిబిఎస్, ఏబిఎస్ ఎస్‌టిడి మరియు ఏబిఎస్ డిఎల్ఎక్స్ వేరియంట్లు. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి.

Variant Price
STD Rs 84.675
CBS Rs 89,175
ABS STD Rs 90,175
ABS DLX Rs 92,675
హోండా సిబి హార్నెట్ 160ఆర్

2018 హోండా సిబి హార్నెట్ 160ఆర్ స్పెసిఫికేషన్స్

సాంకేతికంగా 2018 హోండా సిబి హార్నెట్ 160ఆర్ బైకులో 162.71సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 14.9బిహెచ్‌పి పవర్ మరియు 14.5ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Recommended Video

హోండా ఎక్స్-బ్లేడ్ 160సీసీ బైక్ రివీల్ | Honda X-Blade - Details & Full Specifications - DriveSpark
హోండా సిబి హార్నెట్ 160ఆర్

2018 హోండా సిబి హార్నెట్ 160ఆర్ డిజైన్ మరియు ఫీచర్లు

కొత్త తరం సిబి హార్నెట్ 160ఆర్ డిజైన్ పరంగా అచ్చం మునుపటి వెర్షన్‌నే పోలి ఉంది. కానీ 2018 మోడల్‌లో వచ్చిన ప్రధాన మార్పుల్లో ఎల్ఇడి హెడ్ ల్యాంప్. దీనితో పాటు, నూతన బాడీ కలర్స్ మరియు రీడిజైన్ చేయబడిన గ్రాఫిక్స్ ఉన్నాయి.

హోండా సిబి హార్నెట్ 160ఆర్

160సీసీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో ఎక్స్-బ్లేడ్ తరువాత ఎల్ఇడి హెడ్ ల్యాంప్ కలిగి ఉన్న రెండవ బైకు హోండా సిబి హార్నెట్ 160ఆర్. ఇతర ఫీచర్లయిన డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు X-ఆకారంలో ఉన్న ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ కలదు.

హోండా సిబి హార్నెట్ 160ఆర్

అంతే కాకుండా, 160సీసీ సెగ్మెంట్లో ఏబిఎస్ ఫీచర్‍‌తో వచ్చిన తొలి మోటార్‌సైకిల్ 2018 హోండా సిబి హార్నెట్ 160ఆర్. ఇందులో సింగల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ ఉంది. బ్రేకింగ్ విధుల కోసం ముందు వైపున 276ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకు మరియు వెనుక వైపు 220ఎమ్ఎమ్ డిస్క్ లేదా 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేకులు ఉన్నాయి.

హోండా సిబి హార్నెట్ 160ఆర్

2018 హోండా సిబి హార్నెట్ 160ఆర్ బైకును అదే మునుపటి డైమండ్ ఫ్రేమ్ ఆధారంగా నిర్మిస్తున్నారు. సస్పెన్షన్ కోసం ఇందులో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ ఉన్నాయి.

హోండా సిబి హార్నెట్ 160ఆర్

డ్రైవ్‍‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కొత్త తరం 2018 హోండా సిబి హార్నెట్ 160ఆర్ బైకు చూడటానికి అచ్చం మునుపటి మోడల్‌నే పోలి ఉంటుంది. అయితే, ఇందులో సెగ్మెంట్ ఫస్ట్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్ మరియు సింగల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు.

హోండా సిబి హార్నెట్ 160ఆర్

ఎంట్రీ లెవల్ పర్ఫామెన్స్ బైకుల సెగ్మెంట్లో హార్నెట్ 160ఆర్ సురక్షితమైన మరియు ధరకు తగ్గ విలువలతో కూడిన బైకు. ఇది విపణిలో ఉన్న కొత్తగా విడుదలైన టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి, సుజుకి జిక్సర్, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 మరియు యమహా ఎఫ్‌జడ్-ఎస్ ఎఫ్ఐ వేరియంట్లకు గట్టి పోటీనివ్వనుంది.

హోండా సిబి హార్నెట్ 160ఆర్

1. ఏబిఎస్ అంటే ఏమిటి ? ఎలా పని చేస్తుంది?

2.ఏ/సి వాడకం కారు మైలేజ్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?

3.కారు స్టార్ట్ కాకపోవడానికి గల మెయిన్ రీజన్స్

4.కారులో ఏ/సి ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే?

5.బ్రేక్ ప్యాడ్స్ మార్చకపోతే ఏమవుతుంది...?

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Honda CB Hornet 160R Launched In India; Prices Start At Rs 84,675
Story first published: Tuesday, March 27, 2018, 10:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X