2018 ఎడిషన్ సిబి షైన్ ఎస్‌పి, లివో మరియు డ్రీమ్ యుగా బైకులను లాంచ్ చేసిన హోండా

Written By:

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ తమ కమ్యూటర్ మోటార్ సైకిళ్లు - లివో, డ్రీమ్ యుగా మరియు సిబి షైన్ ఎస్‌పి బైకులను 2018 ఎడిషన్‌లో విపణిలోకి లాంచ్ చేసింది. నూతన డిజైన్ శైలి మరియు అత్యాధునిక టెక్నాలజీ జోడింపుతో హోండా ఈ మూడు బైకులను ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించింది.

Recommended Video - Watch Now!
2018 హోండా సిబిఆర్ 250ఆర్ రివీల్ | New Honda CBR 250 Details, Expected Launch & Price - DriveSpark
2018 ఎడిషన్ సిబి షైన్ ఎస్‌పి, లివో మరియు డ్రీమ్ యుగా బైకులు

2018 ఎడిషన్ హోండా సిబి షైన్ ఎస్‌పి ప్రారంభ ధర రూ. 62,032, 2018 హోండా లివో ప్రారంభ వేరియంట్ ధర రూ. 56,230 మరియు 2018 హోండా డ్రీమ్ యుగా ప్రారంభ ధర రూ. 52,741. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

2018 ఎడిషన్ సిబి షైన్ ఎస్‌పి, లివో మరియు డ్రీమ్ యుగా బైకులు

2018 ఎడిషన్ హోండా సిబి షైన్ ఎస్‌పి బైకులో అగ్రెసివ్ ఫ్యూయల్ ట్యాంక్ డీకాల్స్ గల న్యూ స్టైల్, స్పోర్టివ్ గ్రాఫిక్స్, సర్వీస్ ఇండికేటర్, గడియారం మరియు సీల్ చైన్ యొక్క లో మెయింటెనెన్స్ వివరాలు గల సరికొత్త డిజిటల్ అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

2018 ఎడిషన్ సిబి షైన్ ఎస్‌పి, లివో మరియు డ్రీమ్ యుగా బైకులు

సాంకేతికంగా 2018 హోండా సిబి షైన్ ఎస్‍‌పిలో అదే 124.73సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభ్యమయ్యే ఇది 10.16బిహెచ్‌పి పవర్ మరియు 10.30ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 ఎడిషన్ సిబి షైన్ ఎస్‌పి, లివో మరియు డ్రీమ్ యుగా బైకులు

2018 ఎడిషన్ హోండా సిబి షైన్ ఎస్‌పి ఐదు విభిన్న రంగుల్లో లభ్యమవుతుంది. అవి, పర్ల్ సిరెన్ బ్లూ, జెనీ గ్రే మెటాలిక్, బ్లాక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ మరియు ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ అదే విధంగా డ్రమ్, డిస్క్ మరియు సిబిఎస్ అనే మూడు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది.

2018 ఎడిషన్ సిబి షైన్ ఎస్‌పి, లివో మరియు డ్రీమ్ యుగా బైకులు

సరికొత్త 2018 ఎడిషన్ హోండా లివో కమ్యూటర్ మోటార్ సైకిల్ కూడా విభిన్నమైన స్టైలిష్ మరియు స్పోర్టివ్ బాడీ గ్రాఫిక్స్ కలిగి ఉంది. ఇందులో కూడా సర్వీస్ డ్యూ ఇండికేటర్, క్లాక్ మరియు సీల్ చైన్ లో మెయింటెనెన్స్ వంటి వివరాలను తెలిపే అనలాగ్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్ ఉంది.

2018 ఎడిషన్ సిబి షైన్ ఎస్‌పి, లివో మరియు డ్రీమ్ యుగా బైకులు

సాంకేతికంగా 2018 ఎడిషన్ హోండా లివో బైకులో అదే మునుపటి 109.19సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 8.31బిహెచ్‌పి పవర్ మరియు 9ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 ఎడిషన్ సిబి షైన్ ఎస్‌పి, లివో మరియు డ్రీమ్ యుగా బైకులు

సరికొత్త 2018 హోండా లివో ఐదు విభిన్న రంగుల్లో లభ్యమవుతుంది. అవి, బ్లాక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, సన్‌సెట్ బ్రౌన్, మెటాలిక్ గ్రే, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ మరియు ఇంపీరియల్ రెడ్ మెటాలిక్. అదే విధంగా డ్రమ్ మరియు డిస్క్ వేరియంట్లలో లభిస్తోంది.

2018 ఎడిషన్ సిబి షైన్ ఎస్‌పి, లివో మరియు డ్రీమ్ యుగా బైకులు

2018 ఎడిషన్ హోండ్ డ్రీమ్ యుగా బైకులో రీఫ్రెష్డ్ గ్రాఫిక్స్, రీడిజైన్ చేయబడిన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, బాడీ కలర్ రియర్ వ్యూవ్ మిర్రర్లు మరియు లో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్లు ఉన్నాయి. దీనిని బ్లాక్ విత్ సన్సెట్ బ్రౌన్ మెటాలిక్‌తో సహా ఇప్పటికే ఉన్న మరో ఐదు విభిన్న రంగుల్లో లభ్యమవుతుంది.

2018 ఎడిషన్ సిబి షైన్ ఎస్‌పి, లివో మరియు డ్రీమ్ యుగా బైకులు

సాంకేతికంగా 2018 హోండా డ్రీమ్ యుగా బైకులో 110సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 4-స్పీడ్ గేర్‌బాక్స్ గల ఇది 8.25బిహెచ్‌పి పవర్ మరియు 8.63ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 ఎడిషన్ సిబి షైన్ ఎస్‌పి, లివో మరియు డ్రీమ్ యుగా బైకులు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా టూ వీలర్స్ ఇండియా లైనప్‌లో ఉన్న అతి కీలకమైన డ్రీమ్ యుగా, లివో మరియు సిబ షైన్ ఎస్‌పి బైకులను అప్‌డేటెడ్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. ఈ 2018 ఎడిషన్ బైకులు సరికొత్త కలర్ ఆప్షన్స్, న్యూ స్టైలింగ్ మరియు అధునాతన గ్రాఫిక్స్‌తో ఫ్రెష్ లుక్ సొంతం చేసుకున్నాయి.

ప్రస్తుతం స్కూటర్ల సెగ్మెంట్లో మరియు కమ్యూటర్ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లో హోండా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పుడు సరికొత్త ఎడిషన్‌లో విడుదలైన బైకులు హోండా టూ వీలర్స్ ఇండియాకు మరిన్ని సేల్స్ సాధించపెట్టనున్నాయి.

English summary
Read In Telugu: 2018 Honda CB Shine SP, Livo And Dream Yuga Launched In India; Prices Start At Rs 52,741
Story first published: Friday, March 16, 2018, 10:13 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark