హోండా సిబిఆర్250ఆర్ విడుదల: ధర రూ. 1.64 లక్షలు

Written By:

జపాన్ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా టూ వీలర్స్ విపణిలోకి హోండా సిబిఆర్250ఆర్ బైకును లాంచ్ చేసింది. హోండా సిబిఆర్250ఆర్ ఏబిఎస్ మరియు నాన్ ఏబిఎస్ వెర్షన్‌లలో లభిస్తోంది. రెండు వేరియంట్ల ప్రారంభ ధరలు రూ. 1.64 లక్షలు మరియు రూ. 1.93 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

హోండా టూ వీలర్స్ తొలుత హోండా సిబిఆర్250ఆర్ స్పోర్ట్స్ బైకును ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించింది.

హోండా సిబిఆర్ 250ఆర్

గత ఏడాది బిఎస్-IV ఉద్గార నియమాలు అందుబాటులోకి రావడంతో పాత ఇంజన్‌ కారణంతో మునుపటి సిబిఆర్250ఆర్ బైకును మార్కెట్ నుండి తొలగించింది. అయితే, మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా అత్యంత ఆకర్షణీయమైన ధరతో మళ్లీ లాంచ్ చేసింది.

హోండా సిబిఆర్ 250ఆర్

2018 ఎడిషన్ హోండా సిబిఆర్250ఆర్ బైకులో డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే, యువ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్ పరిచచయం చేసింది. కొత్త తరం హోండా సిబిఆర్250ఆర్ బైకును గ్రే మరియు రెడ్, గ్రే మరియు ఆరేంజ్, రెడ్ మరియు యెల్లో రంగుల్లో ఎంచుకోవచ్చు.

హోండా సిబిఆర్ 250ఆర్

సాంకేతికంగా 2018 హోండా సిబిఆర్250ఆర్ బైకులో బిఎస్-4 ఉద్గార నియమాలను పాటించే శక్తివంతమైన 249సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 26.5బిహెచ్‌పి పవర్ మరియు 22.9ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 135కిలోమీటర్లుగా ఉంది.

హోండా సిబిఆర్ 250ఆర్

ఈ బైకులో ఇరువైపులా 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, వీటికి ముందు వైపున 110ఎమ్ఎమ్ మరియు వెనుక వైపున 140ఎమ్ఎమ్ కొలతల్లో ఉన్న ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి. బ్రేకింగ్ విధుల కోసం ముందు వైపున 296ఎమ్ఎమ్ మరియు వెనుక వైపున 220ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

హోండా సిబిఆర్ 250ఆర్

భద్రత పరంగా ఇందులో ఆప్షనల్ డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ ఉంది. మెరుగైన సస్పెన్షన్ కోసం ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ప్రో-లింక్ మోనో-షాక్ సస్పెన్ ఉంది.

హోండా సిబిఆర్ 250ఆర్

సిబిఆర్250ఆర్ బైకులో డిజైన్ పరంగా ప్రతి రైడర్‌ను ఆకట్టుకునే అధునాతన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్, స్పోర్టివ్ గ్రాఫిక్స్ ఉన్నాయి. మునుపటి వెర్షన్ సిబిఆర్250ఆర్ బైకులో ఉన్న అన్ని ఫీచర్లు ఇందులో యథావిధిగా వచ్చాయి.

హోండా సిబిఆర్ 250ఆర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారత ప్రభుత్వం గత ఏడాది బిఎస్-4 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌ను తప్పనిసరి చేయడంతో సిబిఆర్250ఆర్ మరియు స్మాలర్ వెర్షన్ సిబిఆర్150ఆర్ బైకులను మార్కెట్ నుండి తొలగించింది. దాదాపు సంవ్సత్సరం తరువాత ఇప్పుడు సిబిఆర్250ఆర్ బైకును బిఎస్-4 ఇంజన్‌తో పలు మార్పులు చేర్పులు చేసి రీలాంచ్ చేసింది.

హోండా సిబిఆర్250ఆర్ విపణిలో ఉన్న కెటిఎమ్ ఆర్‌సి200, బజాజ్ పల్సర్ ఆర్ఎస్200, టీవీఎస్ అపాచే ఆర్ఆర్310 మరియు యమహా ఫేజర్ 25 వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

English summary
Read In Telugu: New Honda CBR250R Launched In India; Prices Start At Rs 1.64 Lakh
Story first published: Monday, April 2, 2018, 19:05 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark