2018 హోండా సీడీ110 డ్రీమ్ డిఎక్స్ విడుదల: ధర, ఇంజన్ మరియు ఫీచర్లు

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి 2018 హోండా సీడీ 110 డ్రీమ్ డిఎక్స్ బైకును లాంచ్ చేసింది. 2018 హోండా సీడీ 110 డ్రీమ్ డిఎక్స్ ధర రూ. 48,272 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

By Anil Kumar

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి 2018 హోండా సీడీ 110 డ్రీమ్ డిఎక్స్ బైకును లాంచ్ చేసింది. 2018 హోండా సీడీ 110 డ్రీమ్ డిఎక్స్ ధర రూ. 48,272 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

2018 హోండా సీడీ110 డ్రీమ్ డిఎక్స్ విడుదల

2018 వెర్షన్ హోండా సీడీ 110 డ్రీమ్ డిఎక్స్ బైకులో పలు కాస్మొటిక్ అప్‌డేట్స్ జరిగాయి. ఇప్పుడిది సరికొత్త అట్రాక్టిల్ గోల్డ్ కలర్ గ్రాఫిక్స్ మరియు క్రోమ్ మఫ్లర్ ప్రొటెక్టర్‌తో లభ్యమవుతోంది. పలు అవసరాలకు ఉపయోగపడే హెవీ డ్యూటీ క్యారీయర్‌ను కూడా ఇందులో అందివ్వడం జరిగింది.

2018 హోండా సీడీ110 డ్రీమ్ డిఎక్స్ బైకు విడుదల

సాంకేతికంగా 2018 హోండా సీడీ 110 డ్రీమ్ డిఎక్స్ బైకులో గాలితో చల్లబడే 110సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ హోండా ఇకో టెక్నాలజీ ఇంజన్ ఉంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 8.31బిహెచ్‌పి పవర్ మరియు 9.09ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 హోండా సీడీ110 డ్రీమ్ డిఎక్స్ బైకు విడుదల

2018 హోండా సీడీ 110 డ్రీమ్ డిఎక్స్‌లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. బ్రేకింగ్ విధులు నిర్వర్తించడానికి ఇరువైపులా 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేకులు అందివ్వడం జరిగింది మరియు రెండు చక్రాలు ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి.

2018 హోండా సీడీ110 డ్రీమ్ డిఎక్స్ బైకు విడుదల

2018 హోండా సీడీ 110 డ్రీమ్ డిఎక్స్ ఐదు విభిన్న కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది అవి, బ్ల్యాక్-క్యాబిన్ గోల్డ్, బ్ల్యాక్-గ్రీన్ మెటాలిక్, బ్ల్యాక్-గ్రే సిల్వర్, బ్ల్యాక్-రెడ్ మరియు బ్ల్యాక్-బ్లూ మెటాలిక్.

2018 హోండా సీడీ110 డ్రీమ్ డిఎక్స్ బైకు విడుదల

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సేల్స్ మరియు మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యడ్విందర్ సింగ్ గులేరియా ఈ సందర్భంగా మాట్లాడుతూ, "సీడీ మోటార్ సైకిల్ బ్రాండ్ 1966 నుండి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకుంది. ఈ వారసత్వానికి కొనసాగింపుగా 2018 హోండా సీడీ 110 డ్రీమ్ డిఎక్స్ బైకునే అదే నమ్మకం మరియు విశ్వసనీయతతో ప్రవేశపెట్టినట్లు చెప్పుకొచ్చాడు."

2018 హోండా సీడీ110 డ్రీమ్ డిఎక్స్ బైకు విడుదల

2014లో ఇండియన్ మార్కెట్లోకి విడుదైలనప్పటి నుండి హోండా సీడీ 100 డ్రీమ్ పాపులర్ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌గా నిలిచింది. నూతన మోడల్‌లో విశాలమైన హ్యాండిల్ బార్స్ ద్వారా సిటీలో సులభంగా రైడ్ చేయవచ్చు. 8-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి గల ఈ బైకు మొత్తం బరువు 109కిలోలుగా ఉంది.

2018 హోండా సీడీ110 డ్రీమ్ డిఎక్స్ బైకు విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా టూ వీలర్స్ హోండా సీడీ డ్రీమ్ డిఎక్స్ బైకును పలు కాస్మొటిక్ అప్‌డేట్స్‌తో 2018 ఎడిషన్‌లో లాంచ్ చేసింది. సాంకతేకంగా మరియు ఫీచర్ల పరంగా మునుపటి మోడల్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. గ్రామీణ మరియు పట్టణ అవసరాలకు హోండా సీడీ 100 డ్రీమ్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 10, 2018, 19:09 [IST]
English summary
Read In Telugu: 2018 Honda CD 110 Dream DX Launched In India; Priced At Rs 48,272
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+