2018 హోండా డియో స్కూటర్ విడుదల: ధర, ఇంజన్ మరియు ఫీచర్లు

Written By:

2018 హోండా డియో విపణిలోకి విడుదలయ్యింది. హోండా టూ వీలర్స్ దేశీయ స్కూటర్ల విపణిలోకి నూతన 2018 ఎడిషన్ డియో స్కూటర్‌ను పలు రకాల అప్‌డేట్స్‌తో ప్రవేశపెట్టింది. నూతన కలర్ అప్‌డేట్స్ మరియు ఫీచర్లతో వచ్చిన 2018 హోండా డియో ప్రారంభ ధర రూ. 50,296 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

2018 హోండా డియో స్కూటర్ విడుదల: ధర, ఇంజన్ మరియు ఫీచర్లు

2018 హోండా డియో బేస్ వేరియంట్ ధర రూ. 50,296 లు మరియు హోండా డియో ఎస్‌టిడి వేరియంట్ ధర రూ. 51,292 లు అఏదే విధంగా హోండా డియో డిఎల్ఎక్స్ వేరియంట్ ధర రూ. 53,292 లు. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

2018 హోండా డియో స్కూటర్ విడుదల: ధర, ఇంజన్ మరియు ఫీచర్లు

సాంకేతికంగా 2018 హోండా డియో స్కూటర్‌లో అదే మునుపటి 109.19సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. బిఎస్-4 ఉద్గార ప్రమాణాలను పాటించే ఇదే గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 8.91ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. వి-మ్యాటిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల స్కూటర్ గరిష్ట వేగం గంటకు 83కిలోమీటర్లుగా ఉంది.

2018 హోండా డియో స్కూటర్ విడుదల: ధర, ఇంజన్ మరియు ఫీచర్లు

2018 హోండా డియో డిఎల్ఎక్స్ స్కూటర్‌ను నాలుగు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి, డాజిల్ యెల్లో మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే, మెటాలిక్, మ్యాట్ మార్షల్ గ్రీన్ మెటాలిక్ మరియు పర్ల్ ఇగ్నియస్ బ్లాక్. అంతే కాకుండా, 2018 హోండా డియో స్కూటర్‌లో నూతన బాడీ గ్రాఫిక్స్, గోల్డెన్ రిమ్స్ మరియు బాడీ కలర్ గ్రాబ్ రెయిల్స్ ఉన్నాయి.

2018 హోండా డియో స్కూటర్ విడుదల: ధర, ఇంజన్ మరియు ఫీచర్లు

2018 హోండా డియో స్కూటర్‌లో పొజిషన్ ల్యాంప్ గల ఎల్ఇడి హెడ్‌ల్యాంప్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్, ఇకో స్పీడ్ ఇండికేటర్ గల డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, సీట్ ఓపెనింగ్‌తో సహా ఉన్న 4-ఇన్-1 లాక్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, ఫ్రంట్ హుక్ మరియు రిట్రాక్టబుల్ రియర్ హుక్ వంటి అప్‌డేటెడ్ ఫీచర్స్ ఎన్నో ఇందులో వచ్చాయి.

2018 హోండా డియో స్కూటర్ విడుదల: ధర, ఇంజన్ మరియు ఫీచర్లు

సరికొత్త అప్‌డేటెడ్ 2018 హోండా డియో స్కూటర్లో ఇరు చక్రాలకు ట్యూబ్ లెస్ టైర్లను అందివ్వడం జరిగింది. బ్రేకింగ్ విధులను నిర్వర్తించడానికి ఇరువైపులా కాంబి బ్రేకింగ్ సిస్టమ్ డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. కానీ, ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మిస్సయ్యింది. డిజైన్ పరంగా స్కూటర్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

2018 హోండా డియో స్కూటర్ విడుదల: ధర, ఇంజన్ మరియు ఫీచర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2018 హోండా డియో ఫీచర్లు మరియు డిజైన్ పరంగా స్వల్ప అప్‌డేట్స్‌తో వచ్చింది. యాక్టివా 5జీ నుండి సేకరించిన పూర్తి స్థాయి ఎల్ఇడి హెడ్‌ల్యాంప్ 2018 హోండా డియోలో వచ్చింది. హోండా డియో ఇండియన్ స్కూటర్ మార్కెట్లో పాపులర్ మోడల్‌గా నిలిచింది. హోండా డియో విపణిలో ఉన్న యమహా సిగ్నస్ రే జడ్, టీవీఎస్ ఎన్‌టార్క్ మరియు హీరో డ్యూయెట్ వంటి స్కూటర్లకు గట్టి పోటీనిస్తుంది.

English summary
Read In Telugu: 2018 Honda Dio Launched In India; Prices Start At Rs 50,296
Story first published: Tuesday, May 8, 2018, 9:56 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark