సరికొత్త హోండా నవీ స్కూటర్ విడుదల: కొత్తదనమేంటి ?

హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి సరికొత్త 2018 నవీ స్కూటర్‌ను లాంచ్ చేసింది. సరికొత్త 2018 హోండా నవీ టూ వీలర్ ప్రారంభ ధర రూ. 44,775 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

By Anil Kumar

ప్రస్తుతం ఉన్న పాత తరం హోండా నవీ కంటే కొత్త వెర్షన్ హోండా నవీ ధర రూ. 1,991 లు ఎక్కువగా ఉంది. ఈ ఎక్కువ ధరకు 2018 హోండా నవీ స్కూటర్‌లో పలు కాస్మొటిక్ అప్‌డేట్స్ చోటు చేసుకున్నాయి. కానీ, దీనిని హోండా యాక్టివా ఫ్లాట్‌ఫామ్ మీదనే నిర్మిస్తున్నారు.

సరికొత్త హోండా నవీ స్కూటర్ విడుదల: కొత్తదనమేంటి ?

హోండా టూ వీలర్స్ ఈ హోండా నవీ టూ వీలర్‌ను 2016లో తొలిసారిగా విడుదల చేసింది. ఇండియాలో ఉన్న హోండా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బృందం పూర్తి స్థాయిలో డిజైన్ చేసిన మొదటి మోడల్ హోండా నవీ. నవీ టూ వీలర్‌ను ప్రస్తుతం లాటిన్ అమెరికా వంటి విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు.

సరికొత్త హోండా నవీ స్కూటర్ విడుదల: కొత్తదనమేంటి ?

2018 ఎడిషన్ హోండా నవీ టూ వీలర్‌లో సరికొత్త ఫ్యూయల్ గేజ్ మరియు మెటల్ మఫ్లర్ ప్రొటెక్టర్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా, గ్రాబ్ రెయిల్, హెడ్ లైట్ కవర్ మరియు రియర్ వ్యూవ్ మిర్రర్స్ వంటి ఎలిమెంట్లకు ప్రత్యేకమైన బాడీ కలర్ అందివ్వడం జరిగింది. అంతే కాకుండా ఎరుపు రంగులో ఉన్న కుషన్ స్ప్రింగ్ ఉంది.

సరికొత్త హోండా నవీ స్కూటర్ విడుదల: కొత్తదనమేంటి ?

సరికొత్త హోండా నవీ రెండు విభిన్న కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. అవి, రేంజ్ గ్రీన్ మరియు లడఖ్ బ్రౌన్. నూతన పెయింట్ స్కీమ్‌తో పాటు హోండా నవీ స్కూటర్ పలు విసృతమైన కస్టమైజేషన్ ఆప్షన్స్ మరియు యాక్ససరీలతో లభిస్తోంది.

సరికొత్త హోండా నవీ స్కూటర్ విడుదల: కొత్తదనమేంటి ?

హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్ మరియు మార్కెటింగ్ సీనియయర్ వైస్ ప్రెసిడెంట్ యడ్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ, "ఇండియన్ టూ వీలర్ మార్కెట్లోకి హోండా నవీ ఒక కొత్త వాతావరణాన్ని తీసుకొచ్చింది. తన విభిన్నమైన స్టైలింగ్, డిజైన్ మరియు స్పోర్టివ్ శైలితో యువ కొనుగోలుదారులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చాడు."

సరికొత్త హోండా నవీ స్కూటర్ విడుదల: కొత్తదనమేంటి ?

సాంకేతికంగా 2018 హోండా నవీ స్కూటర్‌లో యాక్టివా నుండి సేకరించిన అదే 109సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 8బిహెచ్‌పి పవర్ మరియు 9ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

సరికొత్త హోండా నవీ స్కూటర్ విడుదల: కొత్తదనమేంటి ?

2018 ఎడిషన్ హోండా నవీ స్కూటర్‌లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ కలదు. ఇందులో ముందు వైపున 12-అంగుళాల మరియు వెనుక వైపున 10-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ ట్యూబ్ లెస్ టైర్లను కలిగి ఉన్నాయి.

సరికొత్త హోండా నవీ స్కూటర్ విడుదల: కొత్తదనమేంటి ?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా టూ వీలర్స్ ఇండియా లైనప్‌లో ఉన్న విభిన్నమైన మోడల్ హోండా నవీ. స్కూటర్ మరియు బైకు లక్షణాలను కలగలిపి క్రాసోవర్ స్కూటర్ తరహాలో డిజైన్ చేసారు. రెండేళ్ల క్రితం దేశీయ విపణిలోకి విడుదలైన హోండా నవీ ఆశించిన సేల్స్ సాధించలేకపోయింది. దీంతో పలు మార్పులు చేర్పులు నిర్వహించి రీలాంచ్ చేసింది.

More from DriveSpark

Article Published On: Monday, July 23, 2018, 10:28 [IST]
English summary
Read In Telugu:New Honda Navi Launched In India; Priced At Rs 44,775
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+