2019 కవాసకి నింజా 1000 విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

కవాసకి మోటార్స్ ఇండియా విభాగం నింజా 1000 2019 మోడల్‌ను దేశీయ విపణిలోకి లాంచ్ చేసింది. సరికొత్త 2019 కవాసకి నింజా 1000 ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

By Anil Kumar

2019 కవాసకి నింజా 1000 ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. కవాసకి మోటార్స్ ఇండియా విభాగం నింజా 1000 2019 మోడల్‌ను దేశీయ విపణిలోకి లాంచ్ చేసింది. సరికొత్త 2019 కవాసకి నింజా 1000 ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

2019 కవాసకి నింజా 1000

2019 కవాసకి నింజా 1000 బైకులో కాస్మొటిక్స్ పరంగా కొద్దిగా మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే, నింజా 1000లో సాంకేతికంగా ఎలాంటి మార్పులు జరగలేదు. కవాసకి నింజా 1000 బ్ల్యాక్ మరియు గ్రీన్ రెండు కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది.

2019 కవాసకి నింజా 1000

కవాసకి ఇండియా ప్రస్తుతం నింజా 1000 మోటార్ సైకిల్ విడి భాగాలను జపాన్ నుండి సెమీ-నాక్డ్-డౌన్ యూనిట్‌గా దిగుమతి చేసుకొని పూనే ప్లాంటులో అసెంబుల్ చేసి విక్రయిస్తోంది.

2019 కవాసకి నింజా 1000

కవాసకి ఇండియా మేనేజింగ్ డైరక్టర్ యుటాకా యమషిట మాట్లాడుతూ, "నింజా 1000 బైకును 2019 మోడల్‌లో ఇండియాతో పాటు మిగతా ఇతర మార్కెట్లలో కూడా ఈ రోజే విడుదల చేసినట్లు కంపెనీ ప్రతినిధులను ఉద్దేశించి చెప్పుకొచ్చాడు."

2019 కవాసకి నింజా 1000

"కవాసకి నింజా 1000 మోడల్‌కు ఇండియన్ మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. అందు కోసం తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ వెర్షన్‌లో అందించేందుకు 2019 మోడల్‌లో ప్రవేశపెట్టినట్లు వివరించాడు."

2019 కవాసకి నింజా 1000

2019 కవాసకి నింజా 1000 బైకులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, త్రీ-స్టేజ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ స్టాండర్డ్‌గా వచ్చాయి. అంతే కాకుండా, డ్యూయల్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్, చిన్ స్పాయిలర్ మరియు స్లిప్పర్ క్లచ్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

2019 కవాసకి నింజా 1000

సరికొత్త నింజా 1000 బైకులో అదే మునుపటి 1,043సీసీ కెపాసిటి గల ఇన్-లైన్ నాలుగు సిలిండర్ల లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 140బిహెచ్‌పి పవర్ మరియు 111ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2019 కవాసకి నింజా 1000

2019 కవాసకి నింజా 1000 బైకులో 19-లీటర్ల కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్ కలదు మరియు దీని మొత్తం బరువు 239కిలోలుగా ఉంది. బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ వీల్‌కు 300ఎమ్ఎమ్ డ్యూయల్ పెటల్ డిస్క్ మరియు రియర్ వీల్‌కు 240ఎమ్ఎమ్ సింగల్ పెటల్ డిస్క్ బ్రేకులు అందివ్వడం జరిగింది.

2019 కవాసకి నింజా 1000

నింజా 1000 బైకులో మూడు విభిన్న ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ ఉన్నాయి. మొదటి రెండు మోడ్‌లలో స్పోర్టివ్ రైడింగ్ పర్ఫామెన్స్ లభిస్తుంది. జారుడు తలాల మీద పటిష్టాన్ని పెంచడంలో మోడ్ 3 సహాయపడుతుంది.

2019 కవాసకి నింజా 1000

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2019 మోడల్‌ కవాసకి నింజా 1000 బైకులో కేవలం కాస్మొటిక్స్ మార్పులు మాత్రమే జరిగాయి. మునుపటి జనరేషన్‌తో పోల్చుకుంటే సాంకేతికంగా మరియు డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు. దేశవ్యాప్తంగా ఉన్న కవాసకి డీలర్ల వద్ద 2019 నింజా 1000 మీద బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

2019 కవాసకి నింజా 1000

సరికొత్త కవాసకి నింజా 1000 విపణిలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000ఆర్, సుజుకి జిఎస్ఎక్స్ ఎస్1000 మరియు డుకాటి సూపర్‌స్పోర్ట్ మోడళ్లకు గట్టిపోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: 2019 Kawasaki Ninja 1000 Launched In India — Priced At Rs 9.99 Lakh
Story first published: Tuesday, June 19, 2018, 13:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X