2018 కవాసకి నింజా 300 ఏబిఎస్ విడుదల: ధర రూ. 2.98 లక్షలు

కవాసకి ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త 2018 నింజా 300 ఏబిఎస్ బైకును లాంచ్ చేసింది. ఇప్పుడు సరికొత్త 2018 కవాసకి నింజా 300 ఏబిఎస్ వెర్షన్ అత్యంత సరసమైన ధరల శ్రేణి రూ.

By Anil Kumar

జపాన్‍‌కు చెందిన అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త 2018 నింజా 300 ఏబిఎస్ బైకును లాంచ్ చేసింది. ఇప్పుడు సరికొత్త 2018 కవాసకి నింజా 300 ఏబిఎస్ వెర్షన్ అత్యంత సరసమైన ధరల శ్రేణి రూ. 2.98 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధరతో లభిస్తోంది.

2018 కవాసకి నింజా 300 ఏబిఎస్ విడుదల: ధర రూ. 2.98 లక్షలు

2018 కవాసకి నింజా 300 ఏబిఎస్ వెర్షన్‌లో నూతన బాడీ గ్రాఫిక్స్‌ మరియు కొత్త కలర్ ఆప్షన్స్‌తో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ కూడా వచ్చింది. ఏబిఎస్ టెక్నాలజీ జోడింపు గల అత్యంత సురక్షితమైన నింజా 300 ఏబిఎస్ బైకు పూర్తి స్థాయిలో దేశీయంగా తయారైన విడి భాగాలతో దేశీయంగానే తయారవుతోంది. దీంతో మునుపటి మోడల్ కంటే దీని ధర రూ. 62,000 వరకు దిగొచ్చింది.

2018 కవాసకి నింజా 300 ఏబిఎస్ విడుదల: ధర రూ. 2.98 లక్షలు

2018 వెర్షన్ కవాసకి నింజా 300 ఏబిఎస్ ఇప్పుడు రెండు విభిన్న కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుంతోంది. అవి, లైమ్ గ్రీన్/ ఎబోనీ మరియు క్యాండీ పాల్మా బ్లూ. ఇతర కీలకమైన డిజైన్ ఎలిమెంట్లలో ఫెయిరింగ్ మీద నింజా బ్రాండ్ పేరు, డ్యూయల్ హెడ్ ల్యాంప్ సెటప్ మరియు గాలి ప్రవాహాన్ని అరికట్టే విండ్ షీల్డ్ గల పదునైన ఫ్రంట్ డిజైన్ దీని సొంతం.

2018 కవాసకి నింజా 300 ఏబిఎస్ విడుదల: ధర రూ. 2.98 లక్షలు

2018 నింజా 300 ఏబిఎస్ బైకులో ఎమ్ఆర్ఎఫ్ టైర్లు మరియు ఎండ్యూరెన్స్ బ్రేకులు ఉన్నాయి. మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే రైడర్ సీటు 5ఎమ్ఎమ్ మరియు బైకు మొత్తం బరువు 7 కిలోల వరకు తగ్గి 179కిలోలుగా ఉంది. అయితే, డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు.

2018 కవాసకి నింజా 300 ఏబిఎస్ విడుదల: ధర రూ. 2.98 లక్షలు

సాంకేతికంగా 2018 కవాసకి నింజా 300 ఏబిఎస్ బైకులో 296సీసీ కెపాసిటి గల ప్యార్లల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ ఉంది. స్లిప్పర్ క్లచ్ సహాయంతో 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 38బిహెచ్‌పి పవర్ మరియు 27ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 కవాసకి నింజా 300 ఏబిఎస్ విడుదల: ధర రూ. 2.98 లక్షలు

సస్పెన్షన్ పరంగా నంజా 300 ఏబిఎస్ వెర్షన్‌లో ముందు వైపున 37ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ ఉంది. బ్రేకింగ్ విధులు నిర్వర్తించడానికి ముందు వైపున డ్యూయల్ పిస్టన్ కాలిపర్స్ గల 290ఎమ్ఎమ్ పెటల్ డిస్క్ మరియు వెనుక వైపున 220ఎమ్ఎమ్ పెటల్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. మెరుగైన బ్రేకింగ్ కోసం డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను తప్పనిసరిగా అందివ్వడం జరిగింది.

2018 కవాసకి నింజా 300 ఏబిఎస్ విడుదల: ధర రూ. 2.98 లక్షలు

ఇండియా కవాసకి మోటార్స్ మేనేజింగ్ డైరక్టర్, యుటాకా యమషిట మాట్లాడుతూ, "కవాసకి ఉత్పత్తుల జాబితాలో నింజా 300 ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకు. కస్టమర్లు తొలుత నింజా 300 ను ఎంచుకుని తరువాత ఎక్కువ సామర్థ్యం ఉన్న మోడళ్లకు అప్‌గ్రేడ్ అవుతున్నట్లు గుర్తించామని తెలిపాడు. దీంతో, తమ బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిల్ నింజా 300 బైకును అత్యంత సరసమైన ధరతో రీలాంచ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు."

2018 కవాసకి నింజా 300 ఏబిఎస్ విడుదల: ధర రూ. 2.98 లక్షలు

జపాన్ దిగ్గజం కవాసకి ఎట్టకేలకు నింజా 300 బైకును ఏబిఎస్ సేఫ్టీ ఫీచర్‌తో పూర్తి స్థాయిలో దేశీయంగా ఉత్పత్తి చేసిన వెర్షన్‌ను లాంచ్ చేసింది. 2018 నింజా 300 చూడటానికి అచ్చం మునుపటి మోడల్‌నే పోలి ఉంటుంది. కానీ నూతన కలర్ అప్‌డేట్స్ మరియు ఏబిఎస్ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని చూపెడతాయి. 2018 కవాసకి నింజా 300 ఏబిఎస్ విపణిలో ఉన్న కెటిఎమ్ ఆర్సీ390, టీవీఎస్ అపాచే ఆర్ఆర్310, యమహా ఆర్3 మరియు బెనెల్లీ 302ఆర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, July 23, 2018, 11:29 [IST]
English summary
Read In Telugu: 2018 Kawasaki Ninja 300 ABS Launched In India; Priced At Rs 2.98 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+