విపణిలోకి కవాసకి హెచ్2 సిరీస్ బైకులు: వీటి ధరతో ఆడి, బెంజ్ కార్లే కొనొచ్చు

కవాసకి నేడు ఇండియన్ మార్కెట్లోకి అత్యంత ఖరీదై మూడు సూపర్ బైకులను విడుదల చేసింది. కవాసకి నింజా హెచ్2 ధర రూ. 34.50 లక్షలు, నింజా హెచ్2 కార్బన్ ధర రూ. 41 లక్షలు మరియు నింజా హెచ్2ఆర్ ధర రూ. 72 లక్షలు. అన్

By Anil Kumar

జపాన్ దిగ్గజం కవాసకి నేడు ఇండియన్ మార్కెట్లోకి అత్యంత ఖరీదై మూడు సూపర్ బైకులను విడుదల చేసింది. కవాసకి నింజా హెచ్2 ధర రూ. 34.50 లక్షలు, నింజా హెచ్2 కార్బన్ ధర రూ. 41 లక్షలు మరియు నింజా హెచ్2ఆర్ ధర రూ. 72 లక్షలు. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

నిజానికి వీటికి చెల్లించే ధరతో ఏకంగా ఆడి, బెంజ్, రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్లనే ఎంచుకోవచ్చు. అత్యంత ఖరీదైన ఈ బైకుల్లో ఉన్న ప్రత్యేకతేంటో చూద్దాం రండి...

కవాసకి నింజా హెచ్2ఆర్

కవాసకి విడుదల చేసిన 2019 నింజా హెచ్2 సిరీస్ బైకుల్లో అత్యంత శక్తివంతమైన 998సీసీ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది ఏకంగా 227బిహెచ్‌పి పవర్ మరియు 141.7ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కవాసకి నింజా హెచ్2ఆర్

గతంలో ఉన్నటువంటి హెచ్2 సిరీస్ బైకుల కంటే 2019 మోడళ్లలో ఉన్న ఇంజన్ 20బిహెచ్‌పి పవర్ ఎక్కువగా ఇస్తుంది. అయితే, 2019 కవాసకి నింజా హెచ్2 బైకులో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటి గల టిఎఫ్‌టి కలర్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చింది. రైడర్ ఈ డిస్ల్పే ద్వారా జీపీఎస్ న్యావిగేషన్‌తో పాటు బైకు గురించి మొత్తం సమాచారాన్ని పొందవచ్చు.

కవాసకి నింజా హెచ్2ఆర్

2019 వెర్షన్ కవాసకి నింజా హెచ్2 బైకులో బ్రెంబో స్టైలెమా మోనోబ్లాక్ కాలిపర్లు వచ్చాయి. ఈ కాలిపర్లలోని పిస్టన్ మరియు బ్రేక్ ప్యాడ్స్ చిన్నగా ఉండటంతో అంతర్గతంగా ఉన్న స్పేస్ తగ్గి మెరుగైన మరియు పటిష్టమైన బ్రేకింగ్ సాధ్యమవుతుంది.

కవాసకి నింజా హెచ్2ఆర్

అంతే కాకుండా 2019 కవాసకి నింజా హెచ్2 బైకులో ఎక్కువ కాలం మన్నికొచ్చే స్పెషల్ పెయింట్ స్కీమ్ వచ్చింది. ఒక వేళ ఏవైనా గీతలు పడితే, దానంతట అదే గీతలను మాయం చేసుకుంటుంది. హెచ్2 బైకులో ఇరువైపులా బ్రిడ్జ్‌స్టోన్ ఆర్ఎస్11 స్పోర్ట్ టైర్లు వచ్చాయి. వీటితో పాటు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్, టర్న్ సిగ్నల్స్, పొజిషన్ ల్యాంప్స్ మరియు లైసెన్స్ ప్లేట్ ల్యాంప్ వచ్చింది.

కవాసకి నింజా హెచ్2ఆర్

2019 కవాసకి నింజా హెచ్2ఆర్ బైకులో కూడా బ్రెంబో స్టైలెమా మోనోబ్లాక్ కాలిపర్స్ వచ్చాయి. బైకు బాడీ మీద పడే గీతలను రిపేరీ చేసుకునే పెయింట్ స్కీమ్, సూపర్‌ఛార్జ్‌డ్ చిహ్నం వంటివి ఇందులో అదనంగా వచ్చాయి. అయితే, మూడు బైకులను కూడా కంప్లిట్లీ బిల్ట్ యూనిట్లుగా దిగుమతి చేసుకుని విక్రయించనుంది.

కవాసకి నింజా హెచ్2ఆర్

కవాసకి నింజా హెచ్2 సిరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2019 మోడళ్ల మీద సెప్టెంబర్ 1, 2018 నుండి ఆక్టోబర్ 31, 2018 మధ్య కాలంలో కవాసకి బుకింగ్స్ స్వీకరిస్తుంది మరియు వీటి డెలివరీ 2019లో చేపట్టనుంది.

కవాసకి నింజా హెచ్2ఆర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కవాసకి ఇండియా పలు మార్పులు చేర్పులతో 2019 వెర్షన్ నింజా హెచ్2, హెచ్2 కార్బన్ మరియు హెచ్2ఆర్ బైకును దేశీయంగా ప్రవేశపెట్టింది. మునుపటి ఇంజన్ కంటే ఎక్కువ పవర్ ఉత్పత్తి చేసే ఇంజన్ మరియు బైక్ ఎక్ట్సీరియర్‌లో ఏర్పడే గీతలను దానంతట అదే రిపేరీ చేసుకునే ఫీచర్లు అత్యంత కీలకమైన మార్పులుగా చెప్పుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, August 24, 2018, 9:27 [IST]
English summary
Read In Telugu: 2019 Kawasaki Ninja H2, H2 Carbon And H2R Launched In India; Prices Start At 34.50 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+