2018 సుజుకి బందిత్ 150 బైకును ఆవిష్కరించిన సుజుకి టూ వీలర్స్

జపాన్ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి , సరికొత్త 2018 బందిత్ 150 బైకును ఆవిష్కరించింది. ఇండినోషియాలోని జకార్తా వేదికగా జరుగుతున్న 2018 గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షోలో సుజుకి 2018 బందిత

By Anil Kumar

జపాన్ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి , సరికొత్త 2018 బందిత్ 150 బైకును ఆవిష్కరించింది. ఇండినోషియాలోని జకార్తా వేదికగా జరుగుతున్న 2018 గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షోలో సుజుకి 2018 బందిత్ 150 మోటార్ సైకిల్‌ను ప్రదర్శించింది.

సుజుకి బందిత్ 150 మోటార్ సైకిల్ గురించి మరిన్ని వివరాలు మరియు ఫోటోల కోసం....

2018 సుజుకి బందిత్ 150 బైకును ఆవిష్కరించిన సుజుకి టూ వీలర్స్

సుజుకి జిఎస్ఎక్స్-ఎస్150 నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ మోటార్ సైకిల్ ఆధారంగా సుజుకి బందిత్ 150 బైకును అభివృద్ది చేసారు. దీనిని ప్రత్యేకించి ఇండోనేషియా మార్కెట్ కోసం అభివృద్ది చేసినట్లు తెలిసింది.

2018 సుజుకి బందిత్ 150 బైకును ఆవిష్కరించిన సుజుకి టూ వీలర్స్

సుజుకి ఇండోనేషియా లైనప్‌లోని జిఎస్ఎక్స్-ఎస్150 బైకు క్రింది స్థానాన్ని భర్తీ చేస్తుంది. కమ్యూటర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లోకి తీసుకొచ్చిన సుజుకి బందిత్ 150 ఓవరాల్ డిజైన్ స్పోర్టివ్ శైలిలో ఉంటుంది.

2018 సుజుకి బందిత్ 150 బైకును ఆవిష్కరించిన సుజుకి టూ వీలర్స్

2018 సుజుకి బందిత్ బైకులో చతర్భుజాకారంలో ఉన్న ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇంస్ట్రుమెంటల్ క్లస్టర్ మరియు కండలు తిరిగిన రూపంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, సింగల్ పీస్ సీటు, సెంటర్-సెట్ ఫుట్-పెగ్స్ మరియు సులభతరమైన రైడింగ్ అవసరాలకు ఫ్లాట్ హ్యాండిల్ బార్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

2018 సుజుకి బందిత్ 150 బైకును ఆవిష్కరించిన సుజుకి టూ వీలర్స్

2018 సుజుకి బందిత్ 150 బైకులో 147.3సీసీ సామర్థ్యం గల లిక్విడ్-కూల్డ్ డీఓహెచ్‌సీ, సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 19.2బిహెచ్‌పి పవర్ మరియు 14ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 సుజుకి బందిత్ 150 బైకును ఆవిష్కరించిన సుజుకి టూ వీలర్స్

150సీసీ సెగ్మెంట్లో ఇది అన్నింటి కంటే శక్తివంతమైన ఇంజన్ చెప్పవచ్చు. ఇండియన్ వెర్షన్ జిక్సర్ బైకులో ఉన్న ఇంజన్ సైతం కేవలం 14.5బిహెచ్‌పి పవర్ మరియు 14ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 సుజుకి బందిత్ 150 బైకును ఆవిష్కరించిన సుజుకి టూ వీలర్స్

సుజుకి బందిత్ 150 బైకులో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ ఉంది. బ్రేకింగ్ విధులు నిర్వహించేందుకు ఇరువైపులా డిస్క్ బ్రేకులు ఉన్నాయి. అయితే, కనీసం ఆప్షనల్‌గా కూడా ఏబిఎస్ టెక్నాలజీ అందివ్వలేదు. జిక్సర్ బైకుల తరహాలో బందిత్‌లో కూడా డ్యూయల్ పోడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉంది.

2018 సుజుకి బందిత్ 150 బైకును ఆవిష్కరించిన సుజుకి టూ వీలర్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారత ద్విచక్ర వాహన పరిశ్రమలో కమ్యూటర్ మోటార్ సైకిళ్ల వాటా అధికంగా ఉంది. అయితే, సుజుకి ఆవిష్కరించిన బందిత్ 150 బైకు కమ్యూటర్ మోటార్ సైకిల్ కావడంతో భవిష్యత్తులో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సుజుకి ఇండియా ఒక్కసారి బందిత్ 150 బైకును దేశీయంగా లాంచ్ చేస్తే విపణిలో ఉన్న అన్ని 150 మరియు 160సీసీ బైకులకు గట్టి పోటీనిస్తుంది.

Image Courtesy: OTO

More from DriveSpark

Article Published On: Saturday, August 4, 2018, 14:33 [IST]
English summary
Read In Telugu: 2018 Suzuki Bandit 150 Revealed At Indonesia International Auto Show
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+